Camera Smartphones: బెస్ట్ కెమెరా ఫోన్ల కోసం చూస్తున్నారా..? రూ.30 వేల లోపు ద బెస్ట్ ఫోన్లు ఇవే..!
ప్రతీకాత్మక చిత్రం
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవారు బెస్ట్ ఫీచర్లను వెతుకుతారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోన్లలో డిజైన్, పెర్ఫార్మెన్స్, కెమెరా అవుట్‌పుట్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా ఏది బెస్ట్‌గా ఉందో పరిశీలిస్తారు. రూ.30,000 లోపు లభిస్తున్న కెమెరా స్మార్ట్‌ఫోన్(Camera Smartphones)ల గురించి తెలుసుకోండి
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవారు బెస్ట్ (Best Features) ఫీచర్లను వెతుకుతారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోన్లలో డిజైన్, పెర్ఫార్మెన్స్, కెమెరా అవుట్‌పుట్, బ్యాటరీ (Battery), ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా ఏది బెస్ట్‌గా ఉందో పరిశీలిస్తారు. అదిరిపోయే ఫొటోలు (Photos), సెల్ఫీలు తీసుకోవడానికి చూస్తున్నవారు.. కెమెరా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం బెస్ట్ ఫోటోలను అందించేందుకు ప్రత్యేకంగా రూపొందిన వివిధ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రూ.30,000 లోపు లభిస్తున్న కెమెరా స్మార్ట్‌ఫోన్(Camera Smartphones)ల గురించి తెలుసుకోండి.
* రూ.30000 లోపు అందుబాటులో ఉన్న టాప్ కెమెరా స్మార్ట్ఫోన్లు * OPPO F21 Pro
వెనుక వైపు లెదర్ లుక్, ట్రెండ్‌సెట్టింగ్ డిజైన్‌తో పోకో ఎఫ్21 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటోంది. ఇది 64MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP మైక్రోలెన్స్, 2MP డెప్త్ కెమెరాతో గొప్ప కెమెరా ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. 32MP సెల్ఫీ కెమెరా కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.22,999గా ఉంది.
* Realme 9 Pro+
రియల్మీ 9 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి రూ.30 వేల లోపు లభించే బెస్ట్ ఆప్షన్. దీని ధర మార్కెట్లో రూ.26,999గా ఉంది. రియల్మీ 9 ప్రో ప్లస్ OISతో 50MP ప్రైమరీ కెమెరాను, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరాను సపోర్ట్ చేస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 920 5G చిప్సెట్, 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4,500mAh బ్యాటరీ వంటి ఫీచర్లను అందిస్తుంది.
* iQOO Z6 Pro
ఐక్యూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ అయినప్పటికీ.. ఇది 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో లెన్స్ సెటప్‌తో పాటు 64MP ప్రైమరీ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో బెస్ట్ ఫొటోలను అందిస్తుంది.
* Poco F4 5G
పోకో ఎఫ్4 5జీ స్మార్టఫోన్ ఇటీవలే లాంచ్ అయిన మిడ్ రేంజ్ ఫోన్. ఇది దాదాపు అన్ని విభాగాలలో ఆకర్షిస్తోంది. దీని ధర ప్రస్తుతం రూ.27,999గా ఉంది. ఇది OISతో 64MP కెమెరాను అందిస్తుంది. 8MP వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ సెటప్ ఉంది. జతచేయబడింది. షట్టర్ స్పీడ్‌తో అనేక DSLR-వంటి కెమెరా ఎఫెక్ట్‌లను పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.