TRY POST BOX APP TO HOLD NOTIFICATIONS MESSAGES AND MINIMIZE DISTRACTIONS KNOW HOW IT WORKS SS
Post Box App: మీ ఫోన్‌కు మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయా? ఈ ఒక్క యాప్‌తో చెక్ పెట్టొచ్చు
Post Box App: మీ ఫోన్‌కు మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయా? ఈ ఒక్క యాప్‌తో చెక్ పెట్టొచ్చు
(image: Playstore)
Post Box App | మీకు వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, అలర్ట్స్ అన్నీ పోస్ట్ బాక్స్‌లోకి వెళ్లిపోతాయి. మీరు సూచించిన సమయంలోనే అవి మీకు డెలివరీ అవుతాయి. లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్ యాప్ ఓపెన్ చేసి మీకు వచ్చిన మెసేజ్‌లు చూడొచ్చు.
స్మార్ట్‌ఫోన్... రోజూ అనేక అవసరాలను తీర్చే సాధనంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. అయితే ఈ గ్యాడ్జెట్ ఇప్పుడు సమస్యగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఎక్కువగా ఉండటం, వాటి నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తుండటంతో ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌తోనే గడపాల్సి వస్తోంది. మెసేజ్‌లు, అలర్ట్స్, నోటిఫికేషన్లు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. స్మార్ట్‌ఫోన్ కాస్త ఎక్కువగా ఉపయోగించేవారికి రోజూ 1000 పైగా నోటిఫికేషన్స్ వస్తాయని అంచనా. అందులో వాట్సప్ మెసేజ్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లు, యాప్ నోటిఫికేషన్లు, పుష్ నోటిఫికేషన్స్, అలర్ట్స్... ఇలా చాలా ఉంటాయి. నోటిఫికేషన్ రాగానే చూడకుండా ఉండలేని పరిస్థితి యూజర్లది. ఎంత బిజీ పనుల్లో ఉన్నా, చివరకు హాలిడేస్‌లో, వెకేషన్లో ఉన్నా ఈ నోటిఫికేషన్ల సమస్య తప్పదు. అయితే వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ ఓ యాప్ రూపొందించింది. డిజిటల్ వెల్బీయింగ్లో భాగంగా 'పోస్ట్ బాక్స్' యాప్‌ను రూపొందించింది. ఆ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
గతంలో ఇళ్ల ముందు పోస్ట్ బాక్సులు ఉండేవి. లెట్స్ ఏవైనా వస్తే పోస్ట్ బాక్స్‌లో వేసి వెళ్లిపోయేవాడు పోస్ట్ మ్యాన్. తీరికగా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్ ఓపెన్ చేసి లెటర్స్ చదవడం అప్పట్లో ఉన్న అలవాటు. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో పోస్ట్ బాక్స్ యాప్ రూపొందించింది గూగుల్. ఈ యాప్ ఆన్ చేశారంటే... మీకు వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, అలర్ట్స్ అన్నీ పోస్ట్ బాక్స్‌లోకి వెళ్లిపోతాయి. మీరు సూచించిన సమయంలోనే అవి మీకు డెలివరీ అవుతాయి. లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్ యాప్ ఓపెన్ చేసి మీకు వచ్చిన మెసేజ్‌లు చూడొచ్చు. అంటే మీరు బిజీగా ఉన్నప్పుడు లేదా సెలవుల్లో ఉన్నప్పుడు మీ ఫోన్ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయొద్దు అనుకుంటే పోస్ట్ బాక్స్ యాప్ ఆన్ చేస్తే చాలు. ఒక్క మెసేజ్, నోటిఫికేషన్ కూడా రాదు. అన్నీ పోస్ట్ బాక్స్‌లోకి వెళ్లిపోతాయి. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పెరిమెంట్లో భాగంగా గూగుల్ రూపొందించిన కొన్ని యాప్స్‌లో 'పోస్ట్ బాక్స్' యాప్ కూడా ఒకటి. మీరు కూడా పోస్ట్ బాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఏకాగ్రత దెబ్బతినకుండా, మీ విలువైన సమయాన్ని స్మార్ట్‌ఫోన్ కోసం ఖర్చు చేయకుండా కాపాడుకోండి. పోస్ట్ బాక్స్ యాప్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. గూగుల్ డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్మీ 8 ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.