టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను సొంతం చేసుకోక ముందు ట్విట్టర్ బ్లూ (Twitter Blue) సబ్స్క్రిప్షన్ ప్లాన్ కేవలం కొన్ని దేశాలు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే మస్క్ చేతిలోకి ట్విట్టర్ వచ్చిందో అప్పటినుంచి ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అన్ని దేశాలకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా బ్లూటిక్ వెరిఫికేషన్ మార్క్‌తో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను నెలకు 7.99 డాలర్లతో కొన్ని ప్రాంతాల్లో మస్క్ లాంచ్ చేశారు. ప్రస్తుతానికి వెరిఫికేషన్‌తో(Verification) కూడిన ట్విట్టర్ బ్లూ యూఎస్, కెనడా(Canada), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్(New zealand), యూకే వంటి ప్రాంతాలలోని iOS యూజర్స్‌కి అందుబాటులో ఉంది.
ఇండియాలో కూడా దీనిని ఈ నవంబర్ నెల చివరి నాటికి రిలీజ్ చేస్తున్నట్లు మస్క్ ఓ ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఇండియన్ మార్కెట్లో ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ రేటు తక్కువగా ఉంటుందని సమాచారం. నెలకు 7.99 డాలర్లు చెల్లించిన తర్వాత ఏ ట్విట్టర్ యూజర్ అయినా బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ పొందవచ్చు. అలానే సబ్స్క్రైబర్లు కాని వారితో పోలిస్తే సగం కంటే తక్కువ యాడ్స్ మాత్రమే వీరికి కనిపిస్తాయి. ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు లాంగ్ ఆడియో, వీడియోలను పోస్ట్ చేయవచ్చు.
ట్విట్టర్ బ్లూ తీసుకోకపోతే ఏమవుతుంది ?
ట్విట్టర్ బ్లూ తీసుకోని యూజర్ల ట్వీట్లకు ఎక్కువ విజిబిలిటీ లభించదు. వారు మరిన్ని యాడ్స్ చూడాల్సి వస్తుంది. వెరిఫికేషన్ పొందే అవకాశమే ఉండదు. ట్విట్టర్ వెరిఫికేషన్ అకౌంట్స్‌ను తరచుగా హైలైట్ చేస్తుంటుంది. ఈ సదుపాయాన్ని జనరల్ యూజర్లు కోల్పోవాల్సి వస్తుంది. ఇంకా ఈ ప్లాన్ విస్తృత స్థాయిలో రిలీజ్ కాలేదు కాబట్టి ట్విట్టర్ బ్లూ సబ్స్క్రైబర్లు ఇప్పటికీ యాడ్స్ చూడాల్సి ఉంటుంది. కొత్త ట్విట్టర్ బ్లూ అందుబాటులోకి రాగానే వారికి సాధారణ యూజర్లతో పోలిస్తే సగం యాడ్స్ మాత్రమే కనిపిస్తాయి. అలానే సబ్స్క్రైబర్లకు మోస్ట్ రిలవెంట్ యాడ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి.
బెనిఫిట్స్
కొత్త ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌తో సెలబ్రిటీలు, కంపెనీలు, రాజకీయ నాయకుల మాదిరిగానే బ్లూ చెక్‌మార్క్ ఎవరైనా సరే పొందొచ్చు. యాప్ అప్డేట్ విడుదల చేసినా, ఫీచర్ ఇంకా లైవ్‌లో లేదు కాబట్టి బ్లూ టిక్‌ని యూజర్లు పొందడానికి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. వెరిఫికేషన్ లేదా బ్లూ టిక్ యూజర్స్ తమ కంటెంట్ రిప్లైస్, మెన్షన్స్, సెర్చ్‌లలో ప్రయారిటీ ర్యాంకింగ్‌ను పొందుతారు. దీనివల్ల స్కామ్‌లు, స్పామ్, బాట్ల విజిబిలిటీ తగ్గుతుంది. అలానే ట్విట్టర్ బ్లూ సబ్స్క్రైబర్స్ కింద మాత్రమే మామూలు యూజర్ల రిప్లైస్ కనిపిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.