ట్రూ కాలర్‌లో కాల్ రికార్డింగ్!

ట్రూకాలర్ యాప్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. "ప్రీమియం" సబ్‌స్క్రిప్షన్ లేని యూజర్లు 14 రోజుల ఫ్రీ ట్రయల్ ఉపయోగించుకోవచ్చు.

news18-telugu
Updated: July 17, 2018, 10:17 AM IST
ట్రూ కాలర్‌లో కాల్ రికార్డింగ్!
(Image: Truecaller)
  • Share this:
మీ ఫోన్‌లో ట్రూ కాలర్ ఉందా? దాంతోపాటు కాల్ రికార్డింగ్ యాప్ కూడా ఉందా? అయితే ఇప్పుడు ట్రూ కాలర్ ఉంటే కాల్ రికార్డింగ్ యాప్‌తో పనిలేదు. ఎందుకంటే ట్రూకాలర్ యాప్‌లోనే కాల్ రికార్డింగ్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్‌ను రిలీజ్ చేసింది ట్రూకాలర్. కమ్యూనికేషన్‌ను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు, వేధింపులు, మోసాలను తగ్గించేందుకు అందిస్తున్న ప్రీమియం సర్వీస్‌గా కంపెనీ చెబుతోంది.

"ప్రీమియం" యూజర్లు కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ట్రూకాలర్ ఐడీ స్క్రీన్‌పై 'ఆన్' బటన్ ప్రెస్ చేసి కాల్ రికార్డ్ చేయొచ్చు. "ప్రీమియం" సబ్‌స్క్రిప్షన్ లేని యూజర్లు 14 రోజుల ఫ్రీ ట్రయల్‌ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా స్నేహితులు, సహోద్యోగులు, వ్యాపారుల మధ్య జరిగే ముఖ్యమైన సంభాషణల్ని రికార్డ్ చేసుకోవచ్చు. అయితే ఈ కాల్ రికార్డింగ్స్ అన్నీ ఫోన్‌లో సేవ్ అవుతాయి తప్ప కంపెనీ సిస్టమ్‌లో ఉండవంటోంది ట్రూకాలర్.

అయితే ఈరోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్స్‌ కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. అంతేకాదు ప్లేస్టోర్‌లో థర్డ్ పార్టీ యాప్స్ చాలానే ఉన్నాయి. ఫోన్‌లో ఆ ఫీచర్ లేకపోతే ట్రూకాలర్ యూజర్లు కాల్ రికార్డింగ్ ఆప్షన్ వాడుకోవచ్చు. ప్రస్తుతం ట్రూకాలర్ నెలకు రూ.30, ఏడాదికి రూ.270 సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేస్తోంది.

First published: July 17, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading