హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Android Phone Storage: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ పనితీరు తగ్గిందా? అయితే.. వెంటనే ఇలా చేయండి

Android Phone Storage: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ పనితీరు తగ్గిందా? అయితే.. వెంటనే ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీ ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరు తగ్గిపోయిందా? బాగా ల్యాగ్ అవుతుందా? ఇవన్నీ ఫోన్ స్టోరేజ్ నిండిపోవడాన్ని తెలిపే సంకేతాలే. అందుకే, అవసరం లేని ఫైల్స్​ను డిలీట్​ చేసేందుకు ఈ కింది ఆప్షన్లను ట్రై చేయండి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్(Android Phone) పనితీరు తగ్గిపోయిందా? బాగా ల్యాగ్ అవుతుందా? ఇవన్నీ ఫోన్ స్టోరేజ్(Phone Storage) నిండిపోవడాన్ని తెలిపే సంకేతాలే. ఈ రోజుల్లో చాలామంది తమకిష్టమైన సినిమాలను(Movies) హెచ్‌డీ క్వాలిటీల్లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇక కెమెరాల(Camera) ద్వారా ఫొటోలు, వీడియోలు (Photos, Videos) కూడా రికార్డ్ చేస్తున్నారు. దీనివల్ల 128జీబీ లేదా అంతకన్నా ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్(Internal Storage) ఉన్నా.. స్టోరేజ్ స్పేస్ సమస్యలు వస్తున్నాయి. అలాగని ముఖ్యమైన డిలీట్(Delete) చేయడానికి చాలా మంది ఇష్టపడకపోవచ్చు. అలాంటప్పుడు మీ ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆక్రమించుకునే కొన్ని అనవసరమైన ఫైల్స్(Files) గుర్తించాలి. వాటిని డిలీట్(Delete) చేయడం ద్వారా మీ ఫోన్ సూపర్ స్పీడ్‌గా పనిచేస్తుంది. మరి అనవసరమైన ఫైల్స్ సింపుల్‌గా ఎలా గుర్తించాలి.. వాటిని ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

1. క్యాచీ(Cache)ని క్లియర్ చేయండి (Wipe the cache):

చాలా ఆండ్రాయిడ్ యాప్‌లు యూజర్లకు స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ అందించడానికి సేవ్ చేసిన లేదా క్యాచీడ్(Cached Data)డేటాను ఉపయోగిస్తాయి. ప్రతిసారి మొదటి నుంచి లోడ్ కాకుండా చాలా వేగంగా ఓపెన్ అయ్యేందుకు యాప్స్ క్యాచీ డేటా స్టోర్ చేసుకుంటాయి. కొద్ది రోజులు వాడి ఇప్పుడు మీరు ఎక్కువగా ఉపయోగించని యాప్‌లు కూడా ఇప్పటికీ క్యాచీ డేటా స్టోర్ చేసుకునే ఉంటాయి. ఇలాంటి అప్లికేషన్ల క్యాచీ డేటాను డిలీట్ చేయడం ద్వారా చాలా ఫ్రీ స్పేస్ ఏర్పడుతుంది. ఇది అనవసరమైన డేటా కాబట్టి నిర్భయంగా డిలీట్ చేసుకుని మీ ఫోన్ పనితీరుని మెరుగు పరచవచ్చు. ఒక యాప్ క్యాచీ చేసిన డేటాను డిలీట్ చేయడానికి సెట్టింగ్స్> అప్లికేషన్‌లు> అప్లికేషన్ మేనేజర్‌లోకి వెళ్లండి. మీరు క్యాచీ డిలీట్ చేయదలచుకున్న అప్లికేషన్‌ను సెలక్ట్ చేయండి. తరువాత యాప్ అప్లికేషన్ డీటెయిల్స్ మెనూకి వెళ్లి.. స్టోరేజీపై క్లిక్ చేయండి. ఆపై క్లియర్ క్యాచీ ఆప్షన్ పై నొక్కండి. అన్ని యాప్‌ల నుంచి క్యాచీ డేటాను డిలీట్ చేయడానికి సెట్టింగ్స్> స్టోరేజ్‌లోకి వెళ్లి క్యాచీడ్ డేటా(Cached Data)పై నొక్కండి.

