హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smart Phones: క్రిస్మస్‌ సీజన్‌లో ఫోన్‌లు లాంచ్‌ చేస్తున్న టాప్‌ బ్రాండ్స్‌.. ఆ మోడల్స్‌ ధర, స్సెసిఫికేషన్‌లపై ఓ లుక్కే?

Smart Phones: క్రిస్మస్‌ సీజన్‌లో ఫోన్‌లు లాంచ్‌ చేస్తున్న టాప్‌ బ్రాండ్స్‌.. ఆ మోడల్స్‌ ధర, స్సెసిఫికేషన్‌లపై ఓ లుక్కే?

(image: Samsung India)

(image: Samsung India)

వివిధ సెగ్మెంట్‌లలో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేయడానికి టాప్ బ్రాండ్స్  సిద్ధంగా ఉన్నాయి. శామ్‌సంగ్, రియల్‌మీ, రెడ్‌మీ వంటి బ్రాండ్స్ తమ ప్రొడక్ట్‌లను క్రిస్మక్‌కు లాంచ్‌ చేస్తున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Smart Phones: మరికొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సీజన్(Christmas Season)మొదలుకానుంది. పండగ సమయంలో డిమాండ్‌ను లాభాలుగా మార్చుకోవడంపై వ్యాపార సంస్థలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే వివిధ సెగ్మెంట్‌లలో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు(Smart phones) లాంచ్ చేయడానికి టాప్ బ్రాండ్స్ సిద్ధంగా ఉన్నాయి. శామ్‌సంగ్, రియల్‌మీ, రెడ్‌మీ వంటి బ్రాండ్స్ తమ ప్రొడక్ట్‌లను క్రిస్మక్‌కు లాంచ్‌ చేస్తున్నాయి. త్వరలో లాంచ్ కానున్న రియల్‌మీ 10 ప్రో, ఐక్యూ 11, రెడ్‌మీ నోట్ 12‌ల స్పెసిఫికేషన్‌ల గురించి కొన్ని నివేదికల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Samsung Galaxy M04

శామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చేవారం భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. IANS రిపోర్ట్ ప్రకారం.. గెలాక్సీ M04 ఇన్నోవేటివ్ RAM Plus సపోర్ట్‌తో రావచ్చు. ఈ ఫీచర్‌తో RAMను దాదాపు 8GB వరకు ఎక్స్‌పాండ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు రూ.10,000లోపే ధర ఉండవచ్చు. ఇందులో మీడియా టెక్ ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ ఉంటుందని రిపోర్ట్ పేర్కొంది.

iQoo 11

ఐక్యూ 11 సిరీస్ భారత్‌లో డిసెంబర్ 8న లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో రెండు మోడల్స్ ఐక్యూ 11(iQoo 11), ఐక్యూ 11 ప్రో(iQoo 11 Pro) రిలీజ్ కానున్నాయి. iQOO 11 అనేది లెజెండ్ ఎడిషన్, ఆల్ఫా వంటి రెండు కలర్ ఆప్షన్స్‌లో రానుంది. ఐక్యూ 11 ప్రో ఆల్ఫా, లెజెండ్, మింట్ గ్రీన్ వంటి మూడు కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 ప్రాసెసర్‌ ద్వారా పని చేస్తాయి. iQoo 11 Proలో 4,700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 200W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. iQoo 11లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది.

Realme 10 Pro

రియల్‌మీ 10 ప్రో సిరీస్ భారత్‌లో డిసెంబర్ 8న లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో రియల్‌మీ 10 ప్రో( Realme 10 Pro), రియల్‌మీ 10 ప్రో+(Realme 10 Pro+) పేరుతో రెండు మోడల్స్ రానున్నాయి. రియల్‌మీ 10 ప్రో+ ధర రూ.25,000లోపే ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్ హ్యాండ్ సెట్స్‌లో 108MP మెయిన్ కెమెరా ఉంటుంది. డిస్ ప్లే కర్వ్డ్ షేప్‌లో ఉండవచ్చు. ఈ మోడల్స్ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి. రియల్‌మీ 10 ప్రో సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

Renault India: రెనాల్ట్‌ కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్స్‌పై రూ.50,000 వరకు డిస్కౌంట్‌..

Redmi Note 12

షియోమి కంపెనీ రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌ను ఇప్పటికే చైనాలో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో+ వంటి మూడు మాడల్స్ వచ్చాయి. భారత్‌లో కూడా రెడ్ మీ నోట్ 12 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ముందుగా రెడ్ మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మీడియా టెక్ డైమెన్షిటీ 1080 ప్రాసెసర్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో సోనీ IMX766 సెన్సార్‌తో 50MP కెమెరా ఉంటుంది. షాలో డ్రీమ్ గెలాక్సీ, టైమ్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్‌లో లభించనున్నాయి.

First published:

Tags: Smart phones

ఉత్తమ కథలు