హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter: హ్యాకర్ల చేతిలో 400 మిలియన్ యూజర్ల ట్విట్టర్ డేటా?ప్రూఫ్‌గా సల్మాన్‌ ఖాన్‌, సుందర్‌ పిచాయ్‌ వివరాల వెల్లడి!

Twitter: హ్యాకర్ల చేతిలో 400 మిలియన్ యూజర్ల ట్విట్టర్ డేటా?ప్రూఫ్‌గా సల్మాన్‌ ఖాన్‌, సుందర్‌ పిచాయ్‌ వివరాల వెల్లడి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం సోషల్‌ మీడియా వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియాలో డేటా ప్రైవసీ ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు ట్విట్టర్ యూజర్ల డేటా కూడా లీక్ అయింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Twitter: ప్రస్తుతం సోషల్‌ మీడియా వినియోగదారుల(Social media users) సంఖ్య విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియాలో డేటా ప్రైవసీ(Data privacy) ఇబ్బందుల్లో పడింది. యూజర్‌ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెడుతున్నారు. ఈ డేటా లీకేజీలో (Data leak)సెలబ్రిటీల ఖాతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్విట్టర్ యూజర్ల డేటా కూడా లీక్ అయింది. 400 మిలియన్ యూజర్ల డేటా హ్యాక్ చేసి డార్క్ నెట్‌లో అమ్మకానికి పెట్టినట్లుగా హ్యాకర్లు ప్రకటించారు. ఇది అతి పెద్ద ట్విట్టర్ డేటా ఉల్లంఘనగా నిలిచింది. గత నవంబర్‌లో జరిగిన 5.4 మిలియన్ల ట్విట్టర్ యూజర్ల డేటా లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. హ్యాక్ చేసిన డేటా ఒరిజినల్ అని చెప్పడానికి హ్యాకర్ల శాంపుల్ డేటాను పోస్ట్ చేశారు. వీటిలో ఈమెయిల్, యూజర్ నేమ్, నేమ్, ఫాలోవర్ కౌంట్, అకౌంట్‌ క్రియేషన్ డేట్‌ కొన్ని సందర్భాల్లో ఫోన్ నంబర్‌లు ఉన్నాయి.

డేటా హ్యాక్‌లో హై ప్రొఫైల్ యూజర్లు

హ్యాకర్లు పోస్ట్ చేసిన శాంపిల్ డేటాలో షాక్‌కి గురి చేసిన విషయం ఏంటంటే.. వాటిలో హై ప్రొఫైల్ యూజర్ల అకౌంట్లు కూడా ఉన్నాయి. అలెగ్జాండ్రియా ఒకసియో- కార్టేజ్, స్పేస్ ఎక్స్, సీబీఎస్‌ మీడియా, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, డోజా క్యాట్, చార్లీ పుత్, సుందర్ పిచాయ్‌, సల్మాన్ ఖాన్, నాసా JWST ఎకౌంట్, ఎన్‌బీఏ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రోడ్కాస్టింగ్ ఇండియా, షాన్ మెండీస్, సోషల్ మీడియా ఆఫ్ WHO మొదలైన హై ప్రొఫైల్ యూజర్ల డేటా ఉంది. ఎక్కువ శాతం మంది సోషల్ మీడియా టీమ్‌కి చెందినవారే ఉన్నారు. డేటా లీకేజీ అనేది చట్టబద్ధమైతే దానివల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ. ఇజ్రాయిల్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ కంపెనీ హడ్సన్ రాక్, కో-పౌండర్ అండ్ సీటీవో అయిన అలోన్ గాల్ మాట్లాడుతూ.. ఏపీఐ వల్నరబిలిటీస్‌ ద్వారా హ్యాకర్లు డేటా కలెక్ట్‌ చేసినట్లు తెలిపారు.

Miss England : అందాల తార.. అంతరిక్షమే టార్గెట్.. వ్యోమగామి అవుతుందట

ఓపెన్ డీల్ ఇచ్చిన హ్యాకర్

హ్యాకర్‌ ట్విట్టర్‌ యూజర్‌ల డేటా లీకేజీపై ఓ ప్రకటన విడుదల చేశాడు. అందులో.. ట్విట్టర్ , ఎలాన్ మస్క్ ఇప్పటికే 5.4 మిలియన్ యూజర్ల డేటా చోరీకి సంబంధించి GDPR ఫైన్ రిస్క్‌లో ఉన్నారని తెలిపాడు. ఇప్పుడు 400 మిలియన్ యూజర్ల డేటా చోరీ విషయంపై ఎంత ఫైన్ కట్టాలో మీ ఊహకే వదిలేస్తున్నామన్నాడు. 533 మిలియన్ యూజర్ల డేటా చోరీకి సంబంధించి GDPRకి ఫేస్‌బుక్ కట్టిన 276 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఫైన్ తప్పించుకోవాలంటే ఈ డేటాను తిరిగి కొనాలని హ్యాకర్ పోస్ట్ చేశాడు. ఈ డీల్ మూడో మనిషి ద్వారా జరుగుతుందనీ తెలిపాడు. డీల్‌కి ఓకే అంటే డేటాను మళ్ళీ అమ్మకానికి పెట్టనని, వేరే ఎవరికీ కూడా అమ్మనని చెప్పాడు. దీని ద్వారా చాలామంది సెలబ్రిటీలు, పొలిటీషియన్లను ఫిషింగ్, క్రిప్టో స్కామ్స్, సిమ్ స్వాపింగ్, డాక్సింగ్ వంటి దాడుల నుంచి బయటపడుతారని తెలిపాడు. ఇదే జరిగితే వారికి కంపెనీపై ఉన్న నమ్మకం పోయి, ఎదుగుదలను ఆపేస్తుందని హెచ్చరించారు. కంటెంట్‌ క్రియేటర్స్‌ని హ్యాక్‌ చేస్తే.. ట్విట్టర్‌ వీడియో ప్లాట్‌ఫాం కల నెరవేరదని అన్నాడు. ఇప్పటికే ట్విట్టర్ పాలసీలను మార్చి తప్పు చేశారని పేర్కొన్నాడు. ట్విట్టర్ పాలసీలో మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఈ అతిపెద్ద డేటా చోరీ అనేది ఎలాన్ మస్క్‌కు తలనొప్పిగా మారనుంది. ఇప్పటికే గతంలో జరిగిన చోరీపై DPC ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది.

First published:

Tags: Hacking, Salman khan, Sundar pichai, Twitter

ఉత్తమ కథలు