Twitter Down: ట్విట్ట‌ర్ సేవలకు అంతరాయం.. అవి అస‌లు ఓపెన్ కావ‌డం లేదంటున్న నెటిజ‌న్లు..

ట్విట్ట‌ర్

చాలా మంది నెటిజ‌న్ల‌కు ట్విట్ట‌ర్ సేవ‌ల్లో తీవ్ర అంతరాయం క‌లిగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెటిజ‌న్లు ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

  • Share this:
    చాలా మంది నెటిజ‌న్ల‌కు ట్విట్ట‌ర్ సేవ‌ల్లో తీవ్ర అంతరాయం క‌లిగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెటిజ‌న్లు ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ప్రొఫైల్ లోడ్ అవ్వ‌డం లేద‌ని, ప‌లు థ్రెడ్స్ ఓపెన్ కావ‌డం లేద‌ని నెటిజ‌న్లు ఫిర్యాదు చేస్తున్నారు. Twitter being down అని పేర్కొంటున్నారు. అయితే కొన్ని ముఖ్య‌మైన‌ ఫీచ‌ర్స్ బాగానే ప‌నిచేస్తున్నాయ‌ని నెటిజ‌న్స్‌ తెలిపారు. త‌మ టైమ్ లైన్ ఓపెన్ కావ‌డం లేద‌ని, కొన్ని మెసేజ్ ల‌కు రిప్లై ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని నెటిజ‌న్లు త‌మ పోస్టుల ద్వారా తెలియ‌జేస్తున్నారు. వాటిని ఓపెన్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తే.. ఎర్ర‌ర్ మెసేజ్ వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను కూడా షేర్ చేస్తున్నారు. పేజీ లోడ్ కావ‌డం లేద‌ని.. Something went wrong. Try reloading అని చూపిస్తోంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు తెలిపారు. ఇలా ఎందుకు జ‌రుగుతుందంటూ ట్విట్ట‌ర్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

    Downdetector ప్ర‌కారం.. ఈ రోజు ఉద‌యం 7.30 గంట‌ల నుంచి ట్విట్ట‌ర్ యూజ‌ర్స్ ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. గ‌త 24 గంట్ల‌లో ట్విట్ట‌ర్ ప‌నితీరుకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని డౌన్ డిటెక్ట‌ర్ పేర్కొంది. గ‌త రాత్రి నుంచి 6వేల‌కు పైగా ట్విట్ట‌ర్ వినియోగ‌దారులు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని పేర్కొంది.









    ఇక‌, మొబైల్ వ‌ర‌కు ట్విట్ట‌ర్ బాగానే ప‌నిచేస్తుంద‌ని.. కానీ డెస్క్ టాప్‌ల‌లో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని కొంద‌రు నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లువురు నెటిజ‌న్లు ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న‌ట్టుగా తెలుస్తోంది.అయితే ఇందుకు సంబంధించి ట్విట్ట‌ర్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.
    Published by:Sumanth Kanukula
    First published: