హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter Mixed Media: ట్విట్టర్‌ యూజర్స్ కి అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్..!

Twitter Mixed Media: ట్విట్టర్‌ యూజర్స్ కి అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Twitter Mixed Media: ట్విట్టర్ యూజర్స్ కి అదిరిపోయే న్యూస్. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సరికొత్త ఫీచర్ ను యూజర్లందరికీ లాంచ్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు (New Features) పరిచయం చేస్తోంది. యూజర్లు ఎంతగానో వేచి చూస్తున్న 'ఎడిట్‌ బటన్" (Edit Button) కూడా పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వీడియో వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు కొత్త ఫీచర్ కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈ సోషల్ మీడియా దిగ్గజం 'మిక్స్‌డ్ మీడియా (Mixed Media)' అనే కొత్త ఫీచర్‌ను యూజర్లందరికీ లాంచ్ చేసింది. పేరు సూచించినట్లు గానే ఈ అప్‌డేట్‌తో యూజర్లు ఒకే ట్వీట్‌లో వీడియోలు, ఫొటోలు, గిఫ్‌లను అప్‌లోడ్ చేసుకుని పోస్ట్ చేయవచ్చు. గతంలో ఒక ట్వీట్‌లో ఫొటో/వీడియో యాడ్ చేసి పోస్ట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యూజర్లు సింగిల్ ట్వీట్‌లో ఫొటో, వీడియో, గిఫ్‌లను మిక్స్‌ చేసి పోస్ట్ చేయొచ్చు.

* iOS, ఆండ్రాయిడ్‌ యాప్స్‌లో అందుబాటులోకి

ఈ అద్భుతమైన అప్‌డేట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా iOS, ఆండ్రాయిడ్‌ యాప్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే, వివిధ రకాల కంటెంట్స్‌తో ఉన్న ట్వీట్‌లను ఆండ్రాయిడ్ , ఐఓఎస్ లతోపాటు అన్ని ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయవచ్చని ట్విట్టర్ సపోర్ట్ ట్వీట్ చేసింది. ఒక్కో ట్వీట్‌కు యూజర్లు గరిష్ఠంగా నాలుగు వీడియోలు, ఫొటోలు, లేదా GIFలను జోడించవచ్చు.

వీటిని కలిపి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అయితే మీడియాను కలిపి యాడ్ చేసేటప్పుడు మీరు ఒక వీడియో, ఒక ఫొటో, రెండు GIFలను యాడ్ చేసుకోగలుగుతారు. లేదంటే మీరు రెండు వీడియోలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు గిఫ్ ఒకటే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఒక సింగిల్ ట్వీట్‌లో మిక్స్‌డ్ మీడియా అయినా లేక ఒకే మీడియా అయినా 4 ఫైల్స్ మాత్రమే యాడ్ చేయడం కుదురుతుంది అని తెలుస్తోంది.

* మిక్స్‌డ్‌ మీడియా ట్వీట్లు

ట్వీట్‌ను కంపోజ్ చేస్తున్నప్పుడు యూజర్లు ట్వీట్ కంపోజ్‌లో "మీడియా" లేదా "GIF" ఐకాన్‌పై నొక్కి, వారు షేర్ చేయాలనుకుంటున్న కంటెంట్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్టివ్ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకుని ఫొటోలకు ఈజీ యాక్సెస్ అందించవచ్చు.

ఇది కూడా చదవండి : ఊరించే ఆఫర్లు.. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 6000 వరకు తగ్గింపు.. త్వరపడండి!

ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఇలాంటి ఫీచర్‌ను గతంలోనే విడుదల చేసింది. ఈ వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ తన యూజర్లకు ఒకే పోస్ట్‌లో ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసే ఫెసిలిటీని ఆఫర్ చేస్తుంది. అయితే వ్యూయర్స్‌ ఇతర మీడియా చూడటానికి పక్కకు స్వైప్ చేస్తూ ఉండాలి. మిక్స్‌డ్-మీడియా ట్వీట్లలో మాత్రం అన్ని మీడియా రకాలను ఒకేసారి చూసుకోవచ్చు.

* 280 క్యారెక్టర్లకు మించి టెక్ట్స్‌

అలానే ఒకే ట్వీట్‌లో వివిధ రకాల విజువల్ కంటెంట్‌ని మిక్స్ చేస్తూనే క్రియేటర్లు 280 క్యారెక్టర్లకు మించి టెక్స్ట్ రాసుకోవచ్చు. తద్వారా వారు తమ భావాలను వివరంగా తెలుపవచ్చు. ట్విట్టర్ సపోర్ట్ ప్రకారం, యూజర్లు తమ స్టోరీస్ చెప్పడానికి ఈ కొత్త అప్‌డేట్‌ మరిన్ని మార్గాలను అందిస్తుంది. "క్రియేటర్స్‌ మరింత కంటెంట్ షేర్ చేయడానికి, చూడడానికి మేం ఎల్లప్పుడూ కొత్త, ఎగ్జైటింగ్ మార్గాల తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం." అని ట్విట్టర్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: New feature, Tech news, Twitter

ఉత్తమ కథలు