హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter: ట్విట్టర్ ఫాలోవర్స్‌లో టాప్ ప్లేస్‌లోకి ఎలాన్‌ మస్క్.. ఒబామాను దాటి ముందుకు..

Twitter: ట్విట్టర్ ఫాలోవర్స్‌లో టాప్ ప్లేస్‌లోకి ఎలాన్‌ మస్క్.. ఒబామాను దాటి ముందుకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ట్విట్టర్‌లో ఎలాన్‌ మస్క్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా అవతరించారు. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Twitter: టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్(Elon musk) గతేడాది 44 బిలియన్ డాలర్లకు ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను(Twitter) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన తరువాత మస్క్ అనేక ప్రయోగాలు చేస్తూ దాని స్వరూపాన్నే మార్చేస్తున్నారు. ట్వీట్ వర్డ్ కౌంట్ పెంచడం, బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ వంటి సంస్కరణలు తీసుకొచ్చారు. తాజాగా ట్విట్టర్‌లో ఎలాన్‌ మస్క్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా అవతరించారు.

నిన్నటి వరకు ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు(Barack obama) గుర్తింపు ఉండేది. అయితే ఎలాన్‌‌మస్క్ తాజాగా ఈ విషయంలో ఒబామాను అధిగమించి టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లారు. ప్రస్తుతం ఎలాన్‌ మస్క్‌కు ట్విట్టర్‌లో 13,30,68,709 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు 13,30,42,819 మంది ఫాలోవర్స్ ఉన్నారు.

* జూన్‌లో 100 మిలియన్ల మార్క్

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్, గత జూన్‌లో 100 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్స్ మార్క్‌ను చేరుకున్నారు. ఆ తరువాత ట్విట్టర్‌ను టేకోవర్ చేయడంతో అతని ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోతూ వస్తోంది. ఒబామా సామాజికంగా కీలకమైన విషయాలను, యూఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో జరిగిన ముఖ్యమైన విషయాలను మాత్రమే ట్వీట్ చేసే అవకాశం ఉంది. ఎలాన్‌ మస్క్ అలా కాదు. ప్రపంచంలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి విషయంపై స్పందిస్తుంటారు. వాటిపై తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో వెల్లడిస్తుంటారు. ఈ కారణంగానే మస్క్‌ ట్విట్టర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా అవతరించారు.

* మూడు, నాలుగు స్థానాల్లో ఎవరు?

ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో జస్టిస్ బీబర్, కాటి పెర్రీ వంటి టాప్ సెలబ్రిటీలు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. జస్టిస్ బీబర్‌కు 113 మిలియన్లకు పైగా ట్విట్టర్ ఫాలోవర్స్ ఉండగా, కాటి పెర్రీకి 108 మిలియన్లకు పైగా అనుచరులు ఉండటం గమనార్హం.

WhatsApp: వాట్సాప్ కొత్త అప్‌డేట్.. డిసప్పియరింగ్ మెసేజెస్‌కి 15 కొత్త డ్యూరేషన్స్.. వివరాలివే..

* అకౌంట్‌ను ప్రైవేట్ చేసి ఆపై తొలగింపు

ఎలాన్‌‌ మస్క్ తన ట్విట్టర్ అకౌంట్ రీచ్‌ను మెరుగుపరుస్తుందో లేదో చెక్ చేసుకునేందుకు ఫిబ్రవరిలో ప్రైవేట్‌గా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అప్పుడు ఓ ట్వీట్ చేశారు. ‘నా పబ్లిక్ ట్వీట్స్ కంటే ప్రైవేట్ ట్వీట్‌లను మీరు ఎక్కువగా చూస్తారో లేదో టస్ట్ చేయడానికి రేపు ఉదయం వరకు నా అకౌంట్‌ను ప్రైవేట్‌గా ఉంచుతున్నాను.’ అని చెప్పారు. దీంతో ఈ బిలియనీర్ ట్వీట్‌లను కేవలం అతని ఫాలోవర్స్ చూడటానికి మాత్రమే అవకాశం ఉంటుంది తప్ప రీట్వీట్ చేయలేరు. ట్విట్టర్ యూజర్లలో చాలా మంది మస్క్ ట్వీట్‌లను చూడలేకపోతున్నారని ఫిర్యాదులు రావడంతో మస్క్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ప్రైవేట్ సెట్టింగ్‌ను తొలగించారు.

First published:

Tags: Barack Obama, Elon Musk, Twitter

ఉత్తమ కథలు