TRAI GOOD NEWS USERS CAN SWITCH SERVICE PROVIDERS OR OPERATORS WITHOUT CHANGING SET TOP BOX BY THE END OF THIS YEAR SS
TRAI Good news: సెటాప్ బాక్స్ మార్చకుండా మరో ఆపరేటర్‌కు మారొచ్చు
TRAI Good news: సెటాప్ బాక్స్ మార్చకుండా మరో ఆపరేటర్‌కు మారొచ్చు
TRAI Good news | ఒక డీటీహెచ్ వాడుతూ మరో డీటీహెచ్లోకి మారాలంటే కొత్త బాక్సు కొనాల్సిందే. దీంతో వినియోగదారులకు ఆపరేటర్‌ను మార్చాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
టీవీ ప్రేక్షకులకు శుభవార్త. మీరు కేబుల్ లేదా డీటీహెచ్ కనెక్షన్ మార్చాలంటే సెట్-టాప్ బాక్స్ (STB) మార్చాల్సిన అవసరం లేదు. అంటే మొబైల్ నెంబర్ పోర్టబులిటీలో మీరు ఫోన్ నెంబర్ మార్చకుండా కొత్త నెట్‌వర్క్‌కు ఎలా మారతారో, మీ దగ్గరున్న సెటాప్ బాక్స్ మార్చకుండా కొత్త ఆపరేటర్‌కు మారొచ్చు. ఉదాహరణకు ఒకే ఏరియాలో ముగ్గురు కేబుల్ ఆపరేటర్లు సేవలు అందిస్తున్నారనుకోండి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మీరు ఒక ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్‌కు మారితే కొత్త ఆపరేటర్ దగ్గర మళ్లీ సెటాప్ బాక్స్ కొనాలి. డీటీహెచ్‌కు కూడా ఇదే విధానం ఉంది. ఒక డీటీహెచ్ వాడుతూ మరో డీటీహెచ్లోకి మారాలంటే కొత్త బాక్సు కొనాల్సిందే. దీంతో వినియోగదారులకు ఆపరేటర్‌ను మార్చాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి సెటాప్ బాక్స్ మార్చకుండా ఆపరేటర్‌ను మార్చే అవకాశం అందుబాటులోకి రానుందని ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు.
గత రెండేళ్లుగా సెటాప్ బాక్స్ పరస్పర మార్పిడి విధానంపై కసరత్తు చేస్తున్నాం. ఇందులో ఎదురైన సవాళ్లను అధిగమించాం. కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వాటిని పరిష్కరిస్తాం.
— ఆర్ఎస్ శర్మ, ట్రాయ్ ఛైర్మన్
భారతదేశంలో మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ ఇంత విజయవంతం కావడానికి ఓపెన్ ఇకో సిస్టమ్ కారణమని ఆర్ఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. మొబైల్ నెట్వర్క్, యాప్స్, స్మార్ట్ఫోన్లకు ఇది వర్తిస్తుందన్నారు. తనకు నచ్చిన సేవల్ని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు కల్పించడమే ట్రాయ్ ఉద్దేశం. ట్రాయ్ కొత్త విధానం అమలులోకి వస్తే ఇక మీరు సెటాప్ బాక్స్ మార్చాల్సిన అవసరం లేకుండా ఆపరేటర్‌ను మార్చుకోవచ్చు. ఈ సేవలు పొందాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగాలి. Photos: సముద్రంలో రెస్టారెంట్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.