హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jack Dorsey: జాక్‌ డోర్స్‌ మాములోడు కాదుగా.. ట్విట్టర్‌కు పోటీగా బ్లూస్కైని దింపుతున్నాడు!

Jack Dorsey: జాక్‌ డోర్స్‌ మాములోడు కాదుగా.. ట్విట్టర్‌కు పోటీగా బ్లూస్కైని దింపుతున్నాడు!

Jack Dorsey

Jack Dorsey

Jack Dorsey: జాక్‌ డోర్సే కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాట్‌ఫారం పేరు బ్లూస్కై (Bluesky). ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజిలో ఉండగా యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అథెంటికేటెడ్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రొటోకాల్‌పై ఆధారపడి ఇది పనిచేస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

జాక్‌ డోర్సే (Jack Dorsey).. ఈ పేరు కొద్దిమందికే తెలుసు. ట్విట్టర్‌ (Twitter) సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో. 2021 నవంబర్‌లో జాక్‌ డోర్సే ట్విట్టర్‌ సీఈవో పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కొన్ని రోజుల తర్వాత బోర్డు నుంచి కూడా తప్పుకోవడంతో ట్విట్టర్‌ నుంచి పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌ ఎంపికవ్వడం, ఆ తర్వాత ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనడంతో ఆయన కూడా వైదొలగడం మనకందరికీ తెలిసిందే. ట్విట్టర్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా ఉండేకన్నా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగానే ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని అప్పట్లో జాక్‌ డోర్సే వెల్లడించారు. అనంతరం ఆ సంస్థలో జరిగిన పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా జాక్‌ డోర్సే కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం తీసుకొస్తున్నారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. ఇప్పుడది నిజమైంది.

* Bluesky

జాక్‌ డోర్సే కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాట్‌ఫారం పేరు బ్లూస్కై (Bluesky). ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజిలో ఉండగా యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అథెంటికేటెడ్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రొటోకాల్‌పై ఆధారపడి ఇది పనిచేస్తుంది. అంటే కేవలం ఒక సైట్‌ ద్వారా మాత్రమే కాకుండా పలు సైట్లు ద్వారా ఇది పనిచేస్తుంది.

సోషల్‌ మీడియా వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని చేరేందుకు, సోషల్‌ మీడియా యూజర్లకు మంచి వేదికగా బ్లూస్కై నిలుస్తుందని డోర్సే ఓ పోస్టు పెట్టారు. యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన data.ai ప్రకారం, Bluesky iOS యాప్‌ను ఫిబ్రవరి 17న మొదలుపెట్టారు. టెస్టింగ్‌ దశలో ఉండగా సుమారు 2,000 మంది దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. పూర్తిస్థాయిలో పబ్లిక్‌ లాంచ్‌కు దగ్గర్లో ఉందని TechCrunch ఓ నివేదికలో పేర్కొంది. బ్లూస్కైతో యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తున్నట్లు డోర్సే తెలిపారు.

ఇది కూడా చదవండి : జస్ట్ రూ.7తో 100 కి.మి వెళ్లండి.. ఈ ఇ-బైక్ అదరహో, రూ.999తో బుక్ చేసుకోవచ్చు!

* ట్విట్టర్‌కు పోటీయేనా?

బయటకు చెప్పకపోయినా ట్విటర్‌కు పోటీగానే దీన్ని తీసుకుస్తున్నారని టెక్‌ నిపుణులు అంటున్నారు. ఇందులో ఒక్క క్లిక్‌తో 256 అక్షరాలతో పోస్టు పెట్టచ్చు. దానికి ఫొటోలు కూడా జత చేయొచ్చు. ట్విట్టర్‌లో What’s happening? అని వస్తే, ఇందులో What’s up? అని వస్తుంది. బ్లూస్కై యూజర్లు షేర్‌ చేయొచ్చు, ఇష్టం లేని అకౌంట్లను మ్యూట్‌ లేదా బ్లాక్‌ కూడా చేయొచ్చు. అయితే ఇంకొన్ని అడ్వాన్స్‌ ఫీచర్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. యూజర్‌ ప్రొఫైల్‌లో పిక్‌ పెట్టుకోవచ్చు.

నోటిఫికేషన్లు, షేర్లు, కామెంట్లు వంటి ఆప్షన్లన్నీ ఉన్నాయి. ఇండివిడ్యువల్స్‌ను సెర్చ్‌ చేయడంతో పాటు వారి ప్రొఫైల్‌ కూడా చూడచ్చు. డోర్సే, అతని బోర్డు సభ్యుల ద్వారా బ్లూస్కైకి గతేడాది 13 మిలియన్‌ డాలర్లు అందుకుంది. ట్విట్టర్‌ మాజీ సీఈవో జాక్‌, ప్రస్తుతం బ్లూస్కైపై పనిచేస్తున్న సంస్థ బోర్డులో సభ్యుడిగా ఉండగా, ట్విట్టర్‌ సెక్యురిటీ ఇంజినీర్‌ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో బ్లూస్కై.. ట్విట్టర్‌కు గట్టి పోటీగా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు.

First published:

Tags: Elon Musk, Jack dorsey, Tech news, Twitter

ఉత్తమ కథలు