హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter: నాన్-ట్విట్టర్ బ్లూ యూజర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి బ్లూ చెక్‌మార్క్ తొలగింపు..

Twitter: నాన్-ట్విట్టర్ బ్లూ యూజర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి బ్లూ చెక్‌మార్క్ తొలగింపు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Twitter: ఏప్రిల్ 1 నుంచి కేవలం పెయిడ్ సబ్‌స్క్రైబర్లు, అప్రూవల్ పొందిన సంస్థల ఖాతాలకు మాత్రమే వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లు ఉంటాయి. పాత సిస్టమ్‌లో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అకౌంట్స్‌ నుంచి బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లను తొలగించడం ప్రారంభిస్తామని స్వయంగా ట్విట్టర్ ఒక ట్వీట్ ద్వారా ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌(Twitter)ను సొంతం చేసుకున్న సమయం నుంచి యూజర్లకు వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా ఆయన ఆధీనంలోని ట్విట్టర్ మరోసారి ఝలక్కిచ్చింది. వచ్చే వారం నుంచి ట్విట్టర్ బ్లూ సర్వీస్‌కి సబ్‌స్క్రిప్షన్ పొందని అకౌంట్స్‌ నుంచి బ్లూ చెక్‌మార్క్‌లు (Blue Checkmarks) లేదా వెరిఫికేషన్ బ్యాడ్జ్‌(Verification Badges)లు తొలగిస్తామని ప్రకటించింది. అంటే ఏప్రిల్ 1 నుంచి కేవలం పెయిడ్ సబ్‌స్క్రైబర్లు, అప్రూవల్ పొందిన సంస్థల ఖాతాలకు మాత్రమే వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లు ఉంటాయి.

పాత సిస్టమ్‌లో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అకౌంట్స్‌ నుంచి బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లను తొలగించడం ప్రారంభిస్తామని స్వయంగా ట్విట్టర్ ఒక ట్వీట్ ద్వారా ప్రకటించింది. ఏప్రిల్ 1 తర్వాత కూడా బ్లూ చెక్‌మార్క్‌ ఉండాలంటే, https://twitter.com/i/twitter_blue_sign_up లింక్‌పై క్లిక్ చేసి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

మస్క్ ట్విట్టర్ బాధ్యతలు చేపట్టాక సంచలన మార్పులు చేశారు. ఆ మార్పుల్లో భాగంగా ఖాతాల వెరిఫై కోసం పాత పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. ఫేక్ వెరిఫైడ్ అకౌంట్లు చాలా ఉన్నాయని, కాబట్టి రానున్న నెలల్లో పాత బ్లూ చెక్‌మార్క్‌లను తొలగిస్తామని చెప్పారు. వచ్చేవారి నుంచి దానిని అమలు చేయడానికి నడుం బిగించారు.

ఇక ట్విట్టర్ ఇటీవలే గోల్డ్ (Gold), గ్రే (Grey), బ్లూ (Blue) అనే మూడు విభిన్న రంగులతో ఖాతాలను ధృవీకరించడానికి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. దాని ద్వారా కంపెనీలకు గోల్డ్ చెక్‌మార్క్, ప్రభుత్వ ఖాతాలకు గ్రే చెక్‌మార్క్, ప్రముఖులు లేదా నాన్-సెలబ్రిటీలకు బ్లూ చెక్‌మార్క్‌ను ట్విట్టర్ అందిస్తోంది. బ్రాండ్‌లు, సంస్థలు బ్లూ మార్కు కోసం "వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్స్" ప్రోగ్రామ్‌లో చేరాల్సి ఉంటుంది. ఇందుకు వారు నెలకు 1,000 డాలర్లు ఎక్కువ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఈ ప్రోగ్రామ్ వ్యాపారాలు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లకు ట్విట్టర్ ఖాతాలో గోల్డ్ చెక్‌మార్క్, స్క్వేర్ షేప్డ్ అవతార్‌ను అందిస్తుంది. సంస్థలు ఒక్కో ఖాతాకు నెలకు అదనంగా 50 డాలర్ల చొప్పున వ్యక్తులను లేదా వారితో కనెక్షన్ ఉన్న ఇతర సంస్థలను కూడా జోడించవచ్చు. ఈ అనుబంధ ఖాతాలకు వెరిఫికేషన్ గుర్తు, అనుబంధ బ్యాడ్జ్ కూడా లభిస్తాయి

ఇది కూడా చదవండి : రూ.22,237 విలువైన యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో రూ.737 ధరకే కొనండి ఇలా!

చెక్‌మార్క్ యాక్టివేట్ కావడానికి ముందు వెరిఫికేషన్ గుర్తులు ఉన్న అన్ని ఖాతాలు ట్విట్టర్ ద్వారా మాన్యువల్‌గా అథెంటికేట్‌ అవుతాయి. అయితే, బ్లూ వెరిఫికేషన్ మార్క్ ఇప్పుడు ఎక్స్‌ట్రా ఫీచర్లు, పెర్క్‌లతో వచ్చే ట్విట్టర్ ప్రీమియం వెర్షన్ అయిన Twitter Blue తీసుకున్న యూజర్స్‌కి ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. భారతదేశంలో ట్విట్టర్ బ్లూ వెబ్‌ యూజర్ల నెలవారీ ఫీజు రూ.650, మొబైల్ యూజర్ల నెలవారీ ఫీజును రూ.900గా కంపెనీ నిర్ణయించింది. ట్విట్టర్‌లో ఓల్డ్ వెరిఫికేషన్ సిస్టమ్‌ ద్వారా దాదాపు 4.2 లక్షల అకౌంట్స్ బ్లూ చెక్‌మార్క్ పొందాయి. ఇప్పుడు అవన్నీ కూడా కొత్త పద్ధతిలో డబ్బులు చెల్లించడం ద్వారా బ్లూ చెక్‌మార్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా మస్క్ కోరుకున్నట్లు ట్విట్టర్ రెవెన్యూ పెరుగుతుంది.

First published:

Tags: Elon Musk, Tech news, Twitter

ఉత్తమ కథలు