ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అదిరిపోయే బైక్స్‌ను తక్కువ ధరలలో లాంచ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ భారత్‌లో కొత్త 2022 టీవీఎస్ రేడియన్ (2022 TVS Radeon)ని లాంచ్ చేసింది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అదిరిపోయే బైక్స్‌ను తక్కువ ధరలలో లాంచ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ భారత్‌లో కొత్త 2022 టీవీఎస్ రేడియన్ (2022 TVS Radeon)ని లాంచ్ చేసింది. ఈ రేడియన్ రిఫ్రెష్ (Radeon Refresh) బైక్ రేడియన్ బైక్స్‌కు అప్డేటెడ్ వెర్షన్‌గా వచ్చింది. ఈ బైక్‌లో మల్టీ-కలర్ రివర్స్ LCD క్లస్టర్, USB మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ (RTMi)ని కంపెనీ అందించింది. ఈ బైక్ ప్రారంభ ధర కేవలం రూ.59,925 (ఎక్స్-షోరూమ్) ఉండటం విశేషం. ఈ బైక్ మిడ్-వేరియంట్ డిజి డ్రమ్ డ్యూయల్ టోన్ ధర రూ.71,966 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.
2022 టీవీఎస్ రేడియన్ ఫీచర్లు
ఈ బైక్‌లో డిజిటల్ క్లస్టర్లో క్లాక్, సర్వీస్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండెక్స్, టాప్ స్పీడ్ & యావరేజ్ స్పీడ్ వంటి 17 ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ఇందులో క్రోమ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, థై ప్యాడ్స్ (Thigh Pads), ప్రీమియం సీట్, ప్రీమియం గ్రాఫిక్స్ అందించింది. ఈ మోడల్ నెక్స్ట్-జెన్ ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ET-Fi) టెక్నాలజీతో వస్తుందని, 15% మెరుగైన మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో అందించిన 109.7cc డ్యూరా-లైఫ్ ఇంజన్ 7,000 rpm వద్ద 8.4 PS శక్తిని 5,000 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 10-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, 4-స్పీడ్ గేర్‌బాక్స్, టీవీఎస్ ఇంటెల్లిగో (Intelligo -ISG & ISS) సిస్టమ్‌తో కూడా వస్తుంది. ఈ ఇంటెల్లిగో టెక్నాలజీతో బండి స్థిరంగా ఉన్నప్పుడు ఆఫ్ అవుతుంది. దీనివల్ల మైలేజ్ బాగా పెరుగుతుంది.
టీవీఎస్ రేడియన్ మొత్తంగా నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉంటుంది. బేస్ ఎడిషన్ 110 ES MAG.. రివర్స్ LCD క్లస్టర్‌తో డ్యూయల్-టోన్ ఎడిషన్ డ్రమ్... డ్యూయల్-టోన్ ఎడిషన్ రివర్స్ LCD క్లస్టర్ & ISG/ISSతో డ్రమ్.. LCD క్లస్టర్‌తో డ్యూయల్-టోన్ డిస్క్ ఎడిషన్ కంటి నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వస్తాయి. ఈ బైక్ డ్యూయల్-టోన్ పెయింట్స్‌తో సహా రకరకాల రంగులతో లభిస్తుంది. డ్యూయల్ టోన్ డిస్క్ వేరియంట్ కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ డ్యూయల్-టోన్ డిస్క్ వేరియంట్ రూ.74,966 ధరతో లాంచ్ అయింది. బేస్ ఎడిషన్ రంగులు కాకుండా మిగతా వాటికి టోన్ బ్లూ, బ్లాక్, స్టార్‌లైట్ బ్లూ, మెటల్ బ్లాక్, రాయల్ పర్పుల్, టైటానియం గ్రే వంటి కలర్ ఆప్షన్స్ ఇచ్చారు. డ్రమ్ బైక్ బరువు 116 కేజీలు ఉంటే, డిస్క్ బ్రేక్ బరువు 118 కేజీలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.