టెక్నాలజీలో (Technology) రోజురోజుకు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో దిగ్గజ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో మొబైల్‌ను(Mobile) లాంచ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తక్కువ ధరకే ప్రత్యేకమైన స్పెసిఫికేషన్లు(Specifications), ఫీచర్లతో ఎన్నో రకాల మొబైల్స్ మార్కెట్‌ల్లో(Mobile Market) అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మిడ్ రేంజ్ సెగ్మెంట్ (Mid Range Segment) (రూ.30వేలు)లోపు లభించే వివిధ కంపెనీల మొబైల్‌లను(Mobiles) పరిశీలిద్దాం.
* షియోమి 11ఐ ఫాస్ట్‌చార్జ్
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 120Hz FHD+ AMOLED డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది మీడియా టెక్ డైమెన్షిటీ 920 5G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని గరిష్ట స్టోరేజ్ కెపాసిటీ 8GB RAM-128GB. ఫోన్ వెనుక భాగంలో 108+8+2MP రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 67W TurboCharge టెక్నాలజీతో 5,160 mAh బ్యాటరీతో ప్రస్తుతం రూ.26,999కు అందుబాటులో ఉంది.
* రియల్‌మీ X7 ప్రో 5G
ఈ స్మార్ట్‌ఫోన్ 6.55-అంగుళాల సూపర్ AMOLED ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్షిటీ 1000+ 5G చిప్‌సెట్‌తో శక్తిని పొందుతుంది. దీని స్టోరేజ్ కెపాసిటీ 8GB RAM- 128GB. ఫోన్ వెనుక భాగంలో 108+8+2MP+B&W రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4,500 mAh బ్యాటరీతో దీన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఫాంటసీ, మిస్టిక్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో రూ.29,999కు అందుబాటులో ఉంది.
* వన్ ప్లస్ నార్డ్ 2
వన్‌ప్లస్ కంపెనీ నార్డ్ సిరీస్‌లో 2 పేరుతో కొత్త మోడల్‌ను ఇటీల లాంచ్ చేసింది. ఇది 6.43-అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీడియాటెక్ డైమెన్షిటీ 1200 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11-బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 11.3తో ఈ ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో 50+8+2MP రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇది 4,500 mAh బ్యాటరీతో ప్రస్తుతం రూ.29,999కు అందుబాటులో ఉంది.
* వివో వీ23 5జీ
ఈ స్మార్ట్‌ఫోన్‌ను 6.44-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో రూపొందించారు. మీడియాటెక్ డైమెన్షిటీ 920 5G ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12-బేస్డ్ ఫన్‌టచ్ OS 12తో రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో 64MP+8MP+2MP రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 50MP+8MPతో రెండు సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4,200 mAh. వివో వీ23 5జీ మోడల్ సన్‌షైన్ గోల్డ్, స్టార్‌డస్ట్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ప్రస్తుతం రూ.29,990కు అందుబాటులో ఉంది.
* శామ్‌సంగ్ గెలాక్సీ M53 5G
ఇది 6.67-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 2.4GHz ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. వెనుక భాగంలో 108+8+2+2MP రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 mAhగా ఉంది. ప్రస్తుతం రూ. 28,999కు మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, 5g technology, Smart mobile, Technology