ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు ట్రాయ్ షాక్... ఈ ప్లాన్స్ రద్దు

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు ట్రాయ్ షాక్... ఈ ప్లాన్స్ రద్దు (ప్రతీకాత్మక చిత్రం)

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు ట్రాయ్ షాకిచ్చింది. రెండు ప్లాన్స్‌ను రద్దు చేసింది. ఎందుకో తెలుసుకోండి.

 • Share this:
  మీరు ఎయిర్‌టెల్ కస్టమరా? వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ ఉపయోగిస్తున్నారా? ఈ రెండు కంపెనీలకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్రీమియం ప్లాన్స్‌ను ట్రాయ్ రద్దు చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ప్లాటినమ్, వొడాఫోన్ ఐడియాకు చెందిన రెడ్‌ఎక్స్ ప్రీమియం ప్లాన్స్‌ను ట్రాయ్ బ్లాక్ చేసింది. ఈ ప్లాన్స్ తీసుకున్నవారికి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఫాస్టర్ డేటా స్పీడ్, ప్రియార్టీ సర్వీసెస్ అందిస్తున్నాయి. వారికి కస్టమర్ కేర్ సేవలు ప్రత్యేకంగా లభిస్తాయి. అయితే ఈ ప్లాన్స్ వల్ల మొబైల్ క్వాలిటీ సర్వీసెస్ తగ్గుతాయని, ఈ ప్లాన్స్ ఎంచుకోనివారు నష్టపోతారని ట్రాయ్ భావించింది. అందుటే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీమియం ప్లాన్స్‌ను ట్రాయ్ రద్దు చేసింది.

  రైతుల ఖాతాల్లోకి డబ్బులు పంపనున్న కేంద్రం... చెక్ చేయండిలా

  LIC: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు శుభవార్త... ఆన్‌లైన్‌లో క్లెయిమ్ సబ్మిట్ చేయండి ఇలా

  ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు షాక్ ఇచ్చింది. కనీసం ఈ టెలికామ్ కంపెనీలు స్పందించే అవకాశం కూడా ఇవ్వకుండా ట్రాయ్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపర్చింది. ఈ ప్లాన్స్ వల్ల నాణ్యత తగ్గడంతో పాటు, నెట్ న్యూట్రాలిటీ నిబంధనల్ని ఉల్లంఘించే అవకాశం ఉందని ట్రాయ్ భావిస్తోంది. అందుకే ఈ ప్రీమియం ప్లాన్స్‌ని రద్దు చేసింది. ఎయిర్‌టెల్ ఇటీవలే 'ప్రియార్టీ 4జీ నెట్వర్క్' పేరుతో ప్రీమియం సేవల్ని ప్రకటించింది. రూ.499 కన్నా ఎక్కువ పోస్ట్ పెయిడ్ మొబైల్ కస్టమర్లు అందర్నీ ప్లాటినమ్ కస్టమర్లుగా గుర్తించింది. కాల్ సెంటర్లలో రెడ్ కార్పెట్ కస్టమర్ కేర్ సర్వీస్ అందిస్తోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా రెడ్ఎక్స్ పేరుతో ఇలాంటి సేవల్నే అందిస్తోంది.
  Published by:Santhosh Kumar S
  First published: