హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో ఇండియాలో లాంచ్ అయ్యే టాప్ మోడల్స్ ఇవే

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో ఇండియాలో లాంచ్ అయ్యే టాప్ మోడల్స్ ఇవే

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కి ఇది గుడ్ న్యూసే

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కి ఇది గుడ్ న్యూసే

కొన్ని రోజులుగా ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield ) 2022-23లో లాంచ్‌ చేయనున్న బైక్‌ల (Bikes) గురించి చర్చ నడుస్తోంది. కొత్త మోడళ్ల డిజైన్‌, ఫీచర్‌లను వివరిస్తూ నివేదికలు బయటకు వచ్చాయి.

కొన్ని రోజులుగా ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 2022-23లో లాంచ్‌ చేయనున్న బైక్‌ల గురించి చర్చ నడుస్తోంది. కొత్త మోడళ్ల డిజైన్‌, ఫీచర్‌లను వివరిస్తూ నివేదికలు బయటకు వచ్చాయి. బ్రిటిష్ వాహన తయారీ సంస్థ ఇప్పటికే భారతదేశంలోని వినియోగదారుల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్‌ను లాంచ్‌ చేసింది. ఇప్పుడు కంపెనీ హిమాలయన్ 450, మెటార్ 650, క్లాసిక్ 650, హంటర్, షాట్‌గన్ వంటి కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త మోడళ్లలో హిమాలయన్ 450 పవర్‌ఫుల్‌ ఇంజిన్‌తో అందుబాటులోకి వస్తుండటంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

లాంచ్‌ కానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు ఇవే..

Royal Enfield Super Meteor 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటార్ ఇప్పటికే భారతదేశంలో అందుబాటులో ఉంది. అయితే ఈ కొత్త మోడల్‌కు సూపర్ మెటార్ అని పేరు పెట్టారు. ఇది మోటార్‌సైకిల్ పటిష్టమైన, అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఉండబోతోంది. కొత్త మోటార్‌సైకిల్ ఇంటర్‌సెప్టర్ 650లో వచ్చిన అదే ఇంజిన్‌తో వస్తున్నట్లు సమాచారం. అయితే ఇంజిన్‌ ట్యూనింగ్‌లు ఎలా ఉంటాయనే దానిపై స్పష్టత లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ సూపర్ మెటార్ 650, 2019లో వెల్లడించిన KX కాన్సెప్ట్‌లోని డిజైన్‌ను పోలి ఉంటుందని చెబుతున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్  (Royal Enfield Classic 650)

బైక్ డిజైన్ వివరాలను తెలియజేసే కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. బైక్‌లో రౌండ్‌ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ వంటివి ఉన్నాయని సమాచారం. రౌండ్‌ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, స్ప్లిట్ డిటాచబుల్ పిలియన్ యూనిట్‌, 649 సిసి ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ వంటి ఫీచర్‌లను అందిస్తున్నట్లు తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ (Royal Enfield Hunter)

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రోడ్‌స్టర్ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. వినియోగదారుల ఎక్కువగా ఎదురుచూస్తున్న బైక్‌లలో ఇది కూడా ఒకటి. ఇది రౌండ్‌ హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్‌లతో వస్తోందని సమాచారం. ఈ బైక్ క్లాసిక్ 350, మెటోర్ 350లో ఉన్న OHC లేఅవుట్‌తో అదే 349cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో సిద్ధమైందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

హిమాలయన్ (Royal Enfield Himalayan 450)

హిమాలయన్ కొత్త వెర్షన్ లాంచ్‌కు సిద్ధమైంది. లాంచ్‌కు ముందు ఇండియా రోడ్లపై బైక్‌ను పరీక్షిస్తున్నారు. ఈ బైక్ అప్‌డేటెడ్‌ 450cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తోంది. ప్రస్తుతం ఇంజిన్ పవర్ ఫిగర్స్ వివరాలు అందుబాటులో లేవు. అయితే ఇది 40hp, 45Nm టార్క్ ఉత్పత్తి చేస్తుందని అంచనా. బైక్ మూడు రైడ్ మోడ్‌లు, పెద్ద చక్రాలతో ఉండే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ (Royal Enfield Shotgun)

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ ఫోటోలు వివిధ వర్గాల నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల నటుడు సంగ్ కాంగ్ కూడా బైక్ ఫోటోలను షేర్‌ చేశారు. డిజైన్ వివరాలను వెల్లడించారు. బైక్ ట్రిప్పర్ నావిగేషన్‌తో సెమ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తో వస్తుందని భావిస్తున్నారు. కాంటినెంటల్ GT 650, ఇంటర్‌సెప్టర్ 650 వంటి ఇంజిన్‌లు ఈ బైక్‌కు కూడా వినియోగించి ఉంటారని చెబుతున్నారు.

Published by:Mahesh
First published:

Tags: Bikes, Royal Enfield

ఉత్తమ కథలు