ట్రాయ్ న్యూ రూల్స్ ఎఫెక్ట్... కేబుల్ టీవీ ధరలను విమర్శిస్తూ టాటా స్కై కొత్త ప్రకటన...

కేబుల్ ఆపరేటర్ల పాలిట శాపంగా మారుతున్న ట్రాయ్ రూల్స్... తాజాగా కేబుల్ టీవీ యూజర్లను ఎద్దేవా చేస్తూ ప్రకటన విడుదల చేసిన టాటా స్కై... కేబుల్ టీవీల కంటే DTH ఆపరేటర్లవైపే మొగ్గు చూపుతున్న ప్రేక్షకులు... క్రమేణా తగ్గిపోతున్న కేబుల్ టీవీ వాడకందారులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 19, 2019, 8:26 PM IST
ట్రాయ్ న్యూ రూల్స్ ఎఫెక్ట్... కేబుల్ టీవీ ధరలను విమర్శిస్తూ టాటా స్కై కొత్త ప్రకటన...
ట్రాయ్ న్యూరూల్స్ కారణంగా టీవీ చూసేవారి సంఖ్య కూడా క్రమంగా పడిపోతోంది.
  • Share this:
DTH బెటర్ ఆ... Cable TV బెటర్ ఆ... ఇప్పుడు అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న ఇది. ట్రాయ్ (టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త నిబంధనల కారణంగా సామాన్యులు గందరగోళానికి గురవుతున్నారు. రూ. 130 చెల్లిస్తే 100 ఫ్రీ ఛానెల్స్ వస్తాయని... మిగిలిన పే ఛానెల్స్ కావాలంటే ఏ ఏ ఛానెల్స్ చూడాలనుకుంటున్నారో వాటిని ఎంచుకుని, వాటికి ఫిక్స్ చేసిన ఖరీదు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలు కూడా విడుదల చేశారు. జీ నెట్‌వర్క్, స్టార్ నెట్‌‌వర్క్, సన్ నెట్‌వర్క్ ఇలా... ఏ ఛానెల్స్‌కు సంబంధించి వాళ్లు తమ ఛానెల్స్ చూడాలంటే ఎంత చెల్లించాల్సి ఉంటుందో చెబుతూ ప్రకటనలు విడుదల చేశాయి. అయితే ఇప్పుడు కేబుల్ టీవీ ఆపరేటర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా డీటీహెచ్ సర్వీస్ ఆపరేటర్ టాటా స్కై ప్రకటన రూపొందించింది. ఇంతకుముందు చూసే ఛానెళ్లన్నీ చూడలేకపోతున్నాను... అంటూ ప్రకటనలో కస్టమర్‌ని చూపిస్తూ... కేబుల్ టీవీ ఆపరేటర్లకు బంధువులైతే కేబుల్ టీవీలో అధిక ధరలు చెల్లిస్తూ కొనసాగండి... అంటూ విడుదలైన తాజా ప్రకటన దుమారం రేపుతోంది. తమ ప్రోడక్ట్‌ను ప్రమోట్ చేసుకోవడం వరకూ ఓకే కానీ కేబుల్ ఆపరేటర్లను ఇలా చులకన చేసి చూపించడం భావ్యం కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trai new rules, trai new rules for recharge, trai new rules channels price list, trai new rules for cable operator, tata sky advertisement on trai rules, tata sky vs Cable operators, DTH or Cable Network, Cable tv, chennels new tariffs, gemini tv pack, etv pack, maa tv pack, star tv packs, telugu channels pack details, Telugu packs in hathway zee telugu, maa tv, Hathway Recharge, dish tv dth plans 2019 telangana andhra pradesh, hathway customer care, hathway setup box, hathway broadband plans list, TRAI rules, Trai latest news, hathway