మీరు కేబుల్ టీవీ కనెక్షన్ తీసుకున్నారా? డీటీహెచ్ వాడుతున్నారా? మీరు కేబుల్, డీటీహెచ్ బిల్లుల్ని తగ్గించుకోవచ్చు. ఇందుకోసం టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI కొత్తగా ఓ యాప్ లాంఛ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. మీరు మీ కేబుల్ టీవీ లేదా డీటీహెచ్‌లో చూడాలనుకుంటున్న ఛానెళ్లు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఎంత బిల్ అవుతుందో సులువుగా తెలుసుకోవచ్చు. టాటాస్కై, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డిష్‌టీవీ, డీ2హెచ్, హాత్వే డిజిటల్, సిటీ నెట్వర్క్, ఏషియానెట్, ఇన్‌డిజిటల్ లాంటి డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఎంఎస్ఓలకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ట్రాయ్ ఛానెల్ సెలక్టర్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో, యాపిల్ ఐఫోన్ యూజర్లకు యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.
మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ కేబుల్ లేదా డీటీహెచ్ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేయాలి. మీ సబ్స్క్రిప్షన్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత మీ కేబుల్ టీవీ, డీటీహెచ్ ఛానెల్ ప్యాక్స్‌ను మాడిఫై చేయొచ్చు. ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఛానెళ్ల జాబితాలో మరిన్ని ఛానెల్స్ యాడ్ చేయొచ్చు. గతేడాది ట్రాయ్ కొత్త టారిఫ్ విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏఏ ఛానెళ్లు చూడాలన్న స్వేచ్ఛను సబ్స్క్రైబర్లకు అందించేందుకే కొత్త టారిఫ్ విధానం ప్రవేశపెట్టామని ట్రాయ్ వివరణ ఇచ్చినా పలు విమర్శలు వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Business, BUSINESS NEWS, DTH, Ios, Mobile App, Playstore, TRAI