ట్రూకాలర్‌లో ఆ ఫీచర్ మళ్లీ వచ్చేసింది!

'మీ ప్రొఫైల్‌ని ఎవరు చూశారు?' అనే ఫీచర్‌ని ట్రూకాలర్ మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైనా ట్రూకాలర్‌లో మీ ప్రొఫైల్ చూస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.

news18-telugu
Updated: June 28, 2018, 5:43 PM IST
ట్రూకాలర్‌లో ఆ ఫీచర్ మళ్లీ వచ్చేసింది!
(Image: Truecaller)
  • Share this:
ప్రముఖ కమ్యూనికేషన్ యాప్ ట్రూకాలర్ గతంలో ఆపేసిన ఫీచర్‌ను మళ్లీ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 'మీ ప్రొఫైల్‌ని ఎవరు చూశారు?' ఫీచర్ గతంలో యాప్‌లో ఉండేది. కొంతకాలంగా కనిపించని ఆ ఫీచర్‌ను మళ్లీ ఇంటర్‌ఫేస్‌లో చేర్చింది ట్రూకాలర్. అయితే ఈ ఫీచర్ ప్రొ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే. తమ ప్రొఫైల్‌ను ఎవరెవరు చూశారో యూజర్లు తెలుసుకోవచ్చు. ఎవరి నుంచి కాల్స్ రావొచ్చో ముందే అంచనా వేయొచ్చని కంపెనీ తన ప్రకటనలో వెల్లడించింది.

ఎవరైనా ప్రొఫైల్ చూసిన వెంటనే ప్రొ యూజర్లకు నోటిఫికేషన్ వెళ్తుంది. అయితే ప్రొఫైల్‌ని చూసేందుకు ట్యాప్ చేస్తేనే ఇది పనిచేస్తుంది తప్ప సెర్చ్ చేస్తే కాదు. యూజర్లు ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి తమ ఫోన్ నెంబర్ కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం "కాంటాక్ట్ రిక్వెస్ట్" పంపాల్సి ఉంటుంది. ప్రొ సబ్‌స్క్రైబర్లకు ప్రైవేట్ మోడ్‌ కూడా ఉంటుంది. ప్రైవేట్ మోడ్‌ ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ మోడ్‌లో ఉన్నప్పుడు ప్రో సబ్‌స్క్రైబర్ మరో ప్రొఫైల్ చూస్తే ఆ నోటిఫికేషన్ మరో యూజర్‌కు వెళ్లదు. ఇలాంటి మరిన్ని కొత్త
ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది ట్రూకాలర్.

First published: June 22, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading