హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter: ట్విట్టర్ కొత్త ఫీచర్.. వీడియో వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ చేసే సరికొత్త అప్‌డేట్స్‌

Twitter: ట్విట్టర్ కొత్త ఫీచర్.. వీడియో వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ చేసే సరికొత్త అప్‌డేట్స్‌

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Twitter: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) తన ఫ్లాట్‌ఫామ్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఫ్లాట్‌ఫామ్‌లో వీడియో వ్యూయింగ్ (Video Viewing) ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ చేసేందుకు రెండు అప్‌డేట్స్ తీసుకొస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) తన ఫ్లాట్‌ఫామ్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఫ్లాట్‌ఫామ్‌లో వీడియో వ్యూయింగ్ (Video Viewing) ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ చేసేందుకు రెండు అప్‌డేట్స్ తీసుకొస్తోంది. ఈ కొత్త అప్‌డేట్స్‌తో యూజర్లు ఇంట్రెస్టింగ్ ట్వీట్లు, ట్రెండ్స్‌తో పాటు తమ అభిరుచులకు తగిన మరిన్ని వీడియోలను ఈజీగా కనిపెట్టొచ్చు. అలానే ట్విట్టర్‌లో షేర్ చేసే మోస్ట్ పాపులర్ వీడియోలను ఎక్స్‌ప్లోర్‌ ట్యాబ్‌లోనే చూసుకోవచ్చు. ఈ న్యూ అప్‌డేట్స్‌ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్విట్టర్ తీసుకొస్తున్న “ఇమ్మర్సివ్ మీడియా వ్యూయర్ (Immersive Media Viewer)”తో వీడియోలను ఫుల్ స్క్రీన్‌లో సింగిల్ ట్యాప్‌తో ప్లే చేసుకోవచ్చు. ట్విట్టర్ తన కొత్త అప్‌డేట్‌లో భాగంగా 'వీడియోస్ ఫర్ యూ (Videos For You)' అనే సెక్షన్ కూడా తీసుకొస్తోంది. దీనిని 'ఫర్ యూ' అనే ట్యాబ్‌ నుంచి యాక్సెస్ చేయొచ్చు. వీడియోస్ ఫర్ యూ సెక్షన్‌లో వీడియోలను వరుసగా వీక్షించవచ్చు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్వైప్‌-అప్ చేసి వీడియోలు ఎలా చూస్తారో అలా ట్విట్టర్‌లో కూడా ఎక్కువ వీడియోలను ఈజీగా కనిపెడుతూ వీక్షించవచ్చు.

* త్వరలో లాంచ్..

ఈ కొత్త అప్‌డేట్స్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలోనే పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి. వీటిని యాక్సెస్ చేసేందుకు యూజర్లు తమ ట్విట్టర్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్‌డేట్ చేసుకున్న తర్వాత కూడా ఈ సరికొత్త ఫీచర్లు రాకపోతే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ట్విట్టర్ యాప్ ఇంగ్లీష్ వెర్షన్ వాడేవారికి ఈ అప్‌డేట్స్‌ రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. IOSలో ఇంగ్లీషులో Twitterని ఉపయోగించే వ్యక్తులకు మరికొద్ది రోజుల్లో ఇమ్మర్సివ్ మీడియా వ్యూయర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

వీడియో కరోసల్‌ ప్రస్తుతం iOS, ఆండ్రాయిడ్‌లో ట్విట్టర్‌ని ఉపయోగించే సెలెక్ట్ దేశాల్లోని వ్యక్తులకు అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. ఆల్రెడీ కంపెనీ వీటిని టెస్టింగ్ చేస్తోంది. ఇప్పుడు కొందరు యూజర్లకు 'వీడియోస్ ఫర్ యూ' అనే సెక్షన్ ఎక్స్‌ప్లోర్‌ ట్యాబ్‌లో కనిపిస్తోంది. ఇందులో మోస్ట్ పాపులర్, ట్రెండింగ్ వీడియోలు ఉంటున్నాయి.

ఇది కూడా చదవండి : ఎడిటెడ్ ట్వీట్‌ను తొలిసారిగా పోస్ట్ చేసిన ట్విట్టర్.. ఫిదా అవుతున్న యూజర్లు..

* ఫీచర్ ఉండాల్సిందే..

సాధారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా సైట్స్‌తో పోలిస్తే ట్విట్టర్‌లో కొత్త వీడియోలు కనిపెట్టడం చాలా కష్టం. ఇంట్రెస్టింగ్ యానిమల్, నేచర్, టెక్ లాంటి రకరకాల వీడియోల కోసం సెర్చ్ చేసి చాలా సేపు వెతకాల్సి ఉంటుంది. దీనివల్ల యూజర్లు ఎక్కువగా వీడియోలను చూడలేకపోతున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా ట్విట్టర్ ఎక్కువ వీడియోలను చాలా సులభంగా కనుగొనేలా వీడియో డిస్కవరీని సులభతరం చేస్తోంది. పైకి స్క్రోల్ చేసినంత సేపు వీడియోలు వచ్చేలాగా కొత్త ఫార్మాట్ పరిచయం చేస్తోంది. ఈ ఎండ్-లెస్ వీడియోలను ట్విట్టర్ AI రికమెండ్ చేస్తుంది. ఇమ్మర్సివ్ మీడియా వ్యూయర్‌లో వీడియోలు చూస్తున్న యూజర్లు ట్వీట్‌కి తిరిగి వెళ్లాలనుకుంటే, టాప్ లెఫ్ట్ కార్నర్‌లో బ్యాక్‌ యారోపై క్లిక్ క్లిక్ చేస్తే సరిపోతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: New feature, Tech news, Twitter

ఉత్తమ కథలు