TOP BEST CAMERA APPS FOR ANDROID IOS USERS FOR QUALITY PHOTOS KNOW DETAILS GH EVK
Camera apps: పండుగ రోజు ఫోటోలు దిగుతున్నారా.. అయితే ఈ టాప్ కెమెరా యాప్స్‌ను ట్రై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
Camera apps: దేశంలో పండుగల సీజన్ (Festival Session) ప్రారంభమైంది. కుటుంబం, స్నేహితుల మధ్య జరుపుకునే పండుగ వేడుకలను ఎల్లప్పుడూ గుర్తుండేలా కెమెరా (Camera)ల్లో బంధించాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఆ ఫోటోలను మరింత అందగా కనిపించేలా ఉండాలనుకోవడం సహజం. అందుకోసం ఎటువంటి యాప్‌లు వాడాలో తెలుసుకోండి
దేశంలో పండుగల సీజన్ (Festival Session) ప్రారంభమైంది. కుటుంబం, స్నేహితుల మధ్య జరుపుకునే పండుగ వేడుకలను ఎల్లప్పుడూ గుర్తుండేలా కెమెరా (Camera)ల్లో బంధించాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఆ ఫోటోలను మరింత అందగా కనిపించేలా ఉండలనుకోవడం సహజం. అలాంటప్పుడు ఏం చేయాలి. ఏ యాప్ వాడాలో తెలిస్తే ఫోటోలను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ (Smart Phone)లో ఎంత హైక్వాలిటీ కెమెరా (High Quality Camera) ఉన్నా సరే నచ్చినట్లు ఫోటోలు తీయాలంటే కొన్ని యాప్స్ (Apps) అవసరం. ఈ యాప్స్ ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ పరికరాల్లో అందుబాటులో ఉంటాయి. దీపావళికి మీ స్మార్ట్‌ఫోన్‌తో మెరుగైన ఫోటోలు తీసేందుకు అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ కెమెరా యాప్‌లను పరిశీలిద్దాం.
రెట్రికా
ఇన్స్టాగ్రామ్ (Instagram) లవర్స్ రెట్రికా యాప్‌ను తరచుగా వినియోగిస్తుంటారు. రెట్రికా అన్ని రకాల ఫిల్టర్స్‌తో వస్తుంది. ఈ ఉచిత అప్లికేషన్ బ్లర్ (Application Blur), విగ్నేట్, గ్రెయిన్‌తో సహా 190 ఫిల్టర్లను అందిస్తుంది. వీటికి అదనంగా కేటలాగ్ ద్వారా షఫుల్ చేసే రాన్‌డమ్ ఫిల్టర్ బటన్ కూడా ఉంటుంది.
కెమెరా 360
కెమెరా 360 యాప్ ద్వారా మీ మనసుకు నచ్చినట్లు అన్ని రకాల ఫోటోలను తీయవచ్చు. ఈ ఉచిత యాప్ అనేక స్టిక్కర్లు (Stickers), కార్టూన్ లేయర్లతో వస్తుంది. ఈ స్టిక్కర్లతో మీ ఫోటోలను మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు. దీనిలో అనేక మేకప్, బ్యూటీ ఫిల్టర్లు కూడా ఉన్నాయి. మీ ముఖంపై ఎటువంటి మేకప్ (Makeup) లేకుండానే అందంగా తీర్చిదిద్దవచ్చు.
సైమెరా
సోషల్ మీడియాలో మీ ఫోటోలను పోస్ట్ చేసేందుకు సైమెరా కెమెరా యాప్ ఉపయోగపడుతుంది. ఈ ఉచిత ఫోటో ఎడిటర్ (Photo Editor), బ్యూటీ కెమెరా యాప్‌తో మీరు ఫోటోలు తీస్తున్నప్పుడు అనేక రకాల బ్యూటీ ఫిల్టర్ల (Beauty Filters)ను వర్తింపజేయవచ్చు. అలాగే, బాడీ ఎడిటర్ ఫిల్టర్లను ఉపయోగించి మీ అభిరుచికి తగ్గట్లు బాడీ స్టైల్‌ను మార్చుకోవచ్చు.
పనోరమా 360
ఎంత పెద్ద లొకేషన్లోనైనా 360 డిగ్రీస్‌లో ఫోటోలను తీసేందుకు ఈ యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్లినప్పుడు ఈ యాప్ తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోండి. పనోరమా 360 అనేది మీ గో-టు యాప్. ఈ పనోరమా షూటింగ్ మోడ్‌తో వస్తుంది. ఆటోమేటిక్ జియో-ట్యాగింగ్ (Geo Tagging), పనోరమిక్ చిత్రాలను 3D స్పియర్లుగా మార్చగలిగే ఫీచర్లను దీనిలో అందించింది.
ఓపెన్ కెమెరా
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పరిచయం అక్కర్లేని యాప్ ఓపెన్ కెమెరా. ఇది మాన్యువల్ మోడ్, ఆటో-లెవల్, వాయిస్ కౌంట్‌డౌన్ వంటి రిమోట్ కంట్రోల్ (Remote Controller) ఫీచర్లతో వస్తుంది. ఈ యాప్ షట్టర్/జూమ్ ఆప్షన్లతో వస్తుంది. దీనిలో ఆన్-స్క్రీన్ హిస్టోగ్రామ్, ఫోకస్ పీకింగ్ వంటి అధునాతన ఫీచర్లను అందించింది. ఈ దీపావళి సమయంలో, మాన్యువల్ మోడ్ లాంగ్-ఎక్స్పోజర్ నైట్ షాట్ (Night Shot) లను తీయడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది.
బోనస్ ఐఇమ్
ఐఇమ్ అనేది పాపులర్ కెమెరా యాప్. అయితే ఈ యాప్‌కు సబ్స్క్రిప్షన్ (Subscription) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనిలోని అనేక అడ్వాన్సుడ్ ఫిల్టర్లతో మెరుగైన ఫోటోలను తీయవచ్చు. దీనిలో తీసిన ఫోటోలను స్పాటిఫై వంటి మ్యూజిక్ యాప్ ప్లాట్‌ఫామ్ (App Platform)లలో విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. ఈ యాప్‌లో ఇన్‌బిల్ట్ ఇమేజ్ ఎడిటర్ కూడా ఉంది. ఇది మీ ఫోటోలను మరింత అందంగా తీర్చిదిద్దుతుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.