Truecaller: ట్రూకాలర్ వాడుతున్నారా? డేటా లీకైంది జాగ్రత్త

Truecaller Data Leak | లీకైన డేటాలో 60-70 శాతం భారతీయులది కావచ్చని అనుమానం. ఎందుకంటే ట్రూకాలర్ యూజర్లలో 60-70 శాతం అంటే 14 కోట్ల మంది ఇండియన్ యూజర్లే.

news18-telugu
Updated: May 22, 2019, 6:08 PM IST
Truecaller: ట్రూకాలర్ వాడుతున్నారా? డేటా లీకైంది జాగ్రత్త
Truecaller: ట్రూకాలర్ వాడుతున్నారా? డేటా లీకైంది జాగ్రత్త (Image: Truecaller)
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ట్రూకాలర్ యూజర్ల డేటా లీకైంది. జస్ట్ రూ.1.5 లక్షలు చెల్లిస్తే చాలు కోట్లాదిమంది ట్రూకాలర్ యూజర్ల డేటా డార్క్ వెబ్‌లో దొరుకుతోంది. ట్రూకాలర్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ అడ్రస్, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్... ఇలా మొత్తం డేటా ఎవరైనా పొందొచ్చు. ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే లీకైన డేటాలో 60-70 శాతం భారతీయులది కావచ్చని అనుమానం. ఎందుకంటే ట్రూకాలర్ యూజర్లలో 60-70 శాతం అంటే 14 కోట్ల మంది ఇండియన్ యూజర్లే. ఇండియన్ యూజర్ల డేటాకు రూ.1,55,000, గ్లోబల్ యూజర్ల డేటాకు రూ.20,00,000 చెల్లించి డార్క్ వెబ్‌లో కొనొచ్చు.

Read this: SSC MTS Jobs: 10,000 పోస్టులు... ఇప్పటికే 25 లక్షల దరఖాస్తులు... మే 29 చివరి తేదీ

కోట్లాది మంది యూజర్ల డేటా లీక్ వ్యవహారంపై ట్రూకాలర్ స్పందించింది. ట్రూకాలర్ యూజర్ల డేటా లీక్‌ కాలేదని ఖండించింది. కొందరు యూజర్లు తమ అకౌంట్లను దుర్వినియోగం చేస్తున్నారని ట్రూకాలర్ వాదన. డేటా లీక్ వ్యవహారం సంచలనం రేపుతుండటంతో క్షుణ్ణంగా విచారణ జరిపామని, డేటా లీక్‌కు సంబంధించిన ఆధారాలు లభించలేదని ట్రూకాలర్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. శాంపిల్ డేటా ట్రూకాలర్ డేటాతో మ్యాచ్ కాలేదని వెల్లడించారు. యూజర్ల డేటా తమ సర్వర్లలో సురక్షితంగా ఉందని, యూజర్ల ప్రైవసీకి ముప్పు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రూకాలర్ వాదన ఇలా ఉంటే, భారీస్థాయిలో డేటా లీకైందని నమ్ముతున్నారు సైబర్ నిపుణులు.

Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Redmi K20: షావోమీ నుంచి మరో ఫోన్... మే 28న రెడ్‌మీ కే20 రిలీజ్Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...

IRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ
First published: May 22, 2019, 5:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading