బిగ్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను (Twitter) ఇటీవలే ఎలాన్ మస్క్ (Elon Musk) సొంతం చేసుకున్నారు. కంపెనీని కొనుగోలు చేయకముందు నుంచి, టేకోవర్ పూర్తయి కొత్త నిర్ణయాలు తీసుకున్న వరకూ మస్క్ చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. కంపెనీని కొన్న తర్వాత ఎలాన్ అక్టోబర్ 28న సీఈఓ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, ఇతర కీలక అధికారులను బాధ్యతల నుంచి తప్పించారు. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియలో ఎలాన్ మస్క్ కొంత వివాదాస్పదంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన పరాగ్ అగర్వాల్‌ను, ఇతర సిబ్బందిని ఎలాన్ మస్క్ తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
పరాగ్, నెడ్ సెగల్‌ను ఆహ్వానించిన ట్విట్టర్
అయితే ఇప్పుడు ట్విట్టర్ కార్యకలాపాలను నిర్వహించడానికి తిరిగి రావాలని పరాగ్ అగర్వాల్, నెడ్ సెగల్‌లను కంపెనీ కోరినట్లు పుకార్లు మొదలయ్యాయి. ఈ ఆఫర్‌ను స్వీకరించడానికి వారికి కేవలం ఆరు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇతర దేశాలలో ట్విట్టర్ ఎంత స్లోగా ఉందో చెబుతూ మస్క్ ట్వీట్ చేసినప్పుడు, ఆయన్ను ట్విట్టర్లో విమర్శించిన ఇంజినీర్ ఎరిక్ ఫ్రోన్హోఫెర్ ఈ వార్తను బహిర్గతం చేశారు. మస్క్‌ని పబ్లిక్ డొమైన్లో విమర్శించినందుకు ఫ్రోన్‌హోఫర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. పరాగ్, నెడ్లు మళ్లీ ట్విట్టర్లో చేరడానికి ఆఫర్ చేస్తున్నారనే వార్తలను తెలియజేస్తూ ఫ్రోన్‌హోఫర్ ఒక ట్వీట్ పెట్టారు.
Elon Musk: మస్క్‌తో పెట్టుకుంటే మడతడిపోద్ది.. ట్విటర్ యాప్ డెవలపర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎలాన్ ప్లాన్స్‌కు ఆ ఇంజినీర్లు అవసరం
ట్విట్టర్ తీసుకుంటున్న నిర్ణయాలపై స్పష్టత కొరవడింది. ఇప్పటికే సోషల్ మీడియాలో లేఆఫ్స్, బ్లూటిక్, ఇతర విషయాల గురించి ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఫ్రోన్‌హోఫర్ చేసిన ట్వీట్ నిజమా కాదా అనేది తెలియట్లేదు. ట్విట్టర్ తన గ్లోబల్ స్టాఫ్‌లో దాదాపు సగం మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మస్క్ ట్విట్టర్ కోసం చేసిన ప్లాన్లు అమలు చేయడానికి కొంతమంది సిబ్బంది చాలా అవసరమని ట్విట్టర్‌లోని మేనేజ్మెంట్ గ్రహించింది. దీంతో లేఆఫ్స్ ఇచ్చిన డజన్ల కొద్దీ ఇంజినీర్లకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చారు. కొందరిని పొరపాటున తొలగించినట్లు వివరణ ఇచ్చింది ట్విట్టర్ యాజమాన్యం.
ఆఫర్‌ను అంగీకరించడం కష్టమే
పరాగ్, నెడ్లను రీకాల్ చేయాలని మస్క్ నిర్ణయం తీసుకున్నారా? లేదా నిష్క్రమించే ముందు ట్విట్టర్‌లోని మునుపటి మేనేజర్లు చేసిన ఆలోచనా? అనే అంశాలపై స్పష్టత లేదు. పరాగ్, నెడ్ ఈ ఆఫర్‌కు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది కూడా ఊహాగానంగానే మిగిలింది. బాధ్యతల నుంచి తొలగించినప్పుడు పరాగ్ అగర్వాల్ ఎంచుకున్న ప్యాకేజీని కూడా, మస్క్ అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ప్లాట్‌ఫారమ్‌లో జరిగిన, జరుగుతున్న తిరుగుబాటును బట్టి అగర్వాల్, సెగల్ ట్విట్టర్‌కి తిరిగి రావడం అసంభవమని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అదే విధంగా వారిద్దరికీ మస్క్ ఎక్కువ ప్యాకేజీ ఆఫర్ చేసే అవకాశం కూడా లేదని విశ్లేషిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.