Home /News /technology /

TWITTER ANNIVERSARY HOW THE MICROBLOGGING PLATFORM HAS EVOLVED SINCE ITS LAUNCH IN 2006 UMG GH

Twitter Anniversary: నేటితో ట్విట్టర్‌కు 16 ఏళ్లు.. మైక్రోబ్లాగింగ్ సైట్ గురించి ఆసక్తికర విషయాలు ఇవే..!

ట్విట్టర్

ట్విట్టర్

ట్విట్టర్ అందుబాటులోకి వచ్చి నేటికి 16 సంవత్సరాలు (16 Years) పూర్తయింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం అంటే జులై 15, 2006 ట్విట్టర్ లాంచ్ అయింది. ఆ తర్వాత ఈ సోషల్ మీడియా దిగ్గజంలో ఎన్నో మార్పులు (Changes) వచ్చాయి. ఆ ప్రధాన మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ట్విట్టర్ (Twitter) ఒకటి. ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ ద్వారా యూజర్లు తమ ఫేవరెట్ సెలబ్రిటీలు, తమకు కావాల్సిన వారి అప్‌డేట్స్ సులభంగా, వేగంగా తెలుసుకుంటున్నారు. వారితో ఈజీగా కాంటాక్ట్ కూడా అవ్వగలుగుతున్నారు. వివిధ మూలాల నుంచి వార్తలను త్వరగా పొందడానికి ట్విట్టర్‌కి మించిన సైట్ లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం నెటిజన్ల లైఫ్‌లో అంతర్భాగమైన ట్విట్టర్ అందుబాటులోకి వచ్చి నేటికి 16 సంవత్సరాలు (16 Years) పూర్తయింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం అంటే జులై 15, 2006 ట్విట్టర్ లాంచ్ అయింది. ఆ తర్వాత ఈ సోషల్ మీడియా దిగ్గజంలో ఎన్నో మార్పులు (Changes) వచ్చాయి. ఆ ప్రధాన మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2022లో ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్థానంలో కొత్త సీఈఓ పరాగ్ అగర్వాల్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఏప్రిల్‌ 2022లో 44 ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, స్పామ్ అకౌంట్లపై డేటాను ట్విట్టర్ పంచుకోవట్లేదని మస్క్ ఇటీవల డీల్ నుంచి వైదొలిగారు.

ఇదీ చదవండి: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


2006 నుంచి 2022 వరకు ట్విట్టర్‌ ప్రస్థానం
1. ట్విట్టర్ ఆలోచన జాక్ డోర్సే ఇంజనీర్‌గా పనిచేసిన పోడ్‌కాస్టింగ్ కంపెనీ ఒడియో (Odeo) నుంచి పుట్టింది. యాపిల్ తన ఐట్యూన్స్‌ (iTunes)కి పాడ్‌కాస్ట్‌లను యాడ్ చేసే ప్లాన్స్‌ను ప్రకటించిన తర్వాత ఒడియో యాజమాన్యం తమ పనులను త్వరగా చేయడం కోసం ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ మీడియం కావాలనుకున్నారు. అప్పట్లో సాధారణ ఎస్ఎంఎస్‌లు పంపించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే అప్పుడే డోర్సే యూజర్లు వారి స్నేహితులతో చిన్న బ్లాగ్ లాంటి అప్‌డేట్స్ షేర్ చేసుకునేలా ఒక షార్ట్ ఎస్ఎంఎస్‌ సర్వీస్ (SMS) తీసుకురావాలనే ఆలోచన చేశారు.

2. ఒడియో మేనేజ్‌మెంట్ డోర్సే ఆలోచనను మెచ్చి ఆ సర్వీస్ తీసుకురావాలని చెప్పారు. ఆ తర్వాత డోర్సే ఈ ప్రాజెక్ట్‌పై పని చేయడం ప్రారంభించారు. డోమైన్‌ నేమ్‌లో వోవల్ (Vowels)ని రిమూవ్ చేయడమే అప్పటి కాలంలో పాపులర్ ట్రెండ్ కావడంతో ఈ ప్లాట్‌ఫామ్‌కి మొదట్లో “Twttr” అని పేరు పెట్టారు.

3. అలా ట్విట్టర్‌ సైట్‌ ప్రారంభానికి బీజం పడింది. మార్చి 21, 2006న డోర్సే "నా twttrని సెటప్ చేస్తున్నాను." అని మొట్టమొదటి ట్వీట్‌ని పంపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత జులై 15, 2006న ట్విట్టర్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.

4. 2007లో డోర్సే సీఈఓగా బాధ్యతలు చేపట్టడంతో Twitter Inc దాని స్వతంత్ర కంపెనీగా అవతరించింది.

5. ఫేస్‌బుక్‌తో పాటు ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా విప్లవానికి దారితీసింది. ఈ మైక్రో-బ్లాగింగ్ సైట్ అనతికాలంలోనే ప్రజాదరణ పొందడం ప్రారంభించింది.6. 2007లో ట్విట్టర్ తన ప్లాట్‌ఫామ్‌లో హ్యాష్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టింది. ఈ ఆలోచనను మొదట్లో పెద్దగా ఎంకరేజ్ చేయలేదు కానీ ట్విట్టర్ యూజర్లను బాగా కనెక్ట్ అయింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌లు ఇప్పుడు ట్విట్టర్ పనితీరులో కీలకమైన భాగంగా మారాయి.

7. 2009లో చాలా మంది సెలబ్రిటీలు తమ పేర్లతో ఫేక్ అకౌంట్ల గురించి ఫిర్యాదు చేయడంతో ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్ సిస్టమ్, వెరిఫికేషన్ టిక్‌ను ప్రవేశపెట్టింది. అదే ఏడాదిలో యూజర్లకు రీట్వీట్‌ల ఫీచర్ కూడా పరిచయం చేసింది.

8. 2010లో ట్విట్టర్‌లో 100 మిలియన్ల కొత్త యూజర్లు యాడ్ అయ్యారు. దాంతో కంపెనీ మోనటైజేషన్ ఫీచర్‌గా ప్రమోటెడ్ ట్వీట్స్‌ (Promoted Tweets) ఆప్షన్‌ను లాంచ్ చేసింది.

9. తర్వాత ఆన్‌లైన్ బెదిరింపు, వేధింపులకు కళ్లెం వేసేలా ట్విట్టర్ కొత్త ఆప్షన్స్ తీసుకొచ్చింది. అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఫిల్టర్ చేయడానికి, బ్లాక్ చేయడానికి, రిపోర్ట్ చేయడానికి యూజర్లకు యాంటీ-అబ్యూస్ ఆప్షన్‌ను జోడించింది యూజర్లకు డైరెక్ట్ మెసేజ్ (DM) ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

10. ట్విటర్‌ను మొదట్లో 140 క్యారెక్టర్ లిమిట్‌తో పరిచయం చేయగా, 2017లో అది 280కి పెరిగింది.

11. 2020లో, ట్విట్టర్ తన ప్లాట్‌ఫామ్‌కు స్టోరీస్, స్పేస్‌లను పరిచయం చేసింది. అయితే స్టోరీస్ ఫీచర్‌కు యూజర్ల నుంచి తక్కువ రెస్పాన్స్ రావడంతో దానిని తొలగించింది. అలా ఇప్పుడు ట్విట్టర్ మన జీవితంలో అంతర్భాగమైపోయిందనే చెప్పాలి.
Published by:Mahesh
First published:

Tags: Elon Musk, Tech news, Tweets, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు