హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter Blue: నవంబర్ చివరి నాటికి ఇండియాలో ట్విట్టర్ బ్లూ లాంచ్.. ఇండియన్ యూజర్ల కామన్ డౌట్స్ ఇవే..

Twitter Blue: నవంబర్ చివరి నాటికి ఇండియాలో ట్విట్టర్ బ్లూ లాంచ్.. ఇండియన్ యూజర్ల కామన్ డౌట్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ యూజర్లకు ట్విట్టర్ బ్లూ, వెరిఫికేషన్ మార్క్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Twitter Blue: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ (Elon Musk) ట్విట్టర్‌లో కొత్తగా ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. బ్లూ టిక్ వెరిఫికేషన్‌తో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను నెలకు 7.99 డాలర్లకు అందించడం మస్క్ ఇప్పటికే ప్రారంభించారు. ప్రస్తుతానికి టెస్టింగ్‌లో దశలో ఉన్న ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. కాగా ఇండియన్ యూజర్లకు ట్విట్టర్ బ్లూ, వెరిఫికేషన్ మార్క్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఇండియాలో ట్విట్టర్ బ్లూ రిలీజ్ ఎప్పుడు?

వెరిఫికేషన్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ట్విట్టర్ బ్లూ నెలరోజుల సమయంలో భారతదేశానికి పరిచయం చేస్తానని ఒక ట్వీట్ ద్వారా మస్క్ వెల్లడించారు. వెరిఫికేషన్‌తో కూడిన ట్విట్టర్ బ్లూ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే వంటి ప్రాంతాలలో iOS యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియన్ యూజర్లకు రిలీజయ్యే ఈ ప్లాన్ ఇతర దేశాల్లో ఆఫర్ చేసిన ఫీచర్లనే ఆఫర్ చేస్తుంది. కాకపోతే సగటు భారతీయుడు కొనుగోలు చేసేంత తక్కువ ధరల్లో దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇండియాలో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.200 లోపు ఉంటుందని అంచనా. త్వరలో ఆండ్రాయిడ్‌లో కూడా ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌తో వెరిఫైడ్ అకౌంట్‌ను పొందొచ్చా?

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌తో వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్‌ను పొందొచ్చని మస్క్ తెలుపుతున్నారు. అయితే ఇది ప్రస్తుతం ఐఫోన్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. 7.99 డాలర్లతో ట్విట్టర్ బ్లూకి సబ్‌స్క్రైబ్ చేసుకుంటే.. ఎవరైనా సరే సెలబ్రిటీల వలె బ్లూ టిక్ మార్క్‌ పొందచ్చని ట్విట్టర్ క్లారిటీ ఇచ్చింది. అయితే వెరిఫికేషన్ కోసం యూజర్లు పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్ మొదలైన ఫొటో ఐడీ ప్రూఫ్స్ అందించాలి. యూజర్లు స్పామ్ లేదా స్కామ్‌లో పాల్గొన్నారా లేదా అనే విషయం తెలుసుకునేందుకు వారి ఖాతాను ట్విట్టర్ స్కాన్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, వెరిఫికేషన్ పొందాలంటే మీరు ట్విట్టర్‌లో నిజమైన వ్యక్తి అని నిరూపించుకోవాలి. అయితే వెరిఫికేషన్ వచ్చాక మీ అకౌంట్ బాట్ల వలె పోస్టులు చేస్తుంటే.. అది తాత్కాలికంగా బ్యాన్ అవుతుంది.

HDFC Bank క్రెడిట్ కార్డు లోన్.. క్షణాల్లో అకౌంట్‌లోకి డబ్బులు, ఇలా అప్లై చేసుకోండి!

ఇప్పటికే వెరిఫైడ్‌ ట్విట్టర్ అకౌంట్ ఉన్నవారు బ్లూ టిక్‌ను నిలుపుకోవడానికి మనీ చెల్లించాలా?

ట్విట్టర్‌లో బ్లూ టిక్ కొత్తగా కావాలనుకున్నా లేదా దానిని కొనసాగించాలనుకున్నా ప్రతి ఒక్కరూ డబ్బు చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే వెరిఫైడ్‌ ట్విట్టర్ అకౌంట్ ఉన్నవారు కూడా ఆ వెరిఫికేషన్ నిలుపుకోవడానికి ట్విట్టర్ బ్లూకు సబ్‌స్క్రైబ్ కావాల్సి ఉంటుంది లేదా బ్లూ టిక్‌ను కోల్పోవాల్సి ఉంటుంది.

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌తో బెనిఫిట్స్

కంటెంట్ క్రియేటర్స్‌ ట్విట్టర్ బ్లూ కొనుగోలు చేస్తే... వారు 42 నిమిషాల వరకు లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేయగలరు. వారి పోస్ట్‌లకు ర్యాంకింగ్‌లో మరింత ఫాలోవర్లు, ప్రాధాన్యత లభిస్తుంది. మస్క్ వీడియో కంటెంట్ క్రియేటర్స్‌తో రెవిన్యూ షేరింగ్ మెకానిజంను కూడా ఎనేబుల్ చేయవచ్చు. దీన్నిబట్టి కంటెంట్ క్రియేటర్స్‌, ట్విట్టర్ ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలనుకునేవారికి బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడమే అత్యంత ముఖ్యంగా మారుతుందని చెప్పవచ్చు. రెగ్యులర్ యూజర్లు ట్విట్టర్ బ్లూ కొనుగోలు చేస్తే... వారు తక్కువ యాడ్స్, బ్లూ టిక్‌తో సహా లాంగ్ ట్వీట్లు, ఎక్కువ సమయం గల వీడియోలను పోస్ట్ చేయవచ్చు. ట్విట్టర్ బ్లూ కొనుగోలు చేయకపోతే ట్వీట్లకు ఎక్కువ విజిబిలిటీ లభించదు. యాడ్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. ఫాలోవర్లు అకౌంట్‌ను గుర్తించడంలో ఇబ్బందులు పడతారు. వీడియో పోస్ట్స్‌కి తక్కువ టైమ్ లిమిట్ ఉంటుంది.

First published:

Tags: Elon Musk, Twitter

ఉత్తమ కథలు