TWITTER INTRODUCING NEW FEATURE FOLLOWER REMOVE USING SOFT BLOCK FEATURE EVK
Twitter Feature: ట్వీట్టర్లో అదిరిపోయే ఫీచర్.. సాఫ్ట్ బ్లాక్
(ప్రతీకాత్మక చిత్రం)
ట్విట్టర్(Twitter) సరికొత్త ఫీచర్‌ను వినియోగదారుల ముందు ఉంచుతోంది. ముఖ్యంగా ఈ సారి వినియోగదారుల సెక్యూరిటీ(Security) ఫీచర్స్‌ను మెరుగ్గా తయారు చేసేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అదే సాఫ్ట్ బ్లాక్(Soft Block) ఫీచర్ ఈ ఫీచర్.
ట్విట్టర్(Twitter) సరికొత్త ఫీచర్‌ను వినియోగదారుల ముందు ఉంచుతోంది. ముఖ్యంగా ఈ సారి వినియోగదారుల సెక్యూరిటీ ఫీచర్స్‌ను మెరుగ్గా తయారు చేసేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అదే సాఫ్ట్ బ్లాక్ ఫీచర్ ఈ ఫీచర్ ద్వారా అపరిచిత వ్యక్తులను బ్లాక్ చేయకుండానే మీ ట్విట్టర్ ఖాతా(Account)లో కామెంట్ చేయకుండా తొలగించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్ష(Testing) దశలో ఉంది. త్వరలో ఈ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఎలా వినియోగించవచ్చు..
మీరు ట్విట్టర్ ఖాతా వాడుతుంటే ఎవరైన అపరిచిత వ్యక్తులు(Unknown persons) మీ ఖాతాను ఫాలో అవుతుంటారు. ఇది సహజం. వారు మీకు నచ్చని కామెంట్లను పెడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే సాధారణంగా బ్లాక్ చేసే ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ ఇక మీద అపరిచితులు మీ ఫ్రొఫైల్ ఖాతా నుంచి అన్‌ఫాలో(unfollow) అయ్యేలా మీరే తీసేయొచ్చు అదే సాఫ్ట్ బ్లాక్ ఫీచర్. అలా చేస్తే ఇకపై మీ పోస్టులు, మీ ట్వీట్లు ఆ వ్యక్తికి కనబడవు. అలాగే అతను మీ టైమ్‌లోనే కనిపించడు. ఇది యూజర్ ప్రైవసీ(Privacy)కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఇది బ్లాక్ చేయడం కంటే చాలా భిన్నమైంది. మీకు నచ్చని వారు, మీరు వద్దు అనుకొన్నవారు మీ ట్వీట్లను చూడలేరు, మీకు నేరుగా మెసేజ్(Message) చేయకుండా ఈ ఫీచర్ ఉపయోగ పడుతుంది. రిమోట్ ఫాలో అన్‌ఫాలో చేసే ఫీచర్ ఎంతో బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కేవలం ఫాలో ఆప్షన్(Option) మార్చడం ద్వారానే మీకు నచ్చని వారిని సున్నితంగా దూరం పెట్టవచ్చు.
మీకు తెలియకుండా ఎవరైనా మిమ్మల్ని అనుసరించకుండా ఉండటానికి, మీరు "సాఫ్ట్ బ్లాక్" చేయవచ్చు, అంటే మీరు ఒకరిని మాన్యువల్‌గా బ్లాక్ చేసి, అన్‌బ్లాక్ చేసినప్పుడు. మీరు తీసివేసిన ఖాతా వ్యక్తి మీ ట్వీట్లను వారి టైమ్‌లైన్(Time line)లో చూడాలంటే తిరిగి మిమ్మల్ని మళ్లీ అనుసరించాల్సి ఉంటుంది. మీరు రక్షిత ట్వీట్లను కలిగి ఉంటే వారికి మళ్లీ అనుచరుడిగా మారడానికి మీ ఆమోదం అవసరం.
అనుచిత వ్యక్తుల కామెంట్లకు సరైన పరిష్కారం వారు మీ ట్వీట్(Tweet) చూడకుండా చేయడమే. సాఫ్ట్ బ్లాక్ అపరిచిత వ్యక్తుల నియంత్రకు ఉపయోగంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్(Instagram)లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్(Close Friend) ఆప్షన్‌ను ట్విట్టర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీని ద్వారా మరింత సమర్థవంతంగా అనుచిత వాఖ్యలను, అరిచిత ఫాలోవర్లను నియంత్రించవచ్చు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.