హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhiteHouse: ట్విటర్ అధినేత ఎలాన్‌ మస్క్‌కి ఊహించని షాక్ ఇచ్చిన వైట్ హౌస్..

WhiteHouse: ట్విటర్ అధినేత ఎలాన్‌ మస్క్‌కి ఊహించని షాక్ ఇచ్చిన వైట్ హౌస్..

ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్

ట్విటర్ అధినేత ఎలాన్‌ మస్క్‌కు అమెరికా వైట్‌హౌస్ జలక్ ఇచ్చింది. ట్విటర్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌కు డబ్బులు చెల్లించకూడదంటూ వైట్‌హౌస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

WhiteHouse:  ట్విటర్ (Twitter) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు అమెరికా వైట్‌హౌస్ (White House) ఝలక్ ఇచ్చింది. ట్విటర్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌కు డబ్బులు చెల్లించకూడదంటూ వైట్‌హౌస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ సిబ్బంది అధికారిక ట్విటర్ ప్రొఫైల్స్‌ని వెరిఫైడ్ అకౌంట్స్‌గా కొనసాగించేందుకు వైట్‌హౌస్ రుసుం చెల్లించేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ తమ సిబ్బందికి ఓ ఈమెయిల్ పంపినట్లు సమాచారం.

* శనివారం నుంచి అమలు

ట్విటర్‌ను టేకోవర్ చేసిన అనంతరం ఎలాన్‌ మస్క్ పెయిడ్ సర్వీసులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్గనైజేషన్‌లకు సంబంధించిన ట్విటర్ అకౌంట్‌లకు వెరిఫైడ్ బ్యాడ్జిలను కేటాయిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆర్గనైజేషన్లకు ఉంటూ వస్తున్న బ్లూ టిక్‌లను శనివారం నుంచి తొలగిస్తునట్లు ట్విటర్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

 Instagram : ఇన్‌స్టాలో అదిరే ఫీచర్.. ఇకపై ఫ్రెండ్స్‌తో పోస్ట్‌ల షేరింగ్ చాలా ఈజీ

* పెయిడ్ యూజర్‌గానే గుర్తింపు

వైట్ హౌస్ సిబ్బందికి డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ రాబ్ ఫ్లాహర్టీ ఈమెయిల్ పంపించారు. ఈమెయిల్‌లో స్టాఫర్స్‌కి గైడెన్స్‌ని వివరించినట్లు సమాచారం. కేవలం పెయిడ్ యూజర్‌గా గుర్తించేందుకు మాత్రమే ఈ వెరిఫికేషన్ సర్వీస్‌ని ట్విటర్ అందిస్తోందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ఈమెయిల్‌లో స్టాఫర్స్‌ని రాబ్ కోరారు. వ్యక్తి అథారిటీని గుర్తించేందుకు వెరిఫికేషన్‌ని ఒక సర్వీసుగా సమకూర్చట్లేదని సిబ్బందికి డైరెక్టర్ సూచించారు. ట్విటర్ సవరించిన కొత్త పాలసీ నిబంధనలను వైట్‌హౌస్‌కు అనుగుణంగా లేవని మెయిల్‌లో స్పష్టం చేసినట్లు సమాచారం. ఫలితంగా సిబ్బంది అకౌంట్‌లకు వెరిఫికేషన్ కొనసాగింపుపై వైట్‌హౌస్ గ్యారంటీ ఇవ్వబోదని ఫ్లాహర్టీ తెలిపారు.

* తప్పనిసరి కాదు

వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ పంపించిన మార్గదర్శకాలు అన్ని ప్రభుత్వ విభాగాలకు అమలు అవుతాయనే నిబంధనేమీ లేదు. అయితే, కొన్ని ఏజెన్సీలకు, ప్రభుత్వ విభాగాలకు షరతులతో కూడిన మార్గదర్శకాలను డైరెక్టర్ పంపించే అవకాశం ఉన్నట్లు వైట్‌హౌస్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వంటి కొంతమంది అధికారులకు మాత్రం ‘గ్రే చెక్‌మార్క్’ కొనసాగుతుందని తెలిసింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

* వెరిఫికేషన్ ఆర్గనైజేషన్లకు ప్రయోజనాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు తమ ప్లాట్‌‌ఫారంలో వెరిఫికేషన్ సర్వీసును తీసుకొస్తున్నట్లు ట్విటర్ వెల్లడించింది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇతరులతో పోలిస్తే సబ్‌స్క్రిప్షన్ పొందిన ఆర్గనైజేషన్లు, వాటి అనుబంధ సంస్థలకు విభిన్న గుర్తింపు ఉంటుందని తెలిపింది. వెరిఫైడ్ ఆర్గనైజేషన్‌లు బిజినెస్ లోగోతో కూడిన అఫ్ఫిలియేట్ బ్యాడ్జ్‌ని పొందవచ్చు. ఆర్గనైజేషన్ ట్విటర్ ప్రొఫైల్‌లోనూ ఈ బ్యాడ్జ్‌ కనిపిస్తుంది.

* అందుబాటులో మూడు రకాల టిక్‌లు

గతేడాదే ఎలాన్‌ మస్క్ ట్విటర్ బ్లూ పెయిడ్ సర్వీసులను ప్రకటించారు. ఇందులో భాగంగా ట్విటర్ అకౌంట్లకు మూడు రకాల టిక్‌లను పరిచయం చేశారు. వ్యక్తిగత అకౌంట్లకు బ్లూ టిక్, ప్రభుత్వ విభాగాలు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషనల్‌కు గ్రే టిక్, వ్యాపార సంస్థలకు గోల్డ్ టిక్‌‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్‌లో ట్విటర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే నెలకు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన కూడా కొంత మేర డిస్కౌంట్‌ను ట్విటర్ ప్రకటించింది.

First published:

Tags: America, Elon Musk, Twitter, USA

ఉత్తమ కథలు