TS RTC : బుకింగ్ మరింత సులభం.. త్వరలో ఆర్టీసీ కార్గో యాప్

కార్గో సర్వీస్

ఆదాయం పెంచుకొనేందుకు ఆర్టీసీ కార్గో సేవ‌ల‌ను (Cargo Service) ప్ర‌వేశ‌పెట్టింది. ఈ సేవ‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో కార్గో సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేసేందుకు ఆర్టీసీ కార్గో యాప్‌ (Cargo app)ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

 • Share this:
  ఆదాయం పెంచుకొనేందుకు ఆర్టీసీ కార్గో  సేవ‌ల‌ను (Cargo Service) ప్ర‌వేశ‌పెట్టింది. ఈ సేవ‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో కార్గో సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేసేందుకు ఆర్టీసీ కార్గో యాప్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ యాప్ మ‌రో వారం ప‌ది రోజుల్లో అందుబాటులో ఉండ‌నుంది. ఇక ఈ యాప్ (App) ద్వారా ఎక్క‌డి నుంచైన కార్గో సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ ఈ-కామ‌ర్స్ కంపెనీల త‌ర‌హాలోనే హైద‌రాబాద్‌ (Hyderabad) తోపాటు తెలంగాణ అంతా మొబైల్ యాప్ (Mobile app) ద్వారా సేవ‌లు పొంద‌వ‌చ్చు. త్వ‌ర‌లో ఈ యాప్ ద్వారా సేవ‌లు పొంద‌వ‌చ్చ‌ని అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా వినియోగ‌దారులు త‌మ పార్శిళ్ల‌ను తీసుకొని బ‌స్‌స్టేష‌న్‌ల‌కు, ఆర్టీసీ (RTC) పార్శిల్ కేంద్రాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. బుకింగ్ కోసం బ‌స్‌స్టేష‌న్‌లోకి వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట్లోనే కూర్చొని త‌మ యాప్‌ను వినియోగించొచ్చు.

  యాప్‌తో మరింత చేరువ..
  తమ కార్గో సేవలను వినియోగించుకోవాలని ప‌లు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను ఆర్టీసీ ఇప్ప‌టికే కోరింది. అంతే కాకుండా గ్రామాల్లోనూ కార్గో సేవలను మ‌రింత మెరుగ్గా అందించే యోచ‌న‌లో ఉంది. కండక్టర్ల దగ్గరుండే టిమ్స్ మెషీన్లు, సెల్ ఫోన్ల (Cell Phones) ద్వారా కూడా కొరియర్, పార్శిల్ సేవలను వాడుకునే సౌలభ్యం కల్పించే దిశగా అడుగులేస్తున్న ఆర్టీసీ కార్గో సేవ‌ల‌కు యాప్ మ‌రింత ఊత‌మిస్తుంది. ఇప్పటివరకు 15 లక్షలకుపైగా పార్శిళ్లను ఆర్టీసీ కార్గో సేవల ద్వారా తరలించారు.

  Phone features: ఐఓఎస్ 15 వ‌చ్చేసింది .. ఫీచ‌ర్లు ఇవే


  ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి 60 శాతానికిపైగా పార్సిళ్లు్ల తెలంగాణ జిల్లాలకు, ఏపీలోని వివి ధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఇప్పటికీ వినియోగదారులే తాము పంపించాల్సిన వస్తువులను సమీప బస్‌స్టేషన్ల వరకు తీసుకొస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు కొంతమేర భారంగానే ఉంది. దీంతో వినియోగదారులు ఇంటి నుంచి బస్‌స్టేషన్ల (Bus Stations) వరకు వెళ్లడాన్ని అదనపు ఖర్చుగా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యాప్ ద్వారా వేగ‌వంతమైన సేవ‌లు అందించే వీలు ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

  వినియోగ‌దారుల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకొని సంస్థ యాప్‌ను తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఆర్టీసీ ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆర్టీసీ 150 బ‌స్సుల ద్వారా కార్గో సేవ‌ల‌ను అందిస్తోంది. ఈ సేవ‌ల‌ను సంస్థ‌ మ‌రింత వేగంగా విస్త‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది.  కార్గో సేవలు ప్రారంభమైన తరువాత  ఆర్టీసీకి కొత్త కళ వచ్చింది.  సంస్థకు కార్గో సేవలు ఆర్థికంగా మంచి వనరుగా మారింది.
  Published by:Sharath Chandra
  First published: