Twitter spaces: ట్విట్ట‌ర్ స్పేసెస్ కేవలం ఆండ్రాయిడ్ లోనే కాదు.. త్వరలోనే డెస్క్‌టాప్ కు కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ట్విట్ట‌ర్ `స్పేసెస్‌` లాంటి ఆడియో చాటింగ్ డెస్క్‌టాప్‌కి అందుబాటులోకి రాబోతుంద‌నే వార్త నెటిజ‌న్ల‌కు సంతోషాన్నిస్తోంది. కొత్త‌గా వ‌చ్చిన క్ల‌బ్‌హౌస్ లాంటి ఆడియో చాట్ రూమ్స్ ఫీచ‌ర్‌గా పిలుస్తున్న ట్విట్ట‌ర్ `స్పేసెస్` త్వ‌ర‌లో డెస్క్‌టాప్‌నూ చేరుకోబోతుంది.

  • Share this:
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత డెస్క్‌టాప్‌పై ఆధార‌ప‌డ‌టం చాలా త‌గ్గి పోయింది. ప్ర‌తి రోజూ కొత్త కొత్త యాప్ లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయినా డెస్క్‌టాప్‌కి ఉన్న సౌక‌ర్యం ఇంకేది ఇవ్వ‌లేన‌ది. అందుకే ఇప్పుడు ట్విట్ట‌ర్ `స్పేసెస్‌` లాంటి ఆడియో చాటింగ్ డెస్క్‌టాప్‌కి అందుబాటులోకి రాబోతుంద‌నే వార్త నెటిజ‌న్ల‌కు సంతోషాన్నిస్తోంది. కొత్త‌గా వ‌చ్చిన క్ల‌బ్‌హౌస్ లాంటి ఆడియో చాట్ రూమ్స్ ఫీచ‌ర్‌గా పిలుస్తున్న ట్విట్ట‌ర్ `స్పేసెస్` త్వ‌ర‌లో డెస్క్‌టాప్‌నూ చేరుకోబోతుంది. ఇప్ప‌టికే ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ల‌ల్లో టెస్టింగ్‌లో ఉంద‌న్న విష‌యం చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు దీన్ని డెస్క్‌టాప్‌లోనూ వినియోగించుకోవ‌చ్చు. దీన్ని డెస్క్‌టాప్‌కి తీసుకురావ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. సామాజిక మాధ్య‌మాల్లో ఆడియో-చాట్ యాప్ క్ల‌బ్‌హౌస్ వేగంగా పాపులారిటీని సంపాదిస్తున్న స‌మ‌యంలో ఇన్వైట్‌-ఓన్లీ మోడ్‌లో దీన్ని డెస్క్‌టాప్‌కి కూడా అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంద‌ని అనుకున్నారు. లింక్డ్ఇన్, స్పాటిఫై లాంటి టెక్ కంపెనీలు కూడా క్ల‌బ్‌హౌస్ లాంటి లైవ్ ఆడియో ఫీచ‌ర్ల‌పై ప‌నిచేస్తున్నాయి. ఫేస్‌బుక్ కూడా ఇలాంటి ఫీచ‌ర్‌ని తీసుకొచ్చే ఆలోచ‌న‌లో ఉంద‌ని తెలుస్తుంది.

ఇలాంటి త‌రుణంలో యాప్ ప‌రిశోధ‌కుడైన జేన్ మాంచున్ వాంగ్ వెబ్ వ‌ర్ష‌న్‌లోకి స్పేసెస్ వ‌స్తున్న‌ట్లు మొద‌టిగా గుర్తించారు. ట్విట్ట‌ర్‌లో చేసిన పోస్టు ద్వారా ఈ విష‌యం గురించి ప్ర‌స్తావిస్తూ, `వెబ్ యాప్ కోసం @ట్విట్ట‌ర్ స్పేసెస్ ప్రివ్యూ కార్డులపై ట్విట్ట‌ర్ ప‌నిచేస్తుంది`. అని ట్వీట్ చేశారు. మొద‌టిసారి ఐఓఎస్ పై ఒక‌ చిన్న గ్రూప్‌తో ఈ ఆడియో చాట్ ఫీచ‌ర్ అయిన‌ స్పేసెస్‌ని ప‌రీక్షించారు. గ‌త నెల‌లో ట్విట్ట‌ర్ దీని గురించి మాట్లాడుతూ భార‌త‌దేశంలోని ఆండ్రాయిడ్ వినియోగ‌దారుల‌కూ దీన్ని అందుబాటులోకి తెచ్చిన‌ట్లు చెప్పారు. ఎందుకంటే అంద‌రికీ ఇందులో చేర‌డానికి, విన‌డానికి, లైవ్‌లో మాట్లాడ‌డానికి, హోస్ట్ నియంత్రించే ఈ ఆడియో సంభాష‌ణ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు.

ప్ర‌స్తుతానికి ఈ ఫీచ‌ర్ ముంద‌స్తు ప్రివ్యూ కోసం కొంత‌మంది ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌ను ఎంచుకొన్నారు. వీరంతా దేశంలోని ఈ యాప్ బేటా ప్రోగ్రామ్‌తో ప‌నిచేస్తున్న‌వారే. ఈ ఫీచ‌ర్‌లో యూజ‌ర్ `స్పేస్‌`ని క్రియేట్ చేయొచ్చు. త‌ర్వాత వారి ఫాలొవ‌ర్లు ఇన్విటేష‌న్‌ను బ‌ట్టి ఈ ఆడియో సంభాష‌ణ‌లో పాల్గొన‌వ‌చ్చు. అయితే ట్విట్ట‌ర్ లో ఎవ‌రైనా ఈ సంభాషణలను విన‌వ‌చ్చు. కానీ ఎవ‌రు మాట్లాడాలి అనేది హోస్ట్ మాత్ర‌మే నియంత్రించ‌గ‌ల‌రు. మొత్తానికి ఇది త్వ‌ర‌లో మ‌రో సంచ‌ల‌న ఫీచ‌ర్‌గా మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
Published by:Nikhil Kumar S
First published: