హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

2023 Bonneville T100: ట్రయంఫ్ లగ్జరీ బైక్ లాంఛ్.. ధర, ఫీచర్స్ చూస్తే కొనేస్తారంతే !

2023 Bonneville T100: ట్రయంఫ్ లగ్జరీ బైక్ లాంఛ్.. ధర, ఫీచర్స్ చూస్తే కొనేస్తారంతే !

 ట్రయంఫ్ లగ్జరీ బైక్ లాంఛ్.. ధర, ఫీచర్స్ చూస్తే కొనేస్తారంతే !

ట్రయంఫ్ లగ్జరీ బైక్ లాంఛ్.. ధర, ఫీచర్స్ చూస్తే కొనేస్తారంతే !

ట్రయంఫ్( Triumph) మోటార్‌సైకిల్స్ ఇండియా సరికొత్త 2023 బోనేవిల్‌ T100 (2023 Bonneville T100) బైక్‌ను లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.9.59 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది.

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా (Triumph Motorcycles India) తయారు చేస్తున్న బోనేవిల్‌ క్రూయిజర్ బైక్స్ సూపర్ పాపులర్ అయ్యాయి. ధరకు తగిన ఫీచర్లను అందించడంతో పాటు బెస్ట్ రైడ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేయడంలో ఈ ప్రీమియం బైక్స్(Bikes) ముందుంటాయి. అయితే తాజాగా కంపెనీ ఇండియాలో సరికొత్త 2023 బోనేవిల్‌ T100 (2023 Bonneville T100) బైక్‌ను లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.9.59 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. జెట్ బ్లాక్, ఫ్యూజన్ వైట్‌తో కార్నివాల్ రెడ్, ఫ్యూజన్ వైట్‌తో లూసర్న్ బ్లూ, టాన్జేరిన్‌తో మెరిడియన్ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్స్‌లో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. మెరిడియన్ బ్లూ విత్ టాన్జేరిన్‌ కలర్ అనేది కొత్తగా యాడ్ చేశారు. ఈ మోడల్ కాస్మెటిక్, మెకానికల్ ఫీచర్స్(Features) ఇంతకుముందు బైక్స్‌లో లాగానే ఉన్నాయి. ఇందులో మెరిడెన్ బ్లూ సైడ్ ప్యానెల్‌లు, మడ్‌గార్డ్‌లను అందించారు.

2023 Bonneville T100 బైక్ ధరలు.

2023 బోనేవిల్‌ T100 జెట్ బ్లాక్ ధర రూ.9.59 లక్షలు, కార్నివాల్ రెడ్ విత్ ఫ్యూజన్ వైట్ ధర రూ.9.89 లక్షలు, ఫ్యూజన్ వైట్‌తో లూసర్న్ బ్లూ ధర రూ. 9.89 లక్షలు, మెరిడియన్ బ్లూ విత్ టాన్జేరిన్ ధర రూ. 9.89 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

ఇదీ చదవండి: Infinix Hot 12 Pro: భారీ డిస్‌ప్లేతో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ ఫోన్ లాంఛ్.. ధర, ఫీచర్స్ చూస్తే అదుర్స్ అంటారు



2023 Bonneville T100 బైక్ ఫీచర్లు

2023 ట్రయంఫ్ బోనేవిల్‌ T100 క్రోమ్ గార్నిష్‌తో సర్కులర్ షేప్డ్ హెడ్‌ల్యాంప్‌ను ఆఫర్ చేశారు. ఇందులోని ఫ్యూయల్ ట్యాంక్‌ 14.5 లీటర్ సామర్థ్యంతో వస్తుంది. ఈ ట్యాంక్ ఇరువైపులా రబ్బరు పాడ్స్ అందించారు. చేతితో పెయింట్ చేసిన సిల్వర్ కోచ్ లైన్ డీటెయిల్స్ టియర్ డ్రాప్ ఆకారం (Tear-drop-shape)లో కనిపిస్తాయి. ప్రత్యేకంగా కొత్త మెరిడియన్ బ్లూ షేడ్ లో ఈ డీటెయిల్స్ అద్భుతంగా కనిపిస్తాయి. వైర్-స్పోక్ వీల్స్‌తో వచ్చే ఈ బైక్‌ను పైప్ స్టీల్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. వైడ్ హ్యాండిల్ బార్, సింగిల్-పీస్ ఫ్లాట్ సీట్, డ్యూయల్ పీషూటర్ ఎగ్జాస్ట్ పైపులు, భారీ బ్యాక్ ఫెండర్ వంటివి ఈ బైక్ లోని చెప్పుకోదగిన డిజైన్ ఫీచర్లు.

2023 ట్రయంఫ్ బోనేవిల్‌ T100లో సెమీ-డిజిటల్ డ్యూయల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యుయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్‌ను స్టాండర్డ్‌ వెర్షన్‌లోనే ఆఫర్ చేశారు. ఇంకా ముందు.. వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లను అందించారు. సస్పెన్షన్ డ్యూటీలుగా 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లను ముందుగా అందించగా, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అమర్చారు. మెకానికల్ పరంగా చూస్తే, ఈ బైక్ 7400 rpm వద్ద 64.1 bhp గరిష్ట శక్తిని, 3750 rpm వద్ద 80 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే BS6-కంప్లైంట్ 900cc ప్యార్లల్‌-ట్విన్ పెట్రోల్ ఇంజన్‌తో శక్తిని పొందుతుంది. ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

First published:

Tags: Luxury, New bikes, Petrol, Price

ఉత్తమ కథలు