TRY THESE 7 STEPS TO SECURE YOUR FACEBOOK ACCOUNT SU GH
Facebook: మీ ఫేస్బుక్ అకౌంట్ సేఫేనా?.. భద్రత కోసం ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వండి
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఫేస్బుక్ కొనసాగుతోంది. అయితే కొంత మంది సైబర్ కేటుగాళ్లు, యూజర్ల డేటాను హ్యాక్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ రకమైన కేసులు ఎక్కువయ్యాయి.
ప్రస్తుత ఆధునిక యుగంలో ఫేస్బుక్ అకౌంట్ లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఫేస్బుక్ కొనసాగుతోంది. అయితే ఫేస్‌బుక్‌తో ఎన్ని లాభాలున్నాయో.. అంతే స్థాయిలో నష్టాలున్నాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లోని యూజర్ డేటా భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది సైబర్ కేటుగాళ్లు, యూజర్ల డేటాను హ్యాక్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ రకమైన కేసులు ఎక్కువయ్యాయి. అందువల్ల, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ విలువైన డేటా వారి చేతిలోకి వెళ్తే ప్రమాదం ఉంది. హాకర్ల బారి నుంచి తప్పించుకోవడానికి ఫేస్బుక్లో కొన్ని ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగులను మార్చుకోవాలి. ఈ క్రింది స్టెప్స్ అనుసరించి మీ ఫేస్బుక్ అకౌంట్‌ను హాకర్ల నుంచి కాపాడుకోండి.
భద్రత కోసం అనుసరించాల్సిన స్టెప్స్..
స్టెప్ 1: ముందుగా మీ ఫేస్బుక్ అకౌంట్‌కు లాగిన్ అయి 'సెట్టింగ్స్, ప్రైవసీ' పేజీకి వెళ్లండి.
స్టెప్ 3: అందులోని ‘వేర్ యూ ఆర్ లాగ్డ్ ఇన్’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ సెట్టింగ్ మీరు ఫేస్బుక్లో లాగిన్ అయిన సెషన్లను చూపిస్తుంది. అందులో మీరు గుర్తించని లాగిన్ సెషన్లు ఏమైనా ఉంటే, త్రీ డాట్ మెనూపై క్లిక్ చేసి ‘లాగ్ అవుట్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. తద్వారా, సంబంధిత సెషన్ నుంచి మీరు వెంటనే లాగ్ అవుట్ అవుతారు. మీరు అన్ని సెషన్ల నుంచి ఒకేసారి లాగ్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
స్టెప్ 4: తరువాత, 'లాగిన్' ఆప్షన్ క్రింద ఉన్న 'సేవ్ యువర్ లాగిన్ ఇన్ఫర్మేషన్’ పై క్లిక్ చేయండి. ఇలా చేయడంతో మీరు లాగిన్ సమాచారం సురక్షితంగా సేవ్ చేసుకోవచ్చు. మీ పర్సనల్ కంప్యూటర్లో అయితేనే దీన్ని అనుసరించండి.
స్టెప్ 5: సెట్టింగ్ మెనూలో ఉన్న ‘టూ ఫ్యాక్టర్ అథన్టికేషన్ (2FA)’ ఆప్షన్‌లోకి వెళ్లి ఎడిట్ ఆప్షన్‌ను ఎంచుకోండి. అథెంటికేటర్ యాప్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా మీరు లాగిన్ కావొచ్చు. ఈ ప్రాసెస్‌లో మీకు ఒక బ్యాక్అప్ కోడ్ వస్తుంది. దీన్ని నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీ అకౌంట్ లాగిన్ ఐడి, పాస్వర్ట్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
స్టెప్ 6: ఇప్పుడు 'సెట్టింగ్ అప్ ఎక్స్ట్రా సెక్యూరిటీ’ ఆప్షన్ మీద క్లిక్ చేసి, లాగిన్ అలర్ట్ సెట్టింగ్‌ను ఆన్ చేయండి. తద్వారా ఇది మీకు లాగిన్ అలర్ట్ అందిస్తుంది. ఒకవేళ మీ ఫేస్బుక్ అకౌంట్లోకి వేరే మొబైల్ నుంచి లాగిన్ అయితే, వెంటనే దాన్ని గుర్తించి ఫేస్బుక్ మీ ఈ–మెయిల్‌కు లేదా ఫేస్‌బుక్‌కు హెచ్చరికతో కూడిన మెసేజ్ పంపిస్తుంది.
స్టెప్ 7: చివరగా, 'సెట్టింగ్ అప్ ఎక్స్ట్రా సెక్యూరిటీ' ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ మీ ఫేస్‌బుక్‌లోని ముగ్గురు నుంచి ఐదుగురు స్నేహితులను ఎంచుకోండి. దీంతో మీరు ఎప్పుడైనా మీ అకౌంట్‌ను యాక్సెస్ చేయలేకపోతే వారి అకౌంట్లను ఉపయోగించి లాగిన్ అయ్యే అవకాశం లభిస్తుంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.