Twitter New API: దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోని ట్విట్టర్ (Twitter) కొత్త మార్పులు తీసుకురావడంతో పాటు సరికొత్త సేవలను అందుబాటులోకి తెస్తోంది. గతంలో ఫ్రీగా ఉన్న వాటిని ఇప్పుడు పెయిడ్ సర్వీసుల గానూ మారుస్తోంది. తాజాగా ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం పెయిడ్ API ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా ట్విట్టర్ సమాచారం, ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు, వాటిని ఉపయోగించవచ్చు. కొత్త API ప్లాట్‌ఫామ్ ఫ్రీ, బేసిక్, ఎంటర్‌ప్రైజ్ అనే మూడు విభిన్న యాక్సెస్ స్థాయిల (Access Tiers)ను ఆఫర్ చేస్తుంది. ప్రతిదీ సొంత ఫీచర్లు, ప్రయోజనాలతో వస్తుంది. వినియోగదారులు తమ అవసరాలకు ఏ స్థాయి యాక్సెస్ సరిపోతుందో ఎంచుకోవచ్చు. అయితే ఎంటర్‌ప్రైజ్ టైర్ అత్యంత సమగ్రమైన, అధునాతన ఫీచర్లను అందిస్తుందని ట్విట్టర్ తెలిపింది.
https://twitter.com/TwitterDev/status/1641222782594990080?t=T9LwVhkoF81HiWpkV4_onw&s=19
ట్విట్టర్ API సర్వీస్ కోసం కొత్త యాక్సెస్ స్థాయిలను ప్రారంభించినట్లు ట్విట్టర్ దేవ్ ఖాతా ద్వారా ప్రకటించింది. వీటిని డెవలపర్లు ట్విట్టర్ ఫీచర్లు, డేటాను యాక్సెస్ చేయడానికి ఉపయోగించవచ్చు. ట్విట్టర్ ఫిబ్రవరి 9న API సర్వీస్‌కు ఫ్రీ యాక్సెస్‌ను అందించడాన్ని నిలిపివేయాలని ప్లాన్ చేసింది, కానీ ఆ గడువును ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేసింది. తర్వాత మళ్లీ పొడిగించింది. ట్విట్టర్ కొత్త API ఫ్రీ బేసిక్ లెవెల్, నెలకు 100 డాలర్లతో బేసిక్ లెవెల్, అంతకన్నా ఖరీదైన ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌ను తీసుకొచ్చింది. ఫ్రీ బేసిక్ లెవెల్‌ను ప్రధానంగా కంటెంట్ పోస్టింగ్ బాట్‌ల కోసం వినియోగించవచ్చు. ఏ లెవెల్‌కి సబ్‌స్క్రైబ్ అయినా, వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యాడ్స్ APIకి యాక్సెస్‌ను పొందవచ్చు.
V2 అని పిలిచే API కొత్త ఫ్రీ యాక్సెస్ ట్విట్టర్‌లో కంటెంట్‌ను పోస్ట్ చేయాల్సిన వినియోగదారులకు లేదా ట్విట్టర్ APIని పరీక్షించాలనుకునే వారికి ఉత్తమంగా నిలుస్తుంది. ఈ ఫ్రీ యాక్సెస్ లెవెల్ వినియోగదారులు యాప్ లెవెల్‌లో నెలకు గరిష్ఠంగా 1,500 ట్వీట్‌లను పంపడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, మీడియా అప్‌లోడ్ ఎండ్ పాయింట్లు, లాగిన్ విత్ ట్విట్టర్ వంటి ఫీచర్లకు యాక్సెస్‌ను ఇస్తుంది.
Odysse e-bike: ఇండియన్ మార్కెట్‌లోకి కొత్త ఈవీ..సూపర్ ఫీచర్లతో ఒడిస్సీ వేడర్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్..
API కొత్త బేసిక్ (v2) యాక్సెస్ ట్విట్టర్ నుంచి నెలకు 10,000 సార్లు సమాచారాన్ని పొందడం, అలానే కంటెంట్‌ను నెలకు 50,000 సార్లు వరకు ట్విట్టర్‌కి పోస్ట్ చేయడం కోసం APIని వాడేవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ యాక్సెస్ లెవెల్ ఉన్న వినియోగదారులు రెండు యాప్ IDలను పొందవచ్చు. వారు లాగిన్ విత్ ట్విట్టర్ ఫీచర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ యాక్సెస్ లెవెల్ కోసం నెలకు 100 డాలర్లు చెల్లించాలి.
వ్యాపారాలు, పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్‌లు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సేవలను పొందడానికి ఎంటర్‌ప్రైజ్ టైర్ యాక్సెస్ లెవెల్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది మేనేజ్డ్ సర్వీసులు, ఫుల్ స్ట్రీమ్‌లను కలిగి ఉంటుంది, ఇవి ట్విట్టర్ నుంచి వచ్చే డేటా కలెక్షన్స్ కాగా ఎంటర్‌ప్రైజ్ టైర్‌కు సబ్‌స్క్రయిబ్ చేయడం ద్వారా, ఇతర యాక్సెస్ లెవెల్స్‌లో అందుబాటులో లేని ఫీచర్‌లను వ్యాపారాలు యాక్సెస్ చేయవచ్చు. ట్విట్టర్ తన పాత యాక్సెస్ టైర్‌లు అయిన స్టాండర్డ్, ఎసెన్షియల్, ఎలివేటెడ్, ప్రీమియంలను వచ్చే 30 రోజుల్లో దశలవారీగా తొలగిస్తున్నట్లు కూడా ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.