హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Truecaller: యూజర్లకు బ్యాడ్ న్యూస్.. కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించిన ట్రూకాలర్.. ఎందుకంటే..

Truecaller: యూజర్లకు బ్యాడ్ న్యూస్.. కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించిన ట్రూకాలర్.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూజర్లకు భారీ షాకిస్తూ ట్రూకాలర్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ కొత్త పాలసీలకు అనుగుణంగా తమ యాప్ నుంచి కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించినట్లు సంస్థ ప్రకటించింది. పూర్తి వివరాలివే..

ప్రముఖ కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్ (Truecaller) తన వినియోగదారులందరికీ ఫ్రీగా కాల్ రికార్డింగ్ (Call Recording) ఫీచర్ ఆఫర్ చేస్తుండటం, ఈ ఫీచర్‌ను కోట్లాది మంది వాడుతుండటం తెలిసిందే. కానీ తాజాగా వారందరికీ షాకిచ్చే ఓ నిర్ణయం తీసుకుంది ట్రూకాలర్. గూగుల్ (Google) కొత్త పాలసీలకు అనుగుణంగా తమ యాప్ నుంచి కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించినట్లు ప్రకటించింది. ఫోన్ కాల్‌లను రికార్డ్ చేసే ఆప్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేస్తామని ట్రూకాలర్ కన్ఫామ్ చేయడంతో యూజర్లు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అందుబాటులోనే ఉంటుంది. కానీ మే 11 నుంచి యాప్ నుంచి రిమూవ్ అవుతుంది.

ఇటీవలే గూగుల్ సంస్థ గూగుల్ ప్లే స్టోర్‌లోని కాల్ రికార్డింగ్ యాప్‌లకు సంబంధించి పాలసీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం మే 11 నుంచి అమల్లోకి రానుండగా ఆ సమయం నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్ అందుబాటులో ఉండవు. అలానే ఆండ్రాయిడ్‌లోని ఆల్రెడీ ఉన్న కాల్ రికార్డింగ్ యాప్‌లు పని చేయడం ఆగిపోతాయి. ఆ తరువాత మీరు మీ ఫోన్‌లో వాయిస్ కాల్‌లను రికార్డ్ చేయాలనుకుంటే, మీ స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఇన్-బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌పై ఆధారపడాల్సి వస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ లేకపోతే మే 11 తర్వాత మీరు కాల్‌లను రికార్డ్ చేయలేరు.

Premium Hike: పెరగనున్న హెల్త్ పాలసీల ధరలు.. మీరు ప్రీమియం భారాన్ని ఇలా తగ్గించుకోండి..“చాలామంది యూజర్ల అభ్యర్థనల నిమిత్తం మేం ట్రూకాలర్‌లో అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు కాల్ రికార్డింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చాం. ట్రూకాలర్‌లో కాల్ రికార్డింగ్ అందరికీ ఉచితం. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడానికి గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే అప్‌డేటెడ్ గూగుల్ డెవలపర్ ప్రోగ్రామ్ విధానాల ప్రకారం, గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐ యూజ్ చేసి ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం కుదరదు. ఈ కారణంగా ట్రూకాలర్‌లో కాల్ రికార్డింగ్‌ని అందించలేం" అని అధికారిక ట్రూకాలర్ ప్రతినిధి తాజాగా మీడియాకు చెప్పారు.

Prashant Kishor విషయంలో CM KCR అనూహ్య వ్యూహం! -TRSలో చంద్రబాబు ఫార్ములా?కాల్ రికార్డింగ్‌ని కలిగి ఉన్న ఫోన్లపై గూగుల్ న్యూ పాలసీ ప్రభావం చూపదని ట్రూకాలర్ స్పష్టం చేసింది. షియోమీ, శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో వంటి కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తమ ఇన్-బిల్ట్ కాల్ రికార్డర్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఇవి మే 11 తర్వాత కూడా యథాతధంగా పని చేస్తూనే ఉంటాయి.

Hyderabad: అక్షింతలు వేస్తానంటూ అంతం చేసి.. ఆలయంలోనే శవాన్ని దాచి.. మల్కాజ్‌గిరి ఘటనలో షాకింగ్ నిజాలివే


కాల్ రికార్డింగ్ యాప్‌ల సమస్య ఏంటి?

గూగుల్ మొదటినుంచి కాల్ రికార్డింగ్‌ యాప్స్‌పై వ్యతిరేకతను కనబరుస్తూ వస్తోంది. అంతేకాదు, తన ప్రైవసీ, సేఫ్టీ వ్యూహంలో భాగంగా కాల్ రికార్డింగ్ ఫీచర్ యూజర్లకు గతంలోనే తొలగించింది. ఐతే థర్డ్ పార్టీ అప్లికేషన్లను మాత్రం గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐని ఉపయోగించి కాల్స్ రికార్డ్ చేస్తున్నాయి. ఈ ఫీచర్‌ని అందించడం కోసం ట్రూకాలర్ తో సహా అన్ని కాల్ రికార్డింగ్ యాప్‌లు యాక్సెసిబిలిటీ ఏపీఐని ఉపయోగిస్తున్నాయి. కానీ కొత్త పాలసీ అమల్లోకి వచ్చాక వీటి సహాయంతో రికార్డ్ చేయడం కుదరదు. ఎందుకంటే కాల్ రికార్డింగ్స్ కోసం తన యాక్సెసిబిలిటీ ఏపీఐకి యాక్సెస్‌ను గూగుల్ తీసివేస్తోంది. అంటే అన్ని థర్డ్ పార్టీ యాప్‌లు రికార్డింగ్ చేసేందుకు యాక్సెస్‌ను పొందలేవు. రోగ్ డెవలపర్లు గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐని దుర్వినియోగం చేస్తూ యూజర్లను ట్రాక్ చేస్తున్నారని గూగుల్ కనిపెట్టింది. అందుకే ఇది గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐకి యాక్సెస్‌ను అవసరం ఉన్నవాటికి అందిస్తోంది.

Published by:Madhu Kota
First published:

Tags: Google, Truecaller

ఉత్తమ కథలు