హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Price Hike: ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పెరుగుతాయి... కొనాలంటే ఇప్పుడే కొనండి

Price Hike: ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పెరుగుతాయి... కొనాలంటే ఇప్పుడే కొనండి

Price Hike | కొత్త టీవీ, ఫ్రిజ్, ఏసీ కొనాలనుకునేవారికి త్వరలో షాక్ తప్పది. త్వరలో వీటి ధరలు పెరగనున్నాయి. ఎందుకో తెలుసుకోండి.

Price Hike | కొత్త టీవీ, ఫ్రిజ్, ఏసీ కొనాలనుకునేవారికి త్వరలో షాక్ తప్పది. త్వరలో వీటి ధరలు పెరగనున్నాయి. ఎందుకో తెలుసుకోండి.

Price Hike | కొత్త టీవీ, ఫ్రిజ్, ఏసీ కొనాలనుకునేవారికి త్వరలో షాక్ తప్పది. త్వరలో వీటి ధరలు పెరగనున్నాయి. ఎందుకో తెలుసుకోండి.

  మీరు ఈ ఏడాది కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఆగకుండా వెంటనే కొనండి. లేదా వేసవి కోసం ఏసీ కొనాలనుకుంటున్నారా? వెయిట్ చేయకుండా మార్చి 31 లోపే కొనండి. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పెరుగుతున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. చైనాలో కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అనేక కంపెనీలు దెబ్బతిన్నాయి. దీంతో ఏసీల తయారీకి కావాల్సిన విడిభాగాలు ఇండియాకు దిగుమతిలో ఇబ్బందులు తప్పట్లేదు. ఇప్పుడు కాకపోయినా ఏప్రిల్ రెండో వారం నుంచి విడిభాగాల దిగుమతి తగ్గొచ్చని తెలుస్తుంది. చైనా నుంచి రావాల్సిన విడిభాగాలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. దీంతో ముడిభాగాల కొరత ఏర్పడుతుంది. మరోవైపు దిగుమతి చేసుకునే విడిభాగాలపై కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో కస్టమర్స్ డ్యూటీ పెంచింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఏసీల ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమే. ఒక ఏసీకి రూ.200 నుంచి రూ.1,000 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం కలిపి కనీసం 3 శాతం నుంచి 5 శాతం వరకు ధర పెరగొచ్చు.

  SBI: ఈరోజు, రేపు ఎస్‌బీఐ బ్యాంకు సేవలకు అంతరాయం

  Smartphone under Rs 10000: కొత్త ఫోన్ కొనాలా? రూ.10,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

  ఏసీలు మాత్రమే కాదు రిఫ్రిజిరేటర్స్, ఎల్ఈడీ లైట్స్, మొబైల్ ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు టీవీలు కూడా కాస్ట్‌లీ కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి టీవీల ధరలు కనీసం రూ.2,000 నుంచి రూ.3,000 మధ్య పెరగనున్నాయని అంచనా. ఇప్పుడు పెరగడమే కాదు... కొన్ని నెలలుగా టీవీల ధరలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక టీవీ ధర రూ.3,000 నుంచి రూ.4,000 పెరిగింది. టీవీ ప్యానెల్ ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఇతర దేశాల నుంచి టీవీ ప్యానెల్స్ దిగుమతి తగ్గింది. మరోవైపు కస్టమ్ డ్యూటీ పెరిగింది. వీటితో పాటు కాపర్, అల్యూమినియం, స్టీల్ లాంటి ఇన్‌పుట్ మెటీరియల్ ఛార్జీలు పెరిగాయి. రవాణా ఛార్జీలు కూడా పెరిగాయి. ఇవన్నీ కలిసి టీవీల ధరలు పెరగడానికి కారణమవుతుంది.

  SBI ADWM: ఎస్‌బీఐ క్యాష్ డిపాజిట్ మెషీన్‌లో ఈ సేవలు కూడా పొందొచ్చు

  Gas Cylinder Discount: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? డిస్కౌంట్... పొందండి ఇలా

  కేంద్ర ప్రభుత్వం కస్టమర్స్ డ్యూటీ పెంచడంతో వీటితో పాటు సోలార్ ఇన్వర్టర్లు, లాంతర్లు, ఆటో మొబైల్ పార్ట్స్, స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ కాంపోనెంట్స్, లిథియం ఇయాన్ బ్యాటరీ రా మెటిరీయల్స్, ఇంక్ క్యాట్రిడ్జెస్, లెదర్ ప్రొడక్ట్స్ నైలాన్ ఫైబర్, ప్లాస్టిక్ బిల్డర్ వేర్స్, పాలిష్డ్ సింథటిక్ స్టోన్స్, పాలిష్డ్ క్యూబిక్ జిర్కోనియా లాంటి ధరలు పెరుగుతాయి.

  First published:

  Tags: Android TV, Budget 2021, MI LED TV, Smart TV, Xiaomi Mi TV

  ఉత్తమ కథలు