హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

#RIPTwitter: ట్విట్టర్‌లో సామూహిక రాజీనామాలు... కార్యాలయాలు బంద్... ట్రెండింగ్‌లో 'రిప్ ట్విట్టర్'

#RIPTwitter: ట్విట్టర్‌లో సామూహిక రాజీనామాలు... కార్యాలయాలు బంద్... ట్రెండింగ్‌లో 'రిప్ ట్విట్టర్'

#RIPTwitter: ట్విట్టర్‌లో సామూహిక రాజీనామాలు... కార్యాలయాలు బంద్... ట్రెండింగ్‌లో 'రిప్ ట్విట్టర్'
(ప్రతీకాత్మక చిత్రం)

#RIPTwitter: ట్విట్టర్‌లో సామూహిక రాజీనామాలు... కార్యాలయాలు బంద్... ట్రెండింగ్‌లో 'రిప్ ట్విట్టర్' (ప్రతీకాత్మక చిత్రం)

#RIPTwitter | ట్విట్టర్‌లో 'రిప్ ట్విట్టర్' ట్రెండింగ్ అవుతోంది. ఓవైపు ట్విట్టర్‌లో సామూహిక రాజీనామాలు జరుగుతుండటంతో కంపెనీ కార్యాలయాలను వచ్చేవారం వరకు మూసెయ్యడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ట్విట్టర్‌లో సామూహిక రాజీనామాల నేపథ్యంలో అన్ని ట్విట్టర్ కార్యాలయాలు మూతపడుతున్నాయి. ఉద్యోగులకు నవంబర్ 21 వరకు బ్యాడ్జ్ యాక్సెస్ తొలగించింది కంపెనీ. కొద్ది రోజుల క్రితం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత కంపెనీలో భారీగా మార్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో టాప్ పోస్టుల్లో ఉన్నవారితో పాటు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది (Twitter Layoffs) కంపెనీ. దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది. భారతదేశంలోని ట్విట్టర్ ఉద్యోగుల్లో 90 శాతం మందిని తొలగించింది కంపెనీ. ఇప్పుడు కార్యాలయ భవనాలు తాత్కాలికంగా మూసివేయబడతాయని, త్వరలోనే ప్రారంభం అవుతాయని, ఉద్యోగులు ఎవరూ రిపోర్ట్ చేయవద్దని ఉద్యోగుల్ని కంపెనీ ఆదేశించింది.

కష్టపడి పనిచేయాలని లేదా ఉద్యోగం వదిలిపెట్టి వెళ్లిపోవాలని ట్విట్టర్ హెడ్ ఎలాన్ మస్క్ ఉద్యోగుల్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయాలని, అసాధారణమైన పనితీరు కనబర్చినవారినే గుర్తిస్తామని ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. ఇక కంపెనీకి సంబంధించిన గోప్యమైన కంపెనీ సమాచారాన్ని సోషల్ మీడియాలో, మీడియాతో, మరెక్కడా చర్చించకూడదని, కంపెనీ పాలసీకి అనుగుణంగా వ్యవహరించాలని ట్విట్టర్ ఉద్యోగులకు సూచించింది.

Whatsapp Polls Feature: వాట్సప్‌లో పోల్స్ ఫీచర్ వచ్చేసింది... పోల్ ఇలా క్రియేట్ చేయాలి

అన్ని కార్యాలయాలను మూసివేయాలనే ఊహించని నిర్ణయం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. కష్టపడి పనిచేయాలని ఎలాన్ మస్క్ పెట్టిన షరతుకు అంగీకరించడం లేదా ఉద్యోగం వదిలిపెట్టిపోవడంపై నిర్ణయం తీసుకునేలా ఉద్యోగుల్ని ఒత్తిడి చేయడం కోసమే కార్యాలయాలను మూసివేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. తన షరతుకు అంగీకరించని ఉద్యోగులు మూడు నెలల్లో విరమణ పొందుతారని ఇప్పటికే ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ట్విట్టర్‌ని విజయవంతం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలకు ధన్యవాదాలని కూడా ఎలాన్ మస్క్ అన్నారు.

Weak Password: ఇండియాలో టాప్ 20 వీక్ పాస్‌వర్డ్స్ ఇవే... మీరు వెంటనే మార్చేయండి

ట్విట్టర్ కార్యాలయాల మూసివేతతో ట్విట్టర్‌లో #RIPTwitter ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్ ఉద్యోగులతో పాటు నెటిజన్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం మూతపడ్డ ట్విట్టర్ కార్యాలయాలు తిరిగి నవంబర్ 21న తెరుచుకోనున్నాయి.

First published:

Tags: Elon Musk, Twitter

ఉత్తమ కథలు