Twitter: ట్విట్టర్​లో కొత్త ఫీచర్​.. వ్యాపారులకు, షాపింగ్ ప్రియులకు సూపర్ ఛాన్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ట్విట్టర్​ తాజాగా మరో అద్భుత ఫీచర్​ను తీసుకొచ్చింది. 'షాప్ మాడ్యూల్' అనే పేరుతో కొత్త ఫీచర్​ను అమెరికాలో ప్రారంభించింది. ఈ ఫీచర్​ ద్వారా వ్యాపారాలు తమ బ్రాండ్స్​ను వారి ప్రొఫైల్‌ పైభాగంలో ప్రమోట్​ చేసుకోవచ్చు.

  • Share this:
సోషల్​ మీడియాలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ట్విట్టర్​. యూజర్ల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ వస్తోన్న ట్విట్టర్​ తాజాగా మరో అద్భుత ఫీచర్​ను తీసుకొచ్చింది. 'షాప్ మాడ్యూల్' అనే పేరుతో కొత్త ఫీచర్​ను అమెరికాలో ప్రారంభించింది. ఈ ఫీచర్​ ద్వారా వ్యాపారాలు తమ బ్రాండ్స్​ను వారి ప్రొఫైల్‌ పైభాగంలో ప్రమోట్​ చేసుకోవచ్చు. అంతేకాదు, యూజర్లను అక్కడే షాపింగ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. తద్వారా యూజర్లు సులభంగా ఉత్పత్తులను బ్రౌజ్​ చేసుకొని అక్కడిక్కడే కొనుగోలు చేయవచ్చు. ఏదైనా ప్రొడక్ట్‌పై క్లిక్​ చేయగానే దాని ధర, పేమెంట్​ ఆప్షన్ అన్ని వివరాలు అక్కడే కనిపిస్తాయి. ట్విట్టర్​ నుంచి బయటికి రాకుండా అక్కడే పేమెంట్​ చేసి ఆ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయవచ్చు.
WhatsApp Group Calls: వాట్సప్‌ గ్రూప్‌ కాల్స్‌‌కు కొత్త లుక్‌... ఎలా ఉందంటే

ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్​లో భాగంగా దీన్ని ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. ‘‘యూజర్లు ప్రతిరోజూ ట్విట్టర్‌లో వివిధ రకాల ప్రోడక్ట్​ గురించి చర్చిస్తుంటారు. కాబట్టి, వారికి మెరుగైన షాపింగ్​ అనుభవాన్ని అందించాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ‘షాప్ మాడ్యూల్’ అనే కొత్త ఫీచర్​ను ప్రారంభించాం. ఈ ఫీచర్​ ట్విట్టర్​ యూజర్లకు అద్భుతమైన షాపింగ్​ ఎక్స్​పీరియన్స్​ ఇస్తుందని ఆశిస్తున్నాం" అని ట్విట్టర్ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, పైలెట్​ ప్రాజెక్ట్​లో భాగంగా గేమ్‌స్టాప్, ఆర్డెన్ కోవ్ వంటి మరో పది బ్రాండ్లతో ట్విట్టర్​ ఒప్పందం చేసుకుంది. యూజర్లు నేరుగా ట్విట్టర్​లోనే ఈ బ్రాండ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే, ప్రస్తుతం తక్కువ సంఖ్యలో బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ.. త్వరలోనే మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టి షాపింగ్​ అనుభవాన్ని విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.

టైపింగ్ చేయకుండానే ట్వీట్​..
ట్విట్టర్​ వలే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, పిన్‌టెస్ట్ వంటి సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​లు ఎప్పటి నుంచో షాపింగ్ సేవలను అందిస్తున్నాయి. దీనితో పాటు ట్విట్టర్​ తన ఖాతాదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు టెక్ట్స్, వీడియో రూపంలోనే ట్వీట్​ చేసే అవకాశం ఉండగా.. ఇకపై వాయిన్​ ట్వీట్​ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఈ ఫీచర్​ను ప్రస్తుతానికి ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్​పై నడిచే ఐఫోన్, ఐపాడ్స్​లో ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు 20 సెకన్ల నిడివి ఉంటే ఆడియోను ట్వీట్ చేయవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: