Twitter hack: ఒబామా, బిట్ గేట్స్ సహా ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాక్

వెంటనే అప్రమత్తమైన ట్విటర్ సపోర్ట్ టీమ్ హ్యాకింగ్‌కు గురైన ప్రముఖుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ ఖాతాల నుంచి వేరొకరు ట్వీట్స్ చేయకుండా చర్యలు చేపట్టింది. అప్పటికే చేసిన ట్వీట్లను కూడా డిలీట్ చేసింది.

news18-telugu
Updated: July 16, 2020, 8:43 AM IST
Twitter hack: ఒబామా, బిట్ గేట్స్ సహా ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాక్
ఒబామా, బిట్ గేట్స్ సహా ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాక్
  • Share this:
సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు హ్యాకర్లు షాకిచ్చారు. పలువురు అంతర్జాతీయ ప్రముఖుల ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేశారు. ఇందులో అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా, అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్, టెలివిజన్ స్టార్ కిమ్ కర్దాషియన్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఖాతాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీరి అధికారిక ఖాతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ట్వీట్లు చేశారు. వెంటనే అప్రమత్తమైన ట్విటర్ సపోర్ట్ టీమ్ హ్యాకింగ్‌కు గురైన ప్రముఖుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ ఖాతాల నుంచి వేరొకరు ట్వీట్స్ చేయకుండా చర్యలు చేపట్టింది. అప్పటికే చేసిన ట్వీట్లను కూడా డిలీట్ చేసింది.

అంతేకాదు ఉబెర్, యాపిల్ కార్పొరేట్ ఖాతాలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు ట్విటర్ తెలిపింది. ప్రముఖ క్రిప్టో ట్విటర్ ఖాతాలు కామెరాన్, టైలర్ వింక్లివోస్, జెమిని క్రిప్టో కరెన్సీ ఎక్స్‌చేంజ్, కాయిన్ ఎంబేస్ యాప్‌లు సైతం హ్యాకర్ల బారినపడ్డాయి.


ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాకింగ్ గురైన వ్యవహారంపై విచారణ చేస్తున్నామని ట్విటర్ సపోర్ట్ టీమ్ ట్వీట్ చేసింది. సమస్యను పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.
Published by: Shiva Kumar Addula
First published: July 16, 2020, 8:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading