Truecaller: ట్రూకాలర్ వాడుతున్నారా? జాగ్రత్త... మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తున్న యాప్

Truecaller 'UPI Scam' | ట్రూకాలర్‌లో యూజర్ల ప్రమేయం లేకుండా యూపీఐ అకౌంట్లు క్రియేట్ కాగానే ఐసీఐసీఐ నుంచి మెసేజ్ వచ్చింది.

news18-telugu
Updated: July 31, 2019, 11:22 AM IST
Truecaller: ట్రూకాలర్ వాడుతున్నారా? జాగ్రత్త... మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తున్న యాప్
Truecaller: ట్రూకాలర్ వాడుతున్నారా? జాగ్రత్త... మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తున్న యాప్
news18-telugu
Updated: July 31, 2019, 11:22 AM IST
ట్రూకాలర్ యూజర్లకు అలర్ట్. ట్రూకాలర్ యాప్‌లో మీకు తెలియకుండా, అసలు మీ ప్రమేయం లేకుండా యూపీఐ అకౌంట్ క్రియేట్ అయిందేమో చూడండి. ట్రూకాలర్ యూజర్లు చాలామంది ఇదే కంప్లైంట్ చేస్తున్నారు. దీన్ని 'యూపీఐ స్కామ్' అని పేరు కూడా పెట్టారు. తమ ప్రమేయం లేకుండా ఐసీఐసీఐ బ్యాంక్ యూపీఐ అకౌంట్లు ఆటోమెటిక్‌గా క్రియేట్ అయ్యాయని ఆండ్రాయిడ్ యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. ఇటీవల ట్రూకాలర్ యాప్ 10.41.6 వర్షన్ అప్‌డేట్ చేసినవాళ్లకు ఇలా యూపీఐ అకౌంట్లు క్రియేట్ అయ్యాయని తెలుస్తోంది. ట్రూకాలర్‌లో యూజర్ల ప్రమేయం లేకుండా యూపీఐ అకౌంట్లు క్రియేట్ కాగానే ఐసీఐసీఐ నుంచి మెసేజ్ వచ్చింది. కొందరికి యూపీఐ అకౌంట్ డీయాక్టివేట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. అసలు తమకు యూపీఐ అకౌంటే లేనప్పుడు డీయాక్టివేట్ ఎలా అవుతుందన్న అనుమానాలు యూజర్లలో మొదలయ్యాయి. ఫోన్‌లో ఇన్‌బాక్స్ చూస్తే ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్ కనిపించాయి. దీంతో యూజర్లు షాకయ్యారు. 'యూపీఐ స్కామ్' అంటూ సోషల్ మీడియా వేదికగా కంప్లైంట్ చేశారు.

ట్రూకాలర్ 'యూపీఐ స్కామ్'పై ఓ యూజర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేశాడు. దీంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI దర్యాప్తు మొదలుపెట్టింది. మరోవైపు ట్రూకాలర్ కూడా స్పందించింది. ఆటోమెటిక్‌గా యూపీఐ అకౌంట్లు క్రియేట్ కావడానికి కారణమైన 10.41.6 వర్షన్‌ను తొలగించింది. ఓ బగ్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని, క్షమించాలని యూజర్లను కోరింది. ప్రస్తుతం ప్లే స్టోర్‌లో పాత వర్షన్ 10.40.7 కనిపిస్తోంది. ఇప్పటికే యాప్ అప్‌డేట్ చేసినవారికి కొత్త వర్షన్ రిలీజ్ చేయనుంది. ట్రూకాలర్‌కు ఇండియాలో 10 కోట్లకు పైగా యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. 2017లో ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి యూపీఐ బేస్డ్ మొబైల్ పేమెంట్ సర్వీస్ ప్రారంభించింది ట్రూకాలర్.

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

IRCTC: ఐఆర్‌సీటీసీ ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్... టికెట్ ధర ఎలా పెరుగుతుందో తెలుసా?

Jio Saarthi: సరికొత్త సేవలు అందించనున్న రిలయెన్స్ జియో డిజిటల్ అసిస్టెంట్
Loading...
SBI: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్... రిజిస్టర్ చేసుకోవడానికి స్టెప్స్ ఇవే...
First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...