ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) ట్విట్టర్ బ్లూ (Twitter Blue) అనే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఒక కొత్త ప్లాన్‌ను ట్విట్టర్ ఆవిష్కరించింది. ఆ ప్లాన్ ప్రకారం ట్విట్టర్ బ్లూ కోసం ఆండ్రాయిడ్ వినియోగదారులకు నెలకు 11 డాలర్లు ఉంటుంది. iOS యూజర్లు కూడా సేమ్ ఇదే ధరతో ఆ సర్వీస్‌ను పొందొచ్చు. ఇంతకుముందు ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సర్వీస్ అందుబాటులో లేదు.
వెబ్ యూజర్ల కోసం నెలవారీ ఛార్జీలతో పోల్చినప్పుడు చాలా చౌకగా ఉండే యాన్యువల్ ప్లాన్‌ను కూడా ట్విట్టర్ తీసుకొచ్చింది. వెబ్ యూజర్లకు ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ధరను సంవత్సరానికి 84 డాలర్లుగా కంపెనీ సవరించింది. ఈ ప్లాన్ తీసుకోవడం ద్వారా వెబ్ యూజర్లు ఈ సర్వీస్ కోసం నెలకు 7 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది.
ఆండ్రాయిడ్ , iOS యూజర్లకు నెలకు 11 డాలర్లుగా మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ప్రైస్ నిర్ణయించిన ట్విట్టర్ వెబ్ యూజర్లకు మాత్రం ఎనిమిది డాలర్లకే ఈ సర్వీస్‌ను తీసుకొచ్చింది. అదే కొత్తగా సవరించిన యాన్యువల్ ప్లాన్ ప్రకారం దీన్ని తీసుకుంటే ఏడు డాలర్లకే ఈ సర్వీసు లభిస్తుంది. వెబ్ యూజర్లకు తగ్గింపు అనేది యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సహా కొన్ని దేశాల్లో అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ తెలిపింది.
* ట్విట్టర్ బ్లూ ఫీచర్స్
ప్రస్తుతం నిర్దిష్ట దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సర్వీస్, ట్వీట్‌లను అన్‌డూ చేయగల సామర్థ్యం వంటి ఎక్స్‌ట్రా ఫీచర్లతో సహా బ్లూ చెక్ మార్క్ వెరిఫికేషన్ ఆఫర్ చేస్తుంది. గతంలో నిర్దిష్ట వెరిఫైడ్ అకౌంట్స్‌కు మాత్రమే బ్లూ చెక్ మార్క్ అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఇది కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
ట్విట్టర్ బ్లూలో కస్టమజ్డ్ యాప్ ఐకాన్స్, లాంగ్ వీడియో అప్‌లోడ్‌ల వంటి ఎక్స్‌ట్రా ఫీచర్లు కూడా ఉంటాయి. బ్లూ చెక్‌మార్క్ ఫీచర్ కొనుగోలు కోసం కూడా అందుబాటులో ఉంటుంది కానీ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఇది కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు.
ట్వీట్ అన్‌డూ ట్వీట్ ఇతరులకు కనిపించకముందే వెనక్కి తీసుకోవడానికి సహాయపడుతుంది. అలానే ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్లు 60 నిమిషాల వరకు లేదా 2GB ఫైల్ వరకు సైజు ఉన్న లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. అలానే Twitter బ్లూ యాప్‌లో పర్సనలైజ్డ్ ఎక్స్‌పీరియన్స్ కోసం కస్టమ్ యాప్ ఐకాన్స్, థీమ్‌లు, నావిగేషన్ ఆప్షన్స్ అందిస్తుంది. ఇక కొత్తగా క్రియేట్ చేసిన ట్విట్టర్ అకౌంట్స్ 90 రోజుల పాటు ట్విట్టర్ బ్లూకు సబ్‌స్క్రిప్షన్‌ను పొందలేవు. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్లందరూ సైన్ అప్‌లో భాగంగా వారి ఫోన్ నంబర్‌ను కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.