Flipkart Big Diwali Sale: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ లో ఈ ఫోన్లపై డిస్కౌంట్లు.. వివరాలివే

2. పాత ఈ-మెయిల్ అటాచ్‌మెంట్స్ లేదా డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌లను డిలీట్ చేయండి(Delete any outdated email attachments or downloaded files):

ఈమెయిల్‌ల అటాచ్‌మెంట్స్ లోని డాక్యుమెంట్లు జీమెయిల్ యాప్‌లో అవసరమైనప్పుడు చూసుకోవచ్చు. ఫొటోలను ఈమెయిల్స్ నుంచి మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ మీ ఫోన్‌లో ఈమెయిల్‌ల అటాచ్‌మెంట్స్ ఉంచాల్సిన అవసరం లేదు. వీటిని డిలీట్ చేయడం ద్వారా ఫోన్ మెమరీ చాలా వరకు ఫ్రీ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లోకి వెళ్లి ఈ అనవసరమైన ఫైల్‌లను డిలీట్ చేసుకోవచ్చు.

Mi 11X Pro 5G: రూ.39,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.15,000 లోపే... ఆఫర్ ఇంకొన్ని రోజులే

3. ఫైల్స్ బై గూగుల్ (Files By Google) యాప్‌తో జంక్‌క్లీన్ చేయండి(Clean junk on a regular basis with Files by Google):

ఫైల్స్ బై గూగుల్ యాప్‌ మీ ఫోన్‌లోని స్టోరేజ్ పెంచేందుకు అనవసరమైన ఫైల్స్ సజెస్ట్ చేస్తుంది. మీ ఫోన్ పనితీరుపై తగ్గించే జంక్ లేదా తాత్కాలిక ఫైల్‌లను క్లియర్ చేయడానికి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లను అందిస్తుంది. తద్వారా మీ ఫోన్‌లోని పనికిరాని డేటాని చాలా సులభంగా తొలగించవచ్చు.

Smart Phone: మీ ఫోన్ స్లో అవుతుందా..? ఎందుకో తెలుసా..? ఇలా చేస్తే స‌రి

4. క్లౌడ్‌ స్టోరేజ్‌లో మీ డేటాను బ్యాకప్ చేయండి(Backup Your Data to the Cloud):

మీ డేటాను స్టోర్ చేయడానికి క్లౌడ్ స్టోరేజ్‌ను ఉపయోగించవచ్చు. మీ డేటాను క్లౌడ్‌ స్టోరేజ్‌లో బ్యాకప్ చేసిన తర్వాత మీ ఫోన్ నుంచి ఆ డేటాను డిలీట్ చేయొచ్చు. తద్వారా ఫోన్ మెమరీ ఫ్రీ అవుతుంది. గూగుల్ డ్రైవ్ 15జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా అందిస్తుంది. గూగుల్ తో పాటు డ్రాప్‌బాక్స్ లో 2జీబీ ఫ్రీ స్టోరేజ్, వన్ డ్రైవ్ లో 5జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ పొందొచ్చు. వీటిలో మీ డేటాను ఫ్రీగా స్టోర్ చేసుకోవచ్చు.

5. 'ఫ్రీఅప్ స్పేస్' బటన్‌పై క్లిక్ చేయండి(Click the ‘Free Up Space’ button):

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫ్రీఅప్ స్పేస్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా కొంత మెమరీని క్లియర్ చేయొచ్చు. ఇందుకు సెట్టింగ్స్> డివైజ్ మెయింటెనెన్స్> స్టోరేజ్ లోకి వెళ్లండి. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో “డివైజ్ మెయింటెనెన్స్”కి బదులు “డివైజ్ కేర్” అనే ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్లి“ఫ్రీఅప్ స్పేస్” లేదా “ఫ్రీఅప్ స్పేస్ స్టోరేజ్ స్పేస్”పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇప్పటికే బ్యాక్అప్ అయిన ఫైల్స్ డిలీట్ అవుతాయి.

First published:

Tags: 5G Smartphone, Android, Smartphone

ఉత్తమ కథలు