Home /News /technology /

TOP PHONES TO BUY UNDER RS 12000 IN POCO M3 PRO 5G AND REALME UMG GH

Phones Under Rs.12K: రూ.12వేల లోపు బెస్ట్ ఫోన్లు.. టాప్ కంపెనీ బడ్జెట్ డివైజ్‌లు ఇవే..!

బడ్జెట్‌లో దొరికే స్మార్ట్ ఫోన్లు ఇవే.

బడ్జెట్‌లో దొరికే స్మార్ట్ ఫోన్లు ఇవే.

ఇండియా (India)లో ఎంట్రీ లెవల్ ఫోన్లతో పాటు బడ్జెట్ ఫోన్ల (Budget Phones)పై టాప్ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా శామ్‌సంగ్ (Samsung), రెడ్‌మీ (RedMI), రియల్‌మీ వంటి కంపెనీలు ఈ సెగ్మెంట్ నుంచి బెస్ట్ మోడళ్లను రిలీజ్ చేశాయి. మీరు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. రూ.12వేల లోపు కొన్ని బెస్ట్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి

ఇంకా చదవండి ...
ఇండియాలో Entry Level ఫోన్లతో పాటు బడ్జెట్ ఫోన్లపై టాప్ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా శామ్‌సంగ్, RedMI, రియల్‌మీ వంటి కంపెనీలు ఈ సెగ్మెంట్ నుంచి బెస్ట్ Models రిలీజ్ చేశాయి. మీరు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. రూ.12వేల లోపు కొన్ని బెస్ట్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి

Samsung Galaxy F13
గెలాక్సీ F13 ఫోన్ ధర రూ. 11,999. ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో, 6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. శామ్‌సంగ్ Exynos 850 సిస్టమ్-ఆన్-చిప్ ద్వారా పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. వెనుకవైపు 50+ 5+2 MP కెమెరా సెటప్, 8MP సెల్ఫీ కెమెరా దీని సొంతం. ఈ ఫోన్ 15W అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో భారీ 6,000mAh బ్యాటరీతో వస్తుంది.

ఇదీ చదవండి: మానవత్వం పరిమళించింది.. కుక్క కోసం ఏకమైన ఓ గ్రామం.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!


Poco M3 Pro 5G
ఇది 6.5-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో వస్తుంది. గరిష్టంగా 6GB RAM, 128GB వరకు స్టోరేజ్‌ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ డివైజ్‌ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 48+2+2MP రియర్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP కెమెరా, 5G కనెక్టివిటీతో వచ్చిన పోకో M3 ప్రో 5G ఫోన్ ధర రూ.రూ. 11,499.

Realme Narzo 50A Prime
స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 4GB RAM, 128GB వరకు స్టోరేజ్‌తో లాంచ్ అయింది. డివైజ్ యూనిసాక్ T612 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 50MP ప్రైమరీ సెన్సార్, B&W సెన్సార్, మాక్రో సెన్సార్ ఉండే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 11,499.



Realme C35
ఈ ఫోన్ ధర రూ. 11,999. ఇది 6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది Unisoc T616 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. గరిష్టంగా 8GB RAM, 128GB వరకు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ షూటర్, ఒక B&W లెన్స్, మాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. దీని భారీ 5,000mAh బ్యాటరీ 18W క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తుంది.

 Redmi 10 Prime 2022
ఈ ఫోన్ ధర రూ. 11,499. ఇది 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో కూడిన 6.5-అంగుళాల ఫుల్ HD+ డాట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డివైజ్ మీడియాటెక్ హీలియో G88 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. గరిష్టంగా 6GB RAM, 128GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంది. వెనుకవైపు 50+8+2+2MP కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
Published by:Mahesh
First published:

Tags: Mobiles, Redmi, Samsung, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు