Twitter: ట్విట్టర్ సీఈఓ ఏడాది జీతం జస్ట్ రూ.97 మాత్రమే... ఎందుకో తెలుసా?

Twitter CEO Salary | వేల కోట్ల ఆస్తులున్న డోర్సీ వార్షిక వేతనం 1.40 డాలర్లు మాత్రమే తీసుకొని వార్తల్లో నిలవడం విశేషం.

news18-telugu
Updated: April 10, 2019, 6:22 PM IST
Twitter: ట్విట్టర్ సీఈఓ ఏడాది జీతం జస్ట్ రూ.97 మాత్రమే... ఎందుకో తెలుసా?
Twitter: ట్విట్టర్ సీఈఓ ఏడాది జీతం జస్ట్ రూ.97 మాత్రమే... ఎందుకో తెలుసా? (File Image: REUTERS/Lucas Jackson)
news18-telugu
Updated: April 10, 2019, 6:22 PM IST
ట్విట్టర్ సీఈఓ ఏడాది జీతం జస్ట్ రూ.97 మాత్రమే. ఇది అక్షరాలా నిజం. 2018 సంవత్సరానికి ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ తీసుకున్న వేతనం 1.40 డాలర్లు. అంటే సుమారు రూ.97. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్‌కు ట్విట్టర్ కంపెనీ వెల్లడించిన వివరాలు ఇవి. 2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన జీతం తీసుకోవడం ఇదే మొదటిసారి. 2015, 2016, 2017 సంవత్సరాల్లో ఆయన కంపెనీ నుంచి జీతం, ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు. 2018 సంవత్సరానికి మాత్రం 1.40 డాలర్ల జీతం తీసుకున్నారని కంపెనీ వెల్లడించింది.

Read this: IRCTC E-Wallet: ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో ఇలా రిజిస్టర్ చేసుకోవాలి

డోర్సీ తన మొబైల్ పేమెంట్ కంపెనీ 'స్క్వేర్' నుంచి వార్షిక వేతనం 2.75 డాలర్లు (రూ.190) తీసుకోవడం మరో విశేషం. 2018 డిసెంబర్‌లో స్క్వేర్‌లో 1.7 మిలియన్ల షేర్లు అమ్మేశాడు. పన్నులన్నీ తీసేయగా రూ.550 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం ఫోర్బ్స్ లెక్కల ప్రకారం డోర్సీ నికర విలువ రూ.32 వేల కోట్లు. ట్విట్టర్‌లో డోర్సీ వాటా రూ.4 వేల కోట్లు. ఇన్ని వేల కోట్ల ఆస్తులున్న డోర్సీ వార్షిక వేతనం 1.40 డాలర్లు మాత్రమే తీసుకొని వార్తల్లో నిలవడం విశేషం. ఇలా ఒక్క డాలర్ జీతం తీసుకున్నవారిలో డోర్సీతో పాటు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఓరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్, గూగుల్ కో ఫౌండర్లు లారీ పేజ్, సెర్జీబ్రిన్ కూడా ఉన్నారు.

Read: Samsung Galaxy M30: ఏప్రిల్ 11న ఫ్లాష్ సేల్... జియో నుంచి రూ.3,110 బెనిఫిట్స్



కంపెనీలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు ఒక డాలర్‌కే ఎందుకు పనిచేస్తారంటే దానికి పలు కారణాలున్నాయి. కంపెనీ నుంచి నేరుగా లబ్ధి పొందకుండా పనిచేసేందుకే ఫౌండర్లు, కోఫౌండర్లు ఇష్టపడుతుంటారు. మరి అలాంటప్పుడు ఒక్క డాలర్ కూడా ఎందుకు తీసుకోవడం అన్న సందేహం రావచ్చు. అయితే కొన్ని చట్టపరమైన కారణాల వల్ల సున్నా కంటే ఎక్కువ వేతనం తప్పనిసరి. అందుకే ఇలా ఒక డాలర్ తీసుకుంటూ ఉంటారు. వన్-డాలర్ సాలరీ కాన్సెప్ట్ ఇప్పుడు కాదు 1900 సంవత్సరం నుంచే మొదలైంది. అమెరికాకు చెందిన అనేక కంపెనీల పెద్దలు ఇలా ఒక డాలర్‌కే పనిచేశారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ను బిజినెస్ ఎగ్జిక్యూటీవ్స్ ఫాలో అవుతున్నారు. ఇలా ఒక డాలర్ తీసుకోవడం వల్ల తనకువచ్చే జీతభత్యాల గురించి కాకుండా షేర్ హోల్డర్ల గురించి ఆలోచిస్తారని అంటారు నిపుణులు.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్
ఇవి కూడా చదవండి:

Election 2019: ఎన్నికల్లో ఓటు వేస్తే పెట్రోల్‌పై డిస్కౌంట్

SBI Good News: గుడ్ న్యూస్... వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ
First published: April 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు