హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Top 5 Smartphones: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అమెజాన్ సమ్మర్ సేల్‌లో లభిస్తున్న టాప్ 5 ఫోన్లు ఇవే..

Top 5 Smartphones: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అమెజాన్ సమ్మర్ సేల్‌లో లభిస్తున్న టాప్ 5 ఫోన్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon).. సమ్మర్ సేల్ (Summer Sale) పేరుతో స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S20 FE, శామ్‌సంగ్ గెలాక్సీ M12, టెక్నో స్పార్క్ 8C వంటి ఎన్నో స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఇంకా చదవండి ...

ఈ-కామర్స్(E Commerce) దిగ్గజం అమెజాన్ (Amazon).. సమ్మర్ సేల్ (Summer Sale) పేరుతో స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ(Samsung Galaxy) S20 FE, శామ్‌సంగ్ గెలాక్సీ M12, టెక్నో స్పార్క్ 8C వంటి ఎన్నో స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు డిస్కౌంట్(Discount) అందిస్తోంది. ఈ సేల్‌లో బెస్ట్ ఆఫర్లతో ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లను పరిశీలించండి.

IT Firm: ఉద్యోగులకు ఐటీ కంపెనీ కొత్తరకం సేవలు.. పెళ్లి సంబంధాలు చూడటం, స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం..


Tecno Spark 8T

ఈ ఫోన్ 50MP హై రిజల్యూషన్ కెమెరాతో వస్తుంది. డ్యూయల్ ఫ్రంట్ ఫ్లాష్‌తో వచ్చిన 8MP ఫ్రంట్ క్యామ్‌, కొత్త మెటల్ కోడింగ్ డిజైన్‌తో ఈ డివైజ్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హీలియో G35 గేమింగ్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌ ధర అమెజాన్‌లో రూ.8,999గా ఉంది.

* Samsung Galaxy M12

స్మార్ట్‌ఫోన్ Exynos850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6000 mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్న క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ. 12,999. అమెజాన్ సమ్మర్ సేల్‌లో దీన్ని రూ. 9,999కి కొనుగోలు చేయవచ్చు.

* Samsung Galaxy S20 FE 5G

ఈ 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌గ్రాగన్ 865 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టేరేజ్‌, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 74,999. సమ్మర్ సేల్‌లో దీన్ని రూ.34,990కు కొనుగోలు చేయవచ్చు.

Gadgets: సమ్మర్‌లో స్మార్ట్ గాడ్జెట్స్ హీట్ అవుతున్నాయా..? మీ డివైజ్‌లను సేఫ్‌గా, కూల్‌గా ఉంచే టిప్స్ పాటించండి..


* Samsung Galaxy M33 5G

గెలాక్సీ M33 ఫోన్ Exynos 1280 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 50MP ప్రైమరీ లెన్స్, 5MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్‌తో యూజర్లను ఆకట్టుకుంటుంది. 8MP సెల్ఫీ కెమెరాతో వచ్చిన ఈ డివైజ్ అసలు ధర రూ. 24,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ను తాజా సేల్‌లో రూ.17,999కి కొనుగోలు చేయవచ్చు.

* Tecno Spark 8C

టెక్నో స్పార్క్ 8C ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది గరిష్టంగా 89 రోజుల స్టాండ్‌బై బ్యాటరీ లైఫ్‌ను అందించే 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 23 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 53 గంటల కాలింగ్ లేదా 137 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను కస్టమర్లు ఆస్వాదించవచ్చు. స్లీప్ మోడ్ ఆప్టిమైజేషన్, అల్ట్రా బ్యాటరీ సేవర్ మోడ్ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌ ధర రూ. 10,999 ఉండగా, దీన్ని ఆఫర్‌లో రూ.7,999కు కొనుగోలు చేయవచ్చు.

First published:

Tags: 5g mobile, Amazon, AMAZON INDIA, Best, Smart phones

ఉత్తమ కథలు