ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ల (New Feature)ను లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగా ట్వీట్ ఎడిట్ ఫీచర్ తీసుకొస్తామని గతంలోనే ప్రకటించింది. ఈ ఫీచర్ కోసం యూజర్లు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఎడిట్ ట్వీట్ (Edit Tweet) ఫీచర్‌ను ట్విట్టర్ లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతానికి కేవలం కొంతమంది యూజర్లకు మాత్రమే ఎడిట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెగ్యులర్ యూజర్లందరికీ లాంచ్ చేసే ముందు టెస్టింగ్‌లో భాగంగా సెలక్టెడ్ యూజర్లకు పరిచయం చేసింది. ఎడిట్ బటన్‌కి సంబంధించి ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్‌లో ఒక స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేశారు. ఈ స్క్రీన్‌షాట్‌లో.. ట్వీట్‌లో అసభ్యకర, హానికర టెక్స్ట్ ఉంటే, దాన్ని ఎడిట్ చేసుకునేందుకు ఎడిట్ బటన్ ఆప్షన్ అందుబాటులో ఉన్నట్లు కనిపించింది. కాగా ఈ ఫీచర్ మరికొద్ది వారాలు లేదా నెలల్లో యూజర్లందరికీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఎడిట్ బటన్ ఎలా పనిచేస్తుందో వివరించారు. ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌పై యూజర్ ట్వీట్ చేసినప్పుడు అందులో అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయా లేదా అనేది ప్రస్తుత ఎడిట్ టూల్‌లోని ఒక అల్గారిథమ్ చెక్ చేస్తుంది. ఒకవేళ అందులో హానికర లేదా అభ్యంతరకర, బెదిరింపు వంటి పదాలు ఉన్నట్లయితే "మోస్ట్ ట్వీటర్స్ డోంట్ పోస్ట్ రిప్లయిస్ లైక్ థిస్" అనే ఒక పాపప్ కనిపిస్తుంది. ఈ విండో దిగువన ట్వీట్ (Tweet), ఎడిట్ (Edit), డిలీట్ (Delete) అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. యూజర్ అలాంటి పదాలతోనే ట్వీట్ చేయాలనుకుంటే ట్వీట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తద్వారా అసభ్యకర పదాలతోనే ట్వీట్ పోస్ట్ అవుతుంది. లేదంటే ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసి తాము పంపిన ట్వీట్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. లేదా డిలీట్ ఆప్షన్‌పై నొక్కి దానిని పూర్తిగా డిలీట్ చేసుకోవచ్చు.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Twitter Edit button is here, but only for potentially abusive/harmful/offensive tweets for now.<br>Plus, Twitter is testing a like/dislike feature, which lets you view the stats (likes, comments, RTs) in the notifications section itself and lets you engage with the tweet right there <a href="https://t.co/UovNjhdFek">pic.twitter.com/UovNjhdFek</a></p>— Mukul Sharma (@stufflistings) <a href="https://twitter.com/stufflistings/status/1538742587695083520?ref_src=twsrc%5Etfw">June 20, 2022</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
అయితే ఇప్పుడు హానికరమైన లేదా అసభ్యంగా కనిపించే ట్వీట్‌ను చేసినప్పుడు ట్విట్టర్ ఆ ట్వీట్‌ను సింపుల్‌గా ఇగ్నోర్ చేస్తుంది లేదా డిలీట్ చేయమని అడుగుతుంది. కానీ రాబోయే ఎడిట్ ఫీచర్ వల్ల మొత్తం ట్వీట్‌ను కాకుండా దానిలోని కంటెంట్‌ను ఎడిట్ చేయడం వీలవుతుంది. అయితే కేవలం అసభ్యకర భాష ఉంటే మాత్రమే కాదు మిగతా అన్ని ట్వీట్స్‌కు ఎడిట్ ఫీచర్ వర్క్ అయ్యేలా ఎడిట్ బటన్‌ను కంపెనీ తీసుకురావచ్చు.
ఎడిట్ బటన్‌తో పాటు, ట్విట్టర్ నోటిఫికేషన్‌లలో లైక్ లేదా డిస్‌లైక్ ఆప్షన్ యాడ్ చేయనున్నట్లు ముకుల్ వెల్లడించారు. ఈ ఫీచర్ వల్ల యూజర్లు నోటిఫికేషన్ ప్యానెల్‌లోనే ఒక ట్వీట్‌కు వచ్చిన లైక్స్, కామెంట్స్, రిట్వీట్స్ చూడవచ్చు. అంతేకాదు, వోట్/లైక్, డౌన్‌వోట్/డిస్‌లైక్ వంటి ఆప్షన్లను కూడా చూడవచ్చు. అలానే, నోటిఫికేషన్‌లలోనే ట్వీట్‌లకు రిప్లై ఇవ్వచ్చు, లైక్ చేయవచ్చు లేదా రీట్వీట్ చేయవచ్చు. ట్విట్టర్ ఈ లైక్ ఫీచర్‌ని ప్రస్తుతం టెస్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Social Media, Tech news, Tweets, Twitter