బ్రహ్మణులకు వ్యతిరేకంగా పోస్టర్... వివాదంలో ట్విట్టర్ సీఈవో...

‘బ్రహ్మణీయ పితృస్వామ్య భావజాలం నశించాలి’ అని రాసి ఉన్న పోస్టర్‌ను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్... ఆయనకు మద్ధతుగా నిలిచిన కొందరు కాంగ్రెస్ నాయకులు.... జాక్ డోర్సేపై చర్యలు తీసుకుంటామని చెప్పిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 21, 2018, 3:10 PM IST
బ్రహ్మణులకు వ్యతిరేకంగా పోస్టర్... వివాదంలో ట్విట్టర్ సీఈవో...
ట్విట్టర్ సీఈవో జాక్ డార్సే (Image: Reuters/Rebecca Cook)
  • Share this:
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ అధినేత జాక్ డోర్సే ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న జాక్ డోర్సేను కలిసిన సామాజిక కార్యకర్తలు, మహిళా జర్నలిస్టులు, రచయితలు చేసిన పని కారణంగా జాక్ డోర్సే... తనకు తెలియకుండా పెద్ద వివాదంలో ఇరుక్కున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.... భారత పర్యటనలో ఉన్న జాక్ డోర్సే... మంగళవారం సామాజిక కార్యకర్తులు, మహిళా జర్నలిస్టులు, రచయిలతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తల్లో ఒకరు ‘బ్రహ్మణీయ పితృస్వామ్య భావజాలం నశించాలి’ అనే పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ ఫోటోను సమావేశంలో పాల్గొన్న ఓ జర్నలిస్ట్ జాక్ చేతికి ఇవ్వడంతో అతను దాన్ని పట్టుకుని ఫోటోలకు పోజ్ ఇచ్చాడు.
జాక్ డోర్స్ పోస్టర్ పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చసిన అన్నా వట్టికాడ్ అనే మహిళా జర్నలిస్ట్.... ‘ట్విట్టర్ లెజెండ్ జాక్ డోర్సే భారత్‌లో సామాజిక కార్యకర్తలు, జర్నలిస్ట్‌లు, రచయితలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భాగమయ్యాను. వాళ్లతో కలిసి ట్విట్టర్ అనుభావాలపై సమావేశాల్లో చర్చించాం. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’ అంటూ కామెంట్ పెట్టింది. ఈ పోస్టర్‌పై బ్రహ్మాణ సంఘాలు మండిపడుతున్నాయి. ట్విట్టర్ బాస్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. జాక్ డోర్స్‌కు కొందరు కాంగ్రెస్ నేతలు మద్ధతుగా నిలుస్తుండగా, కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం అతనిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోస్టర్‌పై వివాదం చెలరేగడంతో ‘నేను కావాలని ఈ ఫోటో పట్టుకోలేదు. అక్కడికి వచ్చిన ఓ దళిత కార్యకర్త తన అనుభవాలను వివరిస్తూ ఈ పోస్టర్ బహుమతిగా ఇచ్చింది. దాంతో దాన్ని పట్టుకుని ఫోటో దిగాను...’ అంటూ వివరణ ఇచ్చాడు జాక్ డోర్సే.


First published: November 21, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>