వాట్సాప్‌లో ఒక సింపుల్ ట్రిక్ ఉపయోగిస్తే టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు. గూగుల్ అసిస్టెంట్ (Google Assistant)ను వాడటం ద్వారా మీరు చేతులు ఉపయోగించకుండానే మాటలతో టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వల్ల కమ్యూనికేషన్ మరింత సులభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా క్షణాల్లోనే బంధుమిత్రులకు మెసేజ్ చేయడం వాట్సాప్ ద్వారా సాధ్యమవుతుంది. అయితే పొడవైన మెసేజ్ (Long Messages)లను టైప్ చేయ లేనివారు ఎక్కువగా వాయిస్ మెసేజ్‌లు పంపిస్తుంటారు. వాయిస్ మెసేజ్‌లు పంపడమూ ఇష్టం లేదనుకుంటే టైప్ చేయక తప్పదు. ఈ తరహా యూజర్లు టెక్స్ట్ మెసేజెస్ టైప్ చేయలేక చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. అయితే ఒక సింపుల్ ట్రిక్ ఉపయోగిస్తే టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు. గూగుల్ అసిస్టెంట్ (Google Assistant)ను వాడటం ద్వారా మీరు చేతులు ఉపయోగించకుండానే మాటలతో టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్లోని గూగుల్ అసిస్టెంట్ సాయంతో ఒక్క పదం కూడా టైప్ చేయాల్సిన పని లేకుండా యూజర్లు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. ఈ ట్రిక్ వర్క్ అవ్వాలంటే గూగుల్ అసిస్టెంట్‌ని యాక్టివేట్ చేయాలి. అలాగే గూగుల్ అసిస్టెంట్ మీరు మాట్లాడే మాటలను గుర్తిస్తుందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. హోమ్ స్క్రీన్ బటన్‌పై లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా మీరు గూగుల్ అసిస్టెంట్‌ని ఓపెన్ చేయవచ్చు. అనంతరం "Send A WhatsApp Message To... (Contact)" అని మాట్లాడాలి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ భాష వద్దు అనుకుంటే "Change Language To Telugu" అని చెప్పవచ్చు. అప్పుడు గూగుల్ అసిస్టెంట్ మీరు మాట్లాడే తెలుగు గుర్తించడంతో పాటు తెలుగులోనే రెస్పాండ్ అవుతుంది.
టైపింగ్ చేయకుండా వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ ఎలా పంపాలి
స్టెప్ 1: ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ యాప్ ఓపెన్ చేయాలి. లేదా "Ok Google" అని చెప్పి గూగుల్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయాలి.
స్టెప్ 2: యాక్టివేట్ చేసిన తర్వాత, గూగుల్ అసిస్టెంట్ రెస్పాండ్ అవుతుంది. అప్పుడు, మీరు " XXXX (మీ ఫోన్లో కాంటాక్ట్ పేరు) కాంటాక్ట్‌కు వాట్సాప్ మెసేజ్ పంపాలి" అని చెప్పాలి. లేదా ఇంగ్లీష్ భాషలో అయితే "Send A WhatsApp Message To XXX" అని చెప్పాలి. XXX అంటే మీరు మెసేజ్ పంపించాలి అనుకున్న కాంటాక్ట్ పేరు.
స్టెప్ 3: ఆ కాంటాక్ట్‌కి ఏం మెసేజ్ పంపాలో చెప్పాలని (What's The Message?) గూగుల్ అసిస్టెంట్ అడుగుతుంది. అప్పుడు మీరు ఆ కాంటాక్ట్‌కి పంపాలి అనుకున్న మెసేజ్ మాత్రమే చెప్పాలి. ఉదాహరణకు "హాయ్, ఎలా ఉన్నావు... (Hi, How Are You Etc)... " అని మాత్రమే చెప్పాలి.
స్టెప్ 4: అప్పుడు గూగుల్ అసిస్టెంట్ మీరు చెప్పిన మెసేజ్‌ను అదే టైప్ చేస్తుంది.
స్టెప్ 5: టైప్ చేసిన తర్వాత ఈ మెసేజ్ సెండ్ చేయమంటారా అని గూగుల్ అసిస్టెంట్ అడుగుతుంది. ఈ మెసేజ్‌లో ఏవైనా టైపింగ్ తప్పులు ఉంటే మీరు వాటిని సరి చేయవచ్చు. ఆ తర్వాత "సరే, పంపండి (Okay, Send it)" అని చెప్పాలి.
స్టెప్ 6: అలా చెప్పిన తర్వాత గూగుల్ అసిస్టెంట్ మీ మెసేజ్‌ను మీరు చెప్పిన కాంటాక్ట్‌కి సెండ్ చేస్తుంది.
ఈ ట్రిక్ ఉపయోగించడం ద్వారా ఎంత పెద్ద వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్‌ను అయినా మీరు టైప్ చేయకుండానే సులభంగా పంపించవచ్చు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.