news18-telugu
Updated: October 16, 2020, 8:24 AM IST
ట్విట్టర్
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో సమస్యలు తలెత్తాయి. దీంతో చాలా మంది ట్విట్టర్ యూజర్లు గత కొద్ది గంటలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ కూడా ధ్రువీకరించింది. తమ అంతర్గత సర్వర్లలో అనుకోకుండా చేసిన మార్పు కారణంగా చాలా మంది వినియోగదారులకు ట్విటర్ డౌన్ అయిందని తెలిపింది. అయితే ఎలాంటి డేటా చోరీ గానీ, హ్యాకింగ్ గానీ జరగలేదని తెలిపింది. "మీలో చాలా మందికి ట్విట్టర్ డౌన్ అయింది. ప్రతి ఒక్కరికి ట్విటర్ సేవలు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్గత సిస్టమ్స్‌లో సమస్య తలెత్తిందని తెలిపింది. అయితే భద్రత ఉల్లంఘన గానీ, హ్యాకింగ్ గానీ జరగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు" ట్విటర్ సంస్థ పేర్కొంది.
అవుటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ Downdetector.com కూడా 55,000లకు పైగా వినియోగదారులు ట్విట్టర్ వినియోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపింది. ట్విటర్లో సాంకేతిక సమస్య తలెత్తండంపై పలువురు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ట్విటర్ యాక్సెస్ అవుతున్న యాజర్స్ #TwitterDown హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.ఇక, ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ గురికావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. హ్యాకింగ్ కు గురైనవారిలో అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టీవీ నటి కిమ్ కర్దేషియన్తో పాటు పలువురు ప్రముఖలు ఉన్నారు.
Published by:
Sumanth Kanukula
First published:
October 16, 2020, 8:24 AM IST