భారతదేశంలో మొబైల్ యూజర్లను స్పామ్ కాల్స్ (Spam Calls) , ఫేక్ కాల్స్( Fake calls) తెగ విసిగిస్తున్నాయి. లోన్స్ తీసుకోవాలని లేదా ఇంకా ఏదైనా సర్వీస్ పొందాలని కోరుతూ వచ్చే ఈ స్పామ్ కాల్స్ వల్ల మొబైల్ యూజర్లు (Mobile users) చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) దృష్టి సారించింది. మొబైల్ యూజర్లు స్పామ్ కాల్స్ గుర్తించేందుకు వీలుగా ఒక కొత్త కాలర్ ఐడీ (Caller ID) ఫీచర్ తీసుకురావాలని ట్రాయ్ ప్లాన్ చేస్తోంది. ఈ ఫీచర్ సాయంతో నంబర్‌తో పాటు కాలర్ పేరును సర్వీస్ ప్రొవైడర్లు (Service providers) తమ యూజర్లకు డిస్‌ప్లే (Display) చేస్తాయి. తద్వారా యూజర్లు కమర్షియల్ స్పామ్ కాల్స్‌ను సులభంగా గుర్తించి, సింపుల్‌గా కట్ చేసే అవకాశం ఉంటుంది.
కమర్షియల్ కాల్స్ లక్ష్యంగా..
ఓ ట్రాయ్ అధికారి (TRAI Officers) ప్రకారం, స్పామ్ కాలర్ పేరు అనేది ఆ కాలర్ టెలికాం ఆపరేటర్‌తో షేర్ చేసిన నో యువర్ కస్టమర్ (KYC) వివరాల ప్రకారం డిస్‌ప్లే అవుతుంది. స్పామ్ కాల్స్ చేసే కంపెనీలతో సహా అందరూ కేవైసీ డీటెయిల్స్‌ను టెలికాం ఆపరేటర్‌కు తప్పకుండా అందించాల్సి ఉంటుంది. వాటినే యూజర్లకు కాలర్ ఐడీ స్క్రీన్‌లో టెలికాం ఆపరేటర్లు చూపిస్తాయి. అనవసరమైన కమర్షియల్ కాల్స్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ట్రాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. స్పామ్ కాల్స్‌ను గుర్తించే సిస్టమ్ లేదా ఫీచర్‌ను అభివృద్ధి చేయడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో ట్రాయ్ చర్చలు జరుపుతోందని తెలిపారు.
ట్రూ కాలర్ బంద్ చేసుకోవాల్సిందే..!
ట్రాయ్ కాలర్ ఐడీ ఫీచర్‌ను సమ్మతి-ఆధారిత (Consent-based), స్వచ్ఛంద ప్రోగ్రామ్(Voluntary Program)గా ప్లాన్ చేస్తోంది. దీనిలో టెలికాం సబ్‌స్క్రైబర్లు లేదా కస్టమర్లు తమ పేర్లను డిస్‌ప్లే చేయాలా వద్దా అనే ఆప్షన్స్ పొందుతారని ట్రాయ్ అధికారి పేర్కొన్నారు. అయితే ఇలా ఆప్షన్లు తీసుకొస్తే స్పామ్ కాలర్లు తమ నేమ్స్ డిస్‌ప్లే కాకూడదని ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ కాలర్ ఐడీ ఫీచర్‌కు అర్థం ఉండదు. ట్రాయ్ ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త కాలర్ ఐడీ ఫీచర్‌ను పర్ఫెక్ట్‌గా రిలీజ్ చేయవచ్చు. ఈ ఫీచర్ సరిగ్గా పనిచేస్తే ట్రూకాలర్ తన సర్వీసెస్ బంద్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ట్రాయ్ కాలర్ ఐడీ ఫీచర్ ట్రూ కాలర్ అందించే ఫీచర్‌కి సమానంగా ఉంటుంది.
కమ్యూనిటీ-బేస్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ చేసిన సర్వేలో 9,623 మొబైల్ యూజర్లు పాల్గొనగా వారిలో 64 శాతం మంది తమకు డైలీ కనీసం మూడు స్పామ్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. సర్వేలో పాల్గొన్న 9,533 మంది పార్టిసిపెంట్లు అంటే 95 శాతం మంది డోంట్ డిస్టర్బ్ సర్వీస్ యాక్టివేట్ చేసుకున్నామని తెలిపారు. అయినా కూడా తమకు స్పామ్ కాల్స్ వస్తున్నట్లు వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సర్వే పార్టిసిపెంట్లలో చాలామంది తమకు వచ్చిన స్పామ్ కాల్‌లలో 51 శాతం తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత, వ్యాపార లేదా గృహ రుణాల వంటి ఆర్థిక సేవలను అందిస్తామని చెప్పినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ ఆఫర్లు, ల్యాండ్ లేదా ఇల్లు కొనుక్కోవాలని పిలుపునిచ్చే కాల్స్ మొత్తం స్పామ్ కాల్‌లలో 29 శాతం ఉన్నాయి.
స్పామ్ కాల్స్‌ను ఎలా హ్యాండిల్ చేశారని 9,084 మంది పార్టిసిపెంట్లను లోకల్ సర్కిల్స్ ప్లాట్‌ఫామ్ ప్రశ్నించగా.. పద్నాలుగు శాతం మంది వారు ట్రూకాలర్ వంటి కాలర్ ఐడెంటిఫికేషన్/బ్లాకింగ్ మొబైల్ అప్లికేషన్‌ని ఉపయోగిస్తున్నామని చెప్పారు. మరే 14% మంది తెలిసిన నంబర్లు లేదా కాంటాక్ట్‌ల నుంచి మాత్రమే కాల్‌లకు సమాధానం ఇస్తున్నామని చెప్పారు. 42% పార్టిసిపెంట్లు మాత్రం కాల్‌లకు సమాధానం ఇచ్చామని, ఆపై నంబర్‌లను బ్లాక్ చేశామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FAKE APPS, Phone calls, TRAI, True caller