బెస్ట్ ఫీచర్లు ఉన్న ఫోన్స్ (Phones) సొంతం చేసుకోవాలంటే రూ. 20 వేల నుంచి రూ.30 వేలలోపు మీ బడ్జెట్ ఉంటే సరిపోతుంది. ఈ ప్రైస్ రేంజ్లో లభించేవి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ (Smartphones) కావు కానీ ఇవి చాలా తక్కువ ధరలతోనే ఫ్లాగ్షిప్ ఫీచర్లను ఆఫర్ చేస్తాయి. ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే, చాలా బ్రాండ్ల మొబైల్స్ రూ.30 వేల లోపు ధరల్లో బెస్ట్ క్వాలిటీ కెమెరాల (Best Quality Cameras)తో వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.30,000లోపు ఫోన్లలో బెస్ట్ క్వాలిటీ కెమెరాలు గల టాప్ 5 స్మార్ట్‌ఫోన్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo Reno 7 5G
ఒప్పో రెనో 7 5జీ ఫోన్ 8జీబీ వేరియంట్ రూ.28,999కి లభిస్తోంది. ఈ మొబైల్లో ఫేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF)తో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy M53 5G
శాంసంగ్ గెలాక్సీ ఎం53 పవర్ఫుల్ కెమెరాలతో మొబైల్ కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ 6జీబీ వేరియంట్ రూ.26,499కి... 8జీబీ వేరియంట్ రూ.28,499కి దొరుకుతుంది. ఈ మొబైల్లో ఫేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF)తో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, రెండు 2MP డెప్త్, మాక్రో సెన్సార్లు ఆఫర్ చేశారు. ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
Realme 9 Pro+
రియల్మీ 9 ప్రో+ బెస్ట్ కెమెరాలతో వస్తుంది. ఈ ఫోన్ 6జీబీ వేరియంట్ ధర రూ.24,999గా, 8జీబీ వేరియంట్ ధర రూ.26,999గా నిర్ణయించారు. ఇందులో 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ కెమెరా అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్, 60వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది.
షియోమీ 11ఐ/ షియోమీ 11ఐ హైపర్‌ఛార్జ్
షియోమీ 11ఐ స్టార్టింగ్ ప్రైస్ రూ. 24,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చే షియోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ ఫోన్‌ను రూ.28,999కి మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఫోన్లు ఒకే రకమైన కెమెరా సెటప్‌తో లాంచ్ అయ్యాయి. వీటిలో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్, 5160ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా వీటిలో అందించారు.
OnePlus Nord CE 2 5G
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఓఎస్ అయిన ఆక్సిజన్ఓఎస్తో పాటు బెస్ట్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6జీబీ వేరియంట్ ధర రూ.23,999, 8జీబీ వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించారు. ఈ మొబైల్లో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 900, 65W ఫాస్ట్ ఛార్జింగ్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో కీలక ఫీచర్లగా నిలుస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Oppo, Samsung, Smart phones