dth plans, Airtel digital tv recharge, tatasky recharge plans, videocon dth plans, Flipkart TV sales, Sun Direct dth recharge plans, hathway cable best plan, ట్రాయ్ కొత్త రూల్స్, కేబుల్ టీవీ ఛానెల్స్ ధరల లిస్ట్, హాత్ వే రిచార్జ్, కేబుల్ టీవీ రిఛార్జ్, డీటీహెచ్ ప్లాన్స్, కేబుల్ టీవీ ప్లాన్స్, హాత్‌వే ప్లాన్స్ ఏది బెస్ట్, తెలుగు ఛానెల్స్ ప్యాక్, ఎయిర్ టెల్ టీవీ రిచార్జ్ ప్లాన్స్, టాటా స్కై రీచార్జ్ ప్లాన్స్, సన్ డైరెక్ట్ రిచార్జ్ ప్లాన్స్, కేబుల్ ఆపరేటర్స్, తెలుగు ప్యాక్ హాత్ వే, టాటా స్కై కొత్త ప్రకటన,జీ తెలుగు, మా టివి, ఈ టివి, జెమినీ టివి, తెలుగు సీరియల్స్, అగ్నిసాక్షి సీరియల్, మౌనరాగం సీరియల్, రంగస్థలం, జబర్దస్త్ ఈటీవీ, కథలో రాజకుమారి, కోయిలమ్మ, కేబుల్ టీవీ, సన్ డైరెక్ట్ ఆన్‌లైన్ పేమెంట్,
టాటా స్కై కిడ్స్ ప్యాక్


నిజానికి ఇన్ని రోజులు ప్రశాంతంగా టీవీ చూసిన ప్రేక్షకులు... ఇప్పుడు ట్రాయ్ కొత్త రూల్స్ అర్థంకాక నచ్చిన ఛానెల్స్ చూడాలంటే ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ట్రాయ్ విడుదల చేసిన ప్రకటనల్లో చెప్పినట్టుగానే రూ. 130 చెల్లిస్తే 100 ఫ్రీ ఛానెల్స్ చూడొచ్చు. అయితే ఈ మొత్తం GST లేకుండా... 18 శాతం జీఎస్టీ కలుపుకుని రూ.153.40 చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా అదనంగా తీసుకునే ఒక్కో ఛానెల్‌కు ఆ ఛానెల్ ధరతో పాటు మరో రూ.20 లు ప్యాక్ వాల్యూ కింద చెల్లించాలి.
ఉదాహరణకు...
కేబుల్ టీవీ ప్యాక్స్ ఇలా...
వంద ఉచిత ఛానెల్స్‌కు రూ. 130 + జెమినీ టీవీ ఒక్క ఛానెల్ చూడాలంటే దాని ఖరీదు రూ.19+ రూ.20 ప్యాక్ ఖరీదు... మొత్తం రూ.169+ 30.42 (18 శాతం GST)... మొత్తం 101 ఛానెల్స్‌కే చెల్లించాల్సిన మొత్తం రూ. 199.42
ఇందులో ప్యాక్ ఖరీదు రూ.20లు 25 ఛానెల్స్‌కు వరకూ వర్తిస్తుంది. 25 దాటి ఒక్క పే ఛానెల్ ఎక్కువ తీసుకున్నా మరో రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఇప్పుడు కేబుల్ టీవీలో ముఖ్యంగా హాత్‌వేలో ఇంతకు ముందు రూ.200 లేదా రూ.250లకు చూసిన ఛానెల్స్ అన్నీ కావాలంటే దాదాపు రూ. 1100 చెల్లించాల్సి ఉంటుంది.ఇందులో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌తో పాటు కొన్ని హిందీ ఛానెల్స్ చూడాలనుకుంటే రూ.310 ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందుతో పోలిస్తే 75 శాతం ఛానెల్స్ తక్కువ, ఖర్చు విషయంలో మాత్రం ఇది రూ.60 ఎక్కువ. దీనికి కేబుల్ టీవీ ఆపరేటర్లు చెప్పే సమాధానం కూడా భిన్నంగా ఉంది. ఇంతకు ముందు జెమినీ, మా, జీ టీవీ వంటి పే ఛానెల్స్‌కు ఒక్కొంటికీ కేవలం రూ.4 చెల్లంచేవాళ్లమని, ఇప్పుడు వాళ్లు రూ.17 నుంచి రూ.19 దాకా వసూలు చేస్తూ ధరలు భారీగా పెంచేశారని వాపోతున్నారు.
