TTD INTRODUCE NEW PLASTIC COVER WHICH BECOMES PLANTS AFTER OUR USAGE
TTD: ఈ ప్లాస్టిక్ కవర్లు మొక్కలుగా మారుతాయి! నయా ఆలోచనతో ముందుకొచ్చిన టీటీడీ!
టీటీడీ ప్రవేశపెట్టిన పర్యావరణ రహిత సంచుల్లో లడ్డూలు తీసుకెళ్లుతున్న భక్తులు.
పర్యావరణాకి హాని చేయకుండా ప్లాస్టిక్ కవర్లు ఉంటే ఎలా ఉంటుంది? ప్లాస్టిక్ అంటూ పర్యావరణాకి హాని చేకూర్చిని విధంగానా అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే... ఈ కవర్లు వాడి పడేశాక అవి మొక్కలుగా మారుతాయి. గో గ్రీన్ లో భాగంగా నయా ఐడియా తో ముందుకొచ్చిన టీటీడీ.
ప్లాస్టిక్ కవర్లలు భూమిలో పడేస్తే ఏం అవుతాయి? మనందరికి తెలిసింది కొన్ని వందల సంవత్సరాలైన అలానే ఉంటాయి అని కదా? అయితే అలా వాడి పడేసిన కవర్లు మొక్కలుగా తయారువుతాయని మీరెప్పుడైన విన్నారా? చూశారా? అయితే మీరు తిరుమల వెళ్లాల్సిందే. కలియిగ వైకుంఠంగా భాసిల్లుతున్న పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో ఈ నయా ఆలోచనకు నాంది పలికింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). తిరుమలలో స్వామి వారి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ...శ్రీవారి వడ,లడ్డు ప్రసాదలకు అంతే ప్రాదాన్యత ఇస్తోంటారు అక్కడకు వచ్చిన భక్తులు. ఇంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డులను ప్లాస్టిక్ కవర్ల ద్వారా టీటీడీ భక్తులకు అందిస్తూ వచ్చింది. అయితే తిరుమలలో పర్యావరణ పరిరక్షణకై 2018 లో ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని నిషేధించాలని సంచలన నిర్ణయం తీసుకుంది టీటీడీ. అందులో భాగంగా ఏడు కొండలపై ప్లాస్టిక్ వాడకలను క్రమంగ తగ్గించేందుకు చర్యలను చేపట్టింది...ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కూల్ డ్రింక్స్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత 2010 నవంబర్ 10న ప్లాస్టిక్ రహిత తిరుమలగ ప్రకటించింది టీటీడీ (TTD).
అయితే శ్రీవారి లడ్డు ప్రసాదం తీసుకెళ్లడానికి వినియోగించే ప్లాస్టిక్ కవర్ల స్టాక్ ఎక్కువగా ఉండటంతో ప్రసాదాలను అప్పుడప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ల లోనే ఇస్తూ వస్తోన్నారు కూడా అయితే ఇది చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఈ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జూట్ బ్యాగ్., క్లాత్ బ్యాగులను వినియోగించడం ప్రారంభించింది. ప్లాస్టిక్ వాడకానికి బదులుగా....గడ్డబ్యాగులను అలవాటు చేసే ప్రయత్నం చేసినప్పటికి వాటిలో పెట్టే లడ్డుల సామర్ధ్యాని బట్టి 15రూపాయల నుంచి 55 రూపాయల వరకు క్లాత్ బ్యాగులు 11రూపాయలు., 9రూపాయలు ఉండడంతో భక్తులు కాస్త భారంగా భావించే వారు.
దీంతో భక్తుల బాధలను గుర్తించిన టీటీడీ అధికారులు వాటి స్థానంలో తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని చేకూర్చిని విధంగా ఉండే మార్గాలపై దృష్ఠి పెట్టారు. దింతో విత్తనాల ద్వారా తాయారు చేసిన కవర్లను తిరుమల్లో అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. బయో డిగ్రేడబుల్ కవర్ల ద్వారా పర్యావరణానికి ఎలాంటి ముప్పు వట్టిలదని., గో గ్రీన్ దిశగా ఈ కవర్లను భూమిలో పాతిపెట్టడం ద్వారా మొక్కలు మొలకెత్తే విధంగా కవర్లను రూపోందించామని చెబుతున్నారు టీటీడీ (TTD) అధికారు.
Published by:Balakrishna Medabayani
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.