DTH or Cable Network, Which is Best choice to view Television Channels in Telugu States DTH, Cable TV వీటిలో ఏది బెస్ట్... ప్రస్తుత పరిస్థితుల్లో ఏది తీసుకుంటే బెటర్... DTH or Cable Network, Cable tv, chennels new tariffs, Hathway Recharge, dish tv dth plans 2019 telangana andhra pradesh, hathway customer care, hathway setup box, hathway broadband plans list, TRAI rules, Trai latest news, hathway dth plans, Airtel digital tv recharge, tatasky recharge plans, videocon dth plans, Sun Direct dth recharge plans, hathway cable best plan, హాత్ వే రిచార్జ్, కేబుల్ టీవీ రిఛార్జ్, డీటీహెచ్ ప్లాన్స్, కేబుల్ టీవీ ప్లాన్స్, హాత్‌వే ప్లాన్స్ ఏది బెస్ట్, తెలుగు ఛానెల్స్ ప్యాక్, ఎయిర్ టెల్ టీవీ రిచార్జ్ ప్లాన్స్, టాటా స్కై రీచార్జ్ ప్లాన్స్, సన్ డైరెక్ట్ రిచార్జ్ ప్లాన్స్,
టీవీ వీక్షణం...

కేబుల్ టీవీతో పోలిస్తే DTH సర్వీసులే కొంచెం బెటర్ ఆప్షన్.
Sun Direct: Telugu DPO Pack రూ.179.66 + 18 శాతం GST కలుపుకుని మొత్తం రూ. 211.33 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 191 ఛానెల్స్ చూసే సదుపాయం కల్పిస్తోంది సన్ డైరెక్ట్. Telugu DPO Pack2 కింద రూ. 230.5 + 18 శాతం GST కలుపుకుని మొత్తం రూ. 271.99 చెల్లిస్తే 210 ఛానెల్స్ చూడొచ్చు. కేబుల్ టీవీతో పోలిస్తే ఇందులో ఛానెల్స్ సంఖ్య ఎక్కువ, ఖర్చు తక్కువ.
Dish Tv: Classic Joy పేరుతో ఉన్న ప్యాక్‌లో 199 ఛానెల్స్‌ను రూ.180 లకే అందిస్తోంది డిష్ టీవీ. దీనికి 18 శాతం GST ఎక్స్‌ట్రా. అలాగే Classic Joy+ Telugu ప్యాక్ కింద 216 ఛానెల్స్ చూసేందుకు రూ. 243+ 18 శాతం ట్యాక్స్ కలిపి రూ.286.74 చెల్లించాల్సి ఉంటుంది.
TATA SKy: మిగిలిన వాటితో పోలిస్తే టాటాస్కై భిన్నమైన ప్యాక్స్‌ అందిస్తోంది. ఇందులో ఫ్రీ ఛానెల్స్ కాకుండా 20 తెలుగు ఛానెల్స్‌ కోసం రూ.136 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Airtel TV: ఎయిర్ టెల్ టీవీ ప్యాక్స్ రూ.240 (+18 శాతం GST) నుంచి రూ. 700 దాకా ఉన్నాయి. రూ.240 ప్యాక్‌లోనే 247 ఛానెల్స్ చూసే అవకాశం కల్పిస్తోంది ఎయిర్ టెల్.
అయితే ఇంతకుముందు కేబుల్ టీవీ బిల్లు నెల మొత్తం వాడుకున్న తర్వాత కట్టేవాళ్ళు. కాస్త ఆలస్యంగా పే చేసినా పెద్దగా ఎఫెక్ట్ ఉండేది కాదు. అయితే తాజాగా పరిస్థితి మారింది. ముఖ్యంగా ఈ నెల కేబుల్ టీవీ చూడాలంటే గత నెల వాడుకున్నందుకు జనవరి నెల బిల్లుతో పాటు ఈ నెల వాడుకోబోయే దానికి కూడా ముందుగానే చెల్లించాలంటూ చెబుతున్నారు ఆపరేటర్లు. ఇది సామాన్య ప్రజలకు భారంగా మారింది. ట్రాయ్ న్యూరూల్స్ కారణంగా టీవీ చూసేవారి సంఖ్య కూడా క్రమంగా పడిపోతోంది. మొబైల్‌లో యాప్స్ ద్వారా నచ్చిన ప్రోగ్రామ్ చూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇవన్నీ కేబుల్ ఆపరేటర్ల పాలిట శాపంగా మారుతున్నాయి.First published: March 19, 2019, 8